-->
Song no: 347
ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||
పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||
బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||
Song no: 630
ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)
తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే||
ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే||
ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||
Song no: 321
ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||
నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||
ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||
పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||
పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||
Song no: 239
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||
అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||
నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||
సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||
దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||
Song no: 625
ఆత్మ! శృంగారించు కొమ్ము పాప గుహ వీడి పొమ్ము వెల్గులోని కింకరమ్ము తేజరిల్లు మీ దినము "రక్షణాధి కారవిందు నీకు జేయ బోవుముందు భూదినంబు లేలు ఱేడు నిన్ను జేర వచ్చు నేడు"
పెండ్లి కూతురెట్లు భర్త నట్లు ప్రేమ జూపుకర్త నాయ నెంతో జాలిగుండె తోడ దల్పు దట్టు చుండె "నా ప్రియుండ! వేగరమ్ము ముద్దు బెట్ట నిమ్ము నన్ను" అందు హృదయంబుతోడ యేసునాద నాహ్వానించు.
శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు జేయ గొండ్రు బల్ధనంబు సర్వ శ్రేష్ఠమౌ వరంబు లిచ్చు చుంటి యుచితంబు కాకయున్న నీ శరీర రక్తముల్గొనంగ నీర రాసులైన గనులైన జాలునా మరేవియైన?
నిశ్చలంపు బ్రేమ నిన్ను చీల్చి భూమికంటె నన్ను మాకునైత్వదీయ ప్రాణ మిచ్చినాడ వట్లు గాన ఆమేన్. చిందబడ్డ నీ శరీర రక్త బిందు లింపుమీర రాత్రి భోజనాన మాక నంత ప్రేమ పెంచుగాక
యేసు! జీవ భక్తమైన నీదు బల్ల గంటినైన వ్యర్థ నష్టతల్ల భింప నీకు, దీననే నశింప భూమి మీద బోలె మింట నిన్ను గూడి త్రాగి తింటి కీసు భోజనంబు నందు నీదు ప్రేమ జూపుమందు,
Song no: 461
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||
నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||
Song no: 546
ఆ చిన్న వారిలో నేనుండి యున్న నహాహా మా యేసును నేఁ జూచి యుందు ||నా చిన్న||
ప్రభు యేసు ప్రపంచమం దుండినపుడు పసి బాలకులఁ బిల్చి ప్రార్థించె ననెడు ప్రాచీన కథను నేఁ జదువుచున్నప్పుడు వారిలో నే నున్న నెంతో బాగుండు ||నా చిన్న||
ఆ కరుణ కరము నా తలపైని వ్రాలి యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య నేక బాలకుల రానిమ్మను జాలి తోఁ గర్త పిలుపు విన నాకెంతో మేల్మి ||యా చిన్న||
ఇ కమీఁదఁ బ్రార్థన ద్వారా దర్శింతున్ బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న మ్మకముతో యేసుని వెదకుచు నుందు సుఖ లోకమందునఁ జూచి వినుచుందు ||నా చిన్న||
శుద్ధుల కొఱకు రాజ్యము నేలన్ సిద్ధము చేయఁ బ్రభు యేసు వెళ్లెన్ ముద్దు పాపలు వత్తు రందున విను మ శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||