Aanandhamanandha mayenu nadhu priyakumaruni ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని

Song no: 628

    ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం||
  1. ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||
  2. అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం||
  3. తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||
  4. నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం||
  5. విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానం||
  6. అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||
  7. దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||

Aalinchu deva na manavula nalimchu ఆలించు దేవా నా మనవుల నాలించు

Song no: 375

    ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
  1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||నాలించు||
  2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||నాలించు||
  3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||నాలించు||
  4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||నాలించు||
  5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||నాలించు||

Aanandha magu mukthi ye na mandhiramu ఆనంద మగు ముక్తి యే నా మందిరము

Song no: 347

    ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||
  1. పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||
  2. బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
  3. ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||

Anamdham anandham dhinadhinam anandham ఆనందం ఆనందం దినదినం ఆనందం

Song no: 630

    ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)
  1. తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే||
  2. ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే||
  3. ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||

Aadharimpumu yesuva ni nna srayimchithi ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి

Song no: 321

    ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||
  1. నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
  2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||
  3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||
  4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||
  5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||

Aathma nadupu sa thyamu loni kipude ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే

Song no: 239

    ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
  1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||
  2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||
  3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||
  4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||
  5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||

Aathma srumgarinchu kommu papa gruha veedi pommu ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము

Song no: 625

    ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము వెల్గులోని కింకరమ్ము తేజరిల్లు మీ దినము "రక్షణాధి కారవిందు నీకు జేయ బోవుముందు భూదినంబు లేలు ఱేడు నిన్ను జేర వచ్చు నేడు"
  1. పెండ్లి కూతురెట్లు భర్త నట్లు ప్రేమ జూపుకర్త నాయ నెంతో జాలిగుండె తోడ దల్పు దట్టు చుండె "నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" అందు హృదయంబుతోడ యేసునాద నాహ్వానించు.
  2. శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు జేయ గొండ్రు బల్ధనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చు చుంటి యుచితంబు కాకయున్న నీ శరీర రక్తముల్గొనంగ నీర రాసులైన గనులైన జాలునా మరేవియైన?
  3. నిశ్చలంపు బ్రేమ నిన్ను చీల్చి భూమికంటె నన్ను మాకునైత్వదీయ ప్రాణ మిచ్చినాడ వట్లు గాన ఆమేన్. చిందబడ్డ నీ శరీర రక్త బిందు లింపుమీర రాత్రి భోజనాన మాక నంత ప్రేమ పెంచుగాక
  4. యేసు! జీవ భక్తమైన నీదు బల్ల గంటినైన వ్యర్థ నష్టతల్ల భింప నీకు, దీననే నశింప భూమి మీద బోలె మింట నిన్ను గూడి త్రాగి తింటి కీసు భోజనంబు నందు నీదు ప్రేమ జూపుమందు,