O prabhunda nin nuthimchu chunnamu vinayamu thoda ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ

Song no: 31

ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||

నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||

పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||

కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||

నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||

నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ||

నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||

ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||

Maa yesu kreesthu neeve mahimagala rajuvu nivu neene మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే

Song no: #30


    మా యేసు క్రీస్తు నీవే మహిమగల రాజవు నీవు నీవే తండ్రికి నిత్యకుమారుడవు ఓ క్రీస్తూ||

  1. భూనరులన్ రక్షింపఁ బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||

  2. విజయము మరణపు వేదనపై నొందఁగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||

  3. నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపుఁ దిరముగాఁ గూర్చున్నావు ఓ క్రీస్తూ||

  4. నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||

  5. దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||

  6. నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||

  7. నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|

  8. దిన దినమును నిన్ను మహిమ పర్చుచున్నాము ఘనముగా నీ నామమున్ గొప్పచేయుచున్నాము ఓ క్రీస్తూ||

  9. నేఁడు పాపము చేయకుండ నెనరుతో మముఁ గావుమయ్యా పాడెడి నీ దాసులకుఁ బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||

  10. ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||

  11. నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపైఁ జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||

Pahiloka prabho pahi loka prabho pahi yani పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని

Song no: #29

    పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||

  1. నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||

  2. నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||

  3. దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||

  4. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో||

  5. ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో||

  6. కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో||

  7. నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో||

  8. నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో||

  9. ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో||

  10. నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్||

  11. ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో||

Mahima sarvonnathamaina dhaivamunaki మహిమ సర్వోన్నతమైన దైవమునకి

Song no: #28

    మహిమ సర్వోన్నతమైన దైవమునకి మ్మహి సమాధానానుగ్రహము గల్గున్ర్పభో ||మహిమ||

  1. నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||

  2. ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||

  3. వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||

  4. జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||

  5. ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||

  6. తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||

  7. పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||

  8. పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||

Randi yuthsahinchi padudhamu rakshana dhurgamu రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము

Song no: #26

    రండి యుత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే||

  1. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము ||రండి||

  2. మన ప్రభువే మహాదేవుండు ఘన మాహాత్మ్యముగల రాజు భూమ్య గాధపులోయలును భూధర శిఖరము లాయనవే ||రండి||

  3. సముద్రము సృష్టించె నాయనదే సత్యుని హస్తమే భువిఁజేసెన్ ఆయన దైవము పాలితుల మాయన మేపెడి గొఱ్ఱెలము ||రండి||

  4. ఆ ప్రభు సన్నిధి మోఁకరించి ఆయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును ||రండి||

  5. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుఁగాక ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నయినట్లు యుగముల నౌను ఆమేన్ ||రండి||

Bhumandalamunu dhani sampurnatha yunu lokamunu భూమండలము దాని సంపూర్ణత యును లోకమును

భూమండలము దాని సంపూర్ణత యును లోకమును భూమండల వాసులను బొల్పార యెహోవావే ||భూ||

యెహోవ సంద్రము మీఁద భుమి పునాది వేసె మహాజలమూల మీఁద మనదేవుఁడది స్థిరపర్చె ||భూ||

యెహోవ పర్వతమునకు నెక్కంగఁ బాత్రుడెవఁడు మహాలయంబునందు మరి నిల్వ యోగ్యుం డెవఁడు ||భూ||

అపవిత్ర మనసులేక కపట ప్రమాణము లేక సుపవిత్రమౌ చేతులను శుద్ధాత్మ గల్గినవాఁడే ||భూ||

ఆలాటి వాఁడు ప్రభుని యాశీర్వచనము నొందు భులోకమున రక్షణ దేవుని నీతి మత్వముపొందు ||భూ||

ప్రభునాశ్ర యించు నట్టి వారు యాకోబు దేవ ప్రభుసన్నిధానము వెదకు ప్రజలెల్ల రట్టివారే ||భూ||

ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ రారాజు కొరకుఁతలుపులాలా మిమ్మెత్తుకొనుఁడి ||భూ||

ఇలలో మహా మహిమంబు గలిగిన యీ రాజెవఁడు బలశౌర్యముల యెహోవ బహుశూరుడౌ యెహోవ ||భూ||

Bhumandalamunu dhani sampurnatha yunu lokamunu భూమండలము దాని సంపూర్ణత యును లోకమును

24
రాగం - (చాయ: ) తాళం -