Sakala jagajjala kartha samgha hrudhaya సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ

Song no: #44
    సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి నికర పేటీ కృత ప్రకట లోకచయ పరమ దయాలయ ||సకల||

  1. నాదు నెమ్మది తొలఁగించుచుఁ బ్రతి వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు బాధలందైనను సాధులఁభ్రోవ ననాది యైనట్టి నీవాధారమైయుండ ||సకల||
  2. దినకృత్యములఁ గష్టమంత చీఁకటినినే నీ కడ భక్తి మనవిజేయ వినుచు నా కష్టము వెస నష్టముగఁ జేయ ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల||
  3. తమ కాపు నన్నుఁ కాపాడఁగ నేనుత్తమ నిద్రఁ బొందితిఁ దనివిఁదీరఁ కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భయముబొంద నా డెంద మందు నెల్లప్పుడు ||సకల||
  4. రాతిరి సుఖనిద్ర జెందఁ జేసి రక్షింప నను నీకె చెల్లు ప్రాతస్తుతుల్ జేయఁ బగలు జూచు తెల్వి ఖ్యాతముగా నాకుఁ గలుగఁజేసితివి ||సకల||

Yesu karthanu seva jeyutaku melkonu యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను

Song no: #43
    శ్రీ యేసు కర్తను సేవఁ జేయుటకు మేల్కొను శ్రీయేసు కర్తను శ్రేయముల నెఱింగి నీకు రేయిపవ లొసంగి యెడఁ బాయని యంతరంగి యపాయంబుఁ ద్రోయ సహాయంబుఁజేయ ||శ్రీ యేసు||

  1. నిదురయందు నేఁడు క్షేమ మొదవఁ గాచినాఁడు సూర్యుఁడుదయ మాయెఁజూడు నీ హృదయమున సదమల పదవులుదయింప ||శ్రీ యేసు||
  2. అంధకార మణఁగెన్ హృదయాంధకార మణఁగెన్ ప్రభు నందుఁ దెలివి గలుగన్ నిబంధనలు డేందమున కందముగఁ గూర్చి ||శ్రీ యేసు||
  3. కంటిపాప వలెను నిను గాయువాని దయను గనుఁ గొంటివి స్తోత్రమును జేయు మింటి కినిమంటికన్నింటికిని కర్తయని ||శ్రీ యేసు||
  4. కలకల ధ్వనిఁజేయు పక్కిగములు లయను గూయు సర్వములు ప్రభు స్తుతిఁజేయు నీ వలయక సొలయక వెలయఁగఁ బాడు ||శ్రీ యేసు||
  5. సేవయందు నీకు మంచి యీవు లిడుపరాకు గల భావముఁబడఁ బోకు నేడుఁ కానవే కావవే కావవే యంచు ||శ్రీ యేసు||
  6. పగటివార మంచు నిష్ఫ్లపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు పురికెగయ నీ దిగులు విడు తగు నమ్మకమున ||శ్రీ యేసు||
  7. మింటి నంటఁ బాడు నీ యొంటి బలిమి నేఁడు ప్రభు నంటి యుండ వాఁడు నిన్నొంటి నెన్నంటి కెన్నింటికిన్వీడఁడు ||శ్రీ యేసు||

Thellavarina vela deli vomdhi mana kreesthu dhivya తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె

Song no: #42
    తెల్లవారిన వేళఁ దెలి వొంది మన క్రీస్తు దివ్య నామముఁ బాడెరె యో ప్రియులార దివస రక్షణ వేఁడరే తల్లి రొమ్మున దాఁచు పిల్ల రీతిని మనలఁ జల్లదనముగ రాతి రెల్లఁ గాచిన విభునిఁ ||దెల్లవారిన వేళ||

  1. నిద్రపోయిన వేళ నిఖిలాపదులఁబాపి నిశలన్ని గడుపు విభునిన్ భద్రముగ వినతించి భయభక్తితో మనము ముద్రి తాక్షులఁ గేలు మోడ్చి మ్రొక్కుచును ||దెల్లవారిన వేళ||
  2. భానుఁడుదయం బయ్యెఁ బద్మములు వికసిల్లె గానమలు జేసెఁ బక్షుల్ మానసాబ్జము లలర మనము కల్వరి మెట్టపై నెక్కు నినుఁ డనెడి ప్రభుఁ జూచి వేడ్కన్ ||దెల్లవారిన వేళ||
  3. దిట్టముగ మానసేంద్రియ కాయ శోధనలు పట్టుకొని, యుండు దినమున్ దట్టముగ మన నాల్గు తట్ల యేసుని కరుణఁ జుట్టుకొని రక్షించు శుభమడుగుకొనుచున్ ||దెల్లవారిన వేళ||
  4. పాప భారము మనము ప్రభుని పై నిడి గురుని పాదములు చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున డాఁగి యాపదలఁ దొలఁగించు మని వేఁడుకొనుచున్ ||దెల్లవారిన వేళ||

Melukonare mee manabula melimiga mi mera dhappaka మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు

Song no: #41

    మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున || మేలుకొనరే ||

  1. దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ || మేలుకొనరే ||

  2. పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ || మేలుకొనరే ||

  3. నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున || మేలుకొనరే ||

  4. మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ || మేలుకొనరే ||

  5. తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై || మేలుకొనరే ||

Shuddhi suddhi shuddhi sarvasaktha prabhu శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు

Song no: #40
    శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు ప్రాతఃకాలస్తుతి నీకీ చెల్లింతుము శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవా! ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!

  1. శుద్ధి, శుద్ధి, శుద్ధి! అని పరమందుఁ బరవాసు లెల్ల నిన్నేశ్లాఘింతురు శెరపుల్ ఖెరూబుల్ సాష్టంగపడి నిత్యుఁడవైన నిన్ నుతింతురు.
  2. శుద్ధి, శుద్ధి, శుద్ధి! తేజరిల్లు దేవ పాపి కన్ను చూడలేని మేఘ వాసివి అద్వితీయప్రభు, నీవు మాత్రమేను కరుణ, శక్తి, ప్రేమరూపివి.
  3. శుద్ధి, శుద్ధి, శుద్ధి! సర్వశక్త ప్రభు సృష్టిజాలమంత నీ కీర్తిఁబాడును శుద్ధి, శుద్ధి, శుద్ధి! కృపగల దేవ ముగ్గురైయుండు దైవత్ర్యేకుఁడా!

Nrupa vimochaka prabhu veladhi nolla nee krupa నృపా విమోచకా ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్

Song no: #39
  1. నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.
  2. కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్.
  3. భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును.
  4. విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము.
  5. జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో.
  6. అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి.
  7. సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే.

Krupagala devuni sarvadha nuthinchudi కృపగల దేవుని సర్వదా నుతించుఁడి

Song no: #38

    కృపగల దేవుని సర్వదా నుతించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  1. సర్వశక్తుఁడాయనే సర్వదా చాటించుఁడి దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును

  2. పగటి నేలునట్లు సూర్యునిన్ సృజించెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  3. సర్వజీవకోటిని బ్రోచు దేవుఁ డెన్నఁడు దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  4. కర్త మనయందును కనికర ముంచెను దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.

  5. దైవ ఘన మహిమన్ జాటుచుండుఁడి యిలన్ దివ్య కృపా ప్రేమలు ఎల్లకాల ముండును.