Nee prematho nannu nimpumu deva నీ ప్రేమతో నన్ను నింపుము దేవా

1 కొరిథి 13:13

నీ ప్రేమతో నన్ను
నింపుము దేవా
నీ ప్రేమను పంచుట
నేర్పుము దేవా "2"
జ్ఞానమున్న కాని
విశ్వాసమున్న కాని
ప్రవచింప గల్గినకాని
ప్రేమలేని వాడనైతే
వ్యర్థుడనయ్య   "2"
                       " నీ ప్రేమతో "
(1)
నీ ప్రేమ సహానం కలది
నీ ప్రేమ దయగలది  "2"
నీ ప్రేమకు డంబము లేదు
నీ ప్రేమకు గర్వము లేదు
నీ ప్రేమకు అసూయ లేదు
నీ ప్రేమకు స్వార్ధము లేదు
నీ ప్రేమకు అమర్యాద లేదు
నీ ప్రేమకు కోపము రాదు
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించే వరమియుము "2"
                       " నీ ప్రేమతో "
(2)
నీ ప్రేమ దోషం లెక్కింపదు
నీ ప్రేమ కీడులో ఆనందించదు "2"
నీ ప్రేమ సత్యమునే సంతసించును
నీ ప్రేమ సమస్తమును భరియించును
నీ ప్రేమ సమస్తమును విశ్వసించును
నీ ప్రేమ సమస్తమును ఆశించును
నీ ప్రేమ సమస్తమును సహించును
నీ ప్రేమ శాశ్వతముగ నిలి చిపోవును
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించె కృపనీయుము   "2"
                       " నీ ప్రేమతో "

Preminchedha yesu raja ninne preminchedha ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

Vijaya veeruda yesu prabhuva jayamu jayamu neeke విజయ వీరుడా యేసుప్రభువా జయము జయము నీకే

పల్లవి: విజయ వీరుడా యేసుప్రభువా– జయము జయము నీకే
అపజయమెరుగని యుద్దశూరుడ — జయము జయము నీకే (2)
జయమూ…విజయమూ …(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే

1. భయము వణకు కలిగెను – అపవాదికి (అపవాదికీ)
తోక ముడిచి పారిపోయెను – సిగ్గుతో (సిగ్గుతో) (2)
నీ బలము చూచిన శత్రువుకు – చెమటలు పట్టెను
తరుముకొచ్చిన అపవాది సైన్యము – చిత్తుగా ఓడెను (2)
సైన్యములకు అధిపతి నీవే…(2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా ……..8

2. నీప్రేమలోనే విజయమూ ఉన్నది (మాకున్నది)
అంతమువరకూ నిలుచునది – నీప్రేమయే (ఆ ప్రేమయే) (2)
ఆ ప్రేమ తోనే జయించినావే —
ఈ లోకమంతటిని సర్వసృష్టి నీ ముందు నిలిచి –జయమని పాడెను (2)
సైన్యములకు అధిపతి నీవే(2)
విజయ వీరుడా యేసుప్రభువా–జయమూ జయమూ నీకే
అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే (2)
జయమూ..విజయమూ..(2)
సైన్యములకు అధిపతి నీవే (2)
విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే
అపజయమెరుగని — యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా …….8

O dhehama na sarirama nikidhi nyayama ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా

పల్లవి:  ఓ దేహమా నా శరీరరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా
నను చెరుపుటే నీ ధ్యేయమా నను భక్షించుటే నీకానందమా

చరణం 1 :
ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో ఎన్నోవాటితో నన్ను కదలకుండా కట్టేసినావు
కొంచమైన జాలి నాపై చూపకుండా వింత వింత విందులలో ఉత్సహించినావు

చరణం 2 :
కన్నులలోని కెమెరా పాపాన్నే చూస్తున్నది ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది
చూసినవి చేసేదాకా వదలనన్నది
చేసినవెంటనే నిందిస్తు ఉన్నది

చరణం 3 '
దేహమెందుకున్నదో శరీరరం మరిచియున్నది ఆత్మకు శరీరమెప్పుడూ సహకరించనంటున్నది
బానిసలా నన్ను మార్చుకున్నది భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది

ఆత్మను నరకానికి పంపుతున్నది పరలోకంలో ఉన్న దేవునికి కన్నీరే మిగిల్చుచున్నది అందుకే

Batasari o batasari vinavayya okkasari బాటసారి ఓ బాటసారి,వినవయ్యా ఒక్కసారి

బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి|2|
పయనించే బాటసారి,బాటసారి ఓ బాటసారి
వినవయ్యా ఒక్కసారి

వెండి తాడు విడిపోవును
బావి యొద్ద చక్రం పడిపోవును |2|
ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే |2|
నీటి బుడగలాంటిదీ జీవితం |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

పరదేశులం యాత్రీకులం
శాశ్వతం కాదు ఈ దేహం |2|
మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును |2|
ఆత్మ దేవుని యొద్దకు చేరును |2|
విసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది |2|
||బాటసారి||

నీ జీవిత గమ్యమెక్కడో
యోచింపవా ఓ మానవా |2|
అగ్ని ఆరదు పురుగు చావదు|2|
నిత్య నరకమునకు పోవద్దురా|2|
యేసయ్యను నమ్ముకో, పరలోకం చేరుకో|2|
||బాటసారి||

Na priyuda yesayya na sailama rakshana srumgama నా ప్రియుడా యేసయ్య నా శైలమా రక్షణ శృంగమ

నా ప్రియుడా యేసయ్య..........
నా శైలమా రక్షణ శృంగమ........
యుగయుగాలు నిన్నే వివరించెద
నా స్వాస్థమ నిన్నే దరియించెద
నిన్నే సేవించెద.....................
                           " నా ప్రియుడ "
(1)
పరిమళించెనే ప్రతివసంతము.......
మధురమైన నీ ప్రేమలో................
అసాధ్యమైన కార్యాలెన్నో.............
జరిగించేని నీ బాహువు............... "2"
ప్రతి దినం ప్రతి క్షణం
నన్ను వెంబడించె  నీవాగ్దానం....... "3"
                           " నా ప్రియుడ "
(2)
సేదదీరేనే నా ప్రాణం..................
విడువని నీదు కృపలో...............
అనంతమైన ఆనందాన్ని............
కలిగించెనునీకౌగిలి....................
ప్రతి దినం ప్రతి క్షణం
నను వెంబడించె నీ అభిషేకం...... "3"
                          " నా ప్రియుడ "
(3)
ఆత్మ వసుడనై ఆరాధించేద.........
అనుదినము నీ మహిమలో.........
అక్షయమైన అనుబంధాన్ని..........
అను గ్రహించెను నీ సిలువ.......... "2"
ప్రతి దినం ప్రతి క్షణం
నను వెంబడించె నీసహవాసం...... "3"
                         " నా ప్రియుడ "

Siluvalo aa siluvalo a ghora kalvarilo సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥
వెలియైన యేసయ్యా
బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥
                                                 ॥సిలువలో॥
1
నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళిని చీల్చెనే  }
నీ సుందర దేహమునే       }॥2॥
తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు॥2॥
॥వెలియైన॥                              ॥సిలువలో॥
2
వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే
మోమున ఉమ్మివేయ మౌనివైనావే
దూషించి అపహసించి హింసించిరా నిన్ను ॥2॥
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ॥2॥
॥వెలియైన॥                              ॥సిలువలో॥
3
నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్  నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ॥2॥
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను॥2॥
॥వెలియైన॥                              ॥సిలువలో॥