Song no:
ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను } 2
నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును నిరతము నిన్నే కీర్తింతును
హల్లెలూయ హల్లెలూయా (3) {ఉత్సాహధ్వనితో}
- నాకొండయు నాకోటయు నాఆశ్రయ దుర్గము నీవేకదా (2)
నీ కృపను బట్టి ఆనంద భరితుడనై సంతోషించెదను (2) {హల్లెలూయ}
- నా దాగుచోటు నాకేడెమా శ్రమలోనుండి రక్షించెధవు (2)
నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే (2) {హల్లెలూయ}
Song no:
కలవంటిది నీ జీవితం - కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధముచేయకుమా
- నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
యువకా అది కాలు జారే స్థలము -
ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోర నరకము -
యువకా అదియే నిత్య మరణము
- నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగామార్చును పాపం క్షమియించి రక్షించును -
ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు } 2 {కలవంటిది}
Song no:
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము
మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును
అభయ మభయ మభయ మెప్పు
డానంద మానంద మానంద మౌగ ||దేవుడే||
పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను
సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ||
-
దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును
ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ||
-
రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన
పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ||
-
విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన
చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ||
-
పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును
నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ||
-
కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా
ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
Song no: 90
ముద్దు మురిపాల చిన్నారి నాన్నా-సద్దు చేయకే నా చిట్టికన్నా
ఈ మాట వింటే మదిని దాచుకుంటే
నీ జీవితంలో సిరుల పంటే - ఆనందం కలకాలం నీవెంటే
జోలాలీ లాలీ జోలాలీ (2)
- తల్లిదండ్రులను గౌరవించి - తనవారినెల్లను ప్రేమించి
శత్రువులను సయితము క్షమించి - పరిచారకుడుగా జీవించి
దేవాదిదేవుడే అత్యంత దీనుడై
ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను
ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం
ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం - జోలాలీ లాలీ జోలాలీ (2)
- దేవుని ఉపదేశమును మరువక-దయను సత్యమునెన్నడు విడువక
బుద్ది వివేచనకై వెదకిన - భయభక్తులు యేసునియందుంచిన
సుఖజీవము కలిగి ధరలో జీవింతువు
దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు
నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం
పరలోకం చేరేందుకు ఏకైకమార్గం - జోలాలీ లాలీ జోలాలీ (2)
Song no:
నీ కృప తప్ప నాకేమి లేదయ్యా నీకృప తప్ప నా కేమి లేదయ్యా కృపా నీవే ఆధారం కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )
- అన్నీ వేళలా అన్నీ కాలాల్లో ఆదరించావు (2)
ఆదరించావు నన్ను అభిషేకించావు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- కృంగిన వేళలో కృపను చూపావు(2) నను హత్తుకున్నావు నను ఎత్తుకున్నావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
- అందరు విడచినా అన్నీపోయినా(2)
అభిషేకం నాకిచ్చినావు అండగా నీవు నిలచినావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
Song no: 131
నీ వైపు చూస్తూ నిన్నే సేవించనీ
నిన్ననుసరిస్తూ నీకై జీవించనీ
నీలోనే నను నిలిపి ఫలియించనీ
నీ సేవలో గడిపి తరియించనీ {నీ వైపు చూస్తూ}
- నీ సహవాసము ఆనందమయము
నీ సన్నిధిలో లేదే భయము } 2
నీ ఆలోచన నాకెంతో ప్రియము
నీయందే నా అతిశయము
నీ కృపకంటే మించినదే లేదయ్యా
నీ దయ ఉంటే చాలు కదా యేసయ్యా } 2 {నీ వైపు చూస్తూ}
- నీ చేతికార్యము ఆశ్చర్యకరము
నీ నీతివాక్యము ఎంతో స్థిరము
నీ కనికరము ధరణికి వరము
నీ ప్రేమ నిలుచు నిరంతరము {నీ కృపకంటే}
- నీ జీవమార్గము చేర్చును స్వర్గము
నీ కుడిహస్తము కూర్చును సౌఖ్యము
నీ నామమందే రక్షణ భాగ్యము
నీ దీవెనొందే బ్రతుకు ధన్యము {నీ కృపకంటే}
Song no: 120
ఎవడండీ బాబూ వీడు - ఎంత చెప్పినా వినడు
గుప్పుగుప్పున వదిలేస్తాడు - తప్పంటే అసలొప్పుకోడు
- తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు
పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు } 2
దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు } 2
గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు } 2 {ఎవడండీ}
- సరదా అంటూ మొదాలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు
డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు } 2
ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు } 2
శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు } 2 {ఎవడండీ}
- దేహమే దేవదేవుని నివాసమని మర్చిపోతాడు
పరిశుద్దంగ ఉంచుమనే క్రీస్తు ఆజ్ఞనే లెక్కచేయడు } 2
పాడు వ్యసనములతోనే నరకమునకు పోతాడు } 2
యేసుక్రీస్తుని నమ్మినచో పరిశుద్ధుడు తానౌతాడు } 2 {ఎవడండీ}