Nee numdi veedi ne brathakagalana na margama నీ నుండి వీడి నే బ్రతకగలనా నా మార్గమా నాసత్యమా

నీ నుండి వీడి నే బ్రతకగలనా ||2||
నా మార్గమా నాసత్యమా
నా జీవమా నా సర్వమా

ఆదిలో వాక్కును పలికిన దేవా
ఈ సృష్టిని చేసిన ప్రభువా
నీ కుమారుని పంపినదేవా
మమ్ము రక్షించిన ప్రభువా
నీ ప్రేమ ప్రకటింప నా తరమా
నీ మహిమ గ్రహింప నాకు సాధ్యమా ||నా మార్గమా||

నీ రూపమును ఇచ్చిన దేవా
నాకు ప్రాణం పోసిన దేవా
నన్ను పేరుతో పిలిచిన దేవా
నన్ను దీవించిన ప్రభువా
నువ్వులేక నేనేమి చేయగనైయ్యా
నువ్వు లేక నేనే లేనయ్యా
        ||నా మార్గమా||

Yemani pogadudha deva nee krupalo nee premalo ఏమని పొగడుద దేవా నీ కృపలో నీ ప్రేమలో

ఏమని పొగడుద దేవా
నీ కృపలో నీ ప్రేమలో
నేను పొందిన వరములకై
దేవా ప్రభువా దేవా నా ప్రభువా

ప్రభు నీకు సాటేవరు
నిన్ను పోలిన వారెవరు
కడలి పొంగు నడిచెదము
సంద్రమును అనచెదము
విజయములు ఒసగెదవు
          ||ఏమని||

నీవే నా జనకుడవు
నీవే నా దేవుడవు
జేష్ఠునిగా నన్ను నిలిపి
అధికునిగా దీవించి
శుభములతో దీవించి
       ||ఏమని||

Silanaina nannu silpivai marchavu naloni శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/
నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి /2/శిల/

1.మొడుబారిన నాజీవితం – నీప్రేమతోనే చిగురింపచేసావు /2/
నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/
వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/

2.ఏవిలువలేని అభాగ్యుడను నేను – నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/
నాయెడల నీకున్న తలంపులు విస్తారం /2/
నీకొరకే నేను జీవింతునిలలో /2/నీప్రేమే/

3.వూహించలేను నీ ప్రేమ మధురం – నా ప్రేమ మూర్తి నీకే నా వందనం /2/
నీప్రేమే నాకాధారం – నాజీవితం లక్ష్యం /2/
నీప్రేమ లేక – నేనుండలేను /2/నీప్రేమే/

Neeve neeve na sarvam neeve samastham neeve నీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే

     llపllనీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
       నీవే నీవే నా జీవం నీవేే సహాయము నీవేll2ll
       నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నాll2ll
       ఎదురు చూస్తున్నా యేసయ్యా
       ఎదురు చూస్తున్నా
                                                              llనీవే నీవేll
llచllఅనుక్షణము నిన్ను చూడనిదే
       క్షణమైనా వెడలనులే
       హృదయములో నీ కోసమే
       నిన్ను గూర్చిన ధ్యానమేll2ll
       అణు వణువునా ఎటు చూచినా
       నీ రూపం మది నిండెనే
       నీ రూపం కోరెనే
                                                              llనీవే నీవేll
llచllఒంటరి నైనా నీ స్పర్శ (స్వరము) లేనిదే
       బ్రతుకే లేదని
       అనుదినము నీ ఆత్మలో
       నిన్ను చూసే ఆనందమేll2ll
       అణు వణువునా ఎటు చూచినా
       నీ రూపం మది నిండెనే
       నీ రూపం కోరెనే
                                                              llనీవే నీవేll
   

Prabhuva ninnaradhimpanu jerithimi ప్రభువా నిన్నారాధింపను జేరితిమి

Song no: #46

    ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||

  1. ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను భజింతుము ||ప్రభువా||
  2. అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను బనిచి తుదకుఁ బ్రసన్నమగుము ||ప్రభువా||
  3. పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని చేయ నడుపుము ||ప్రభువా||

Vededha nadhagu vinathini gaikonave jagadheesha వేడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ

Song no: #45
    వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||

  1. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||
  2. నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||
  3. పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద||
  4. నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద||
  5. అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద||

Sakala jagajjala kartha samgha hrudhaya సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ

Song no: #44
    సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||

  1. నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||
  2. దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల||
  3. తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||
  4. రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి ||సకల||