-->

Prabalamugane prastuthinchedha prabhuni krupalanni ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని

9
రాగం - (చాయ: ) తాళం -

Share:

Nuthanamainadhi nee vathsalyamu prathi dhinamu nannu నూతనమైనది నీ వాత్సల్యము ప్రతి దినము నన్ను దర్శించేను

నూతనమైనది నీ వాత్సల్యము..
ప్రతి దినము నన్ను దర్శించేను
ఏడాబాయనిది నీ కనికరము
నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను
దినములు గడుచుచున్నను నీ ప్రేమలో మార్పులేదు ||2||
సన్నుతించెదను నా యేసయ్య
సన్నుతించెదను నీ నామమును||2||

గడచిన కాలమంత
నీ కృపచూపి ఆదరించినావు జరుగబోయే కాలమంత
నీ కృపలోన నన్ను దాచేదవు ||2||
విడువని దేవుడవు
యెడబాయలేదు  నన్ను క్షణమైనా త్రోసివేయవు ||2||
||సన్నుతించెదను||

నా హీనదశలో నీప్రేమచూపి  పైకిలేపినావు
ఉన్నత స్థలములలో నన్ను నిలువబెట్టి ధైర్యపరచినావు |2|
మరువని దేవుడవు నన్ను మరువలేదు
నీవు ఏ సమయమందైనను చేయి విడువవు ||2||
     ||సన్నుతించెద||

నీ  రెక్కలక్రింద నన్ను దాచినావు
ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా
నీవుండినావు  సంరక్షించావు||2||
ప్రేమించే దేవుడవు తృప్తిపరచినావు నన్ను
సమయోచితముగా ఆదరించినావు||2||
   ||సన్నుతించెదను||

Share:

Papam bali korithey thana sodharulamdharininani thane పాపం బలికొరితే తన సోదరులందరిననీ

పాపం బలికొరితే...తన సోదరులందరిననీ...
తానే బలి ఆయెను...ఆత్యాగం ఎందుకనీ
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు...
యేసు వలె నీ బ్రతుకులోన చూపించు...
తన దేహమునే రొట్టెలు ముక్కలు గావించి.
నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి.
తన రక్తమునే ద్రాక్షారసముగ చిందించి...
నీ దాహం తీర్చే పానీయముగా అర్పించి..
బలైపోయాడు ప్రభువు సిలువలో.
బలికోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో.
ఇదే ఇదే ప్రభువు బల్ల పరమార్థం||2||
      ||పాపం||

దేవుని స్వరూపం ఎందుకునీ...
సమానంగా ఉన్నాగాని..
విడువలేనిదా భాగ్యమని...
ఎంచుకొనక తగ్గించుకొని..ఆ.ఆ.|2|
దాసుని స్వరూపము ధరించుకొని..
తనను తానే రిక్తుని చేసుకొని..
సిలువమరణమునకప్పగించుకొని..
విధేయతను తను కనుపరచుకొని...
ఆకారంలో మనుష్యుడుగా కనిపించాడు.
పానార్పణముగాతానే పోయబడినాడు.
ప్రాణము లక్ష్యము చేయక నీకై నిలిచాడు..
నీ పాపములకు ప్రాయాచిత్తంచేశాడు..
ప్రాణం పెట్టాడు ప్రభువు ప్రేమతో..
ప్రాణం పెట్టబద్ధులు అంటున్నాడు తన వారితో..||ఇదే||

రొట్టె పట్టుకుని విరిచాడు...శిష్యులందరికి ఇచ్చాడు....
ద్రాక్షారసమును పంచాడు....పనిని జ్ఞాపకం చేశాడు....
వివేచనతో తిని తాగమన్నాడు...
సువార్త భారం మోయమన్నాడు...
ప్రాణాన్నే ద్వేషించమన్నాడు ...
తనను పోలి జీవించమన్నాడు..
పాపుల పాదాలే పరిశుద్ధుడు కడిగాడు...
నీ కొరకై తానెంతో తగ్గించుకున్నాడు...
తన రూపాన్నే నీలో చూడాలన్నాడు ..
అందుకే తనను తిని త్రాగమన్నాడు...
లోకమందు ఉన్నదా ఇంతటి ప్రేమా..
ఈ ప్రేమ లేకపోతే ఇది క్రైస్తవ్యమా?...||ఇది||

Share:

Nuthana yerushalem na gruhamu yeppudu velli నూతనయెరూషలేం నా గృహము ఎప్పుడువెళ్లి నే చేరెదను

నూతనయెరూషలేం నా గృహము
ఎప్పుడువెళ్లి నే చేరెదను
రారాజునగరమే ఆ పురము రమ్యమైన సీయోనే!
దానిఉన్నత వాస స్థలము
చరణములు

1.స్పటికమువలె బంగారు వీధులు
ముత్యపుగుమ్మముల్ ఆ పట్టణముకు
ధగధగమెరుయును దానిలో వెలుగు
దానిలోచేరుటే నా హృదయ వాంచ (నూతన)

2.క్రీస్తు యేసే మూలరాయిగాను
అపోస్తులేపునాదుల రాళ్లగా కట్టిరి
అమూల్యరత్నములతో అలంకరింపబడె
ఆరమ్య నగరమే నా నిత్యవాసం  (నూతన)

౩.దుఃఖమువేదన కన్నీరే లేదు
ఆదేసమునందు మరణమే లేదు
నాప్రతి బాష్పబిందువు తుడుచున్
నాదేవునితోనే కాపురముండెదన్  (నూతన)

4.ఆ నగరములో ప్రకాశించుటకు
సూర్యచంద్రులుదానిలో లేరు
గొఱ్ఱెపిల్లప్రభుయేసే దానిలో దీపము
పెండ్లికుమర్తెగామహిమలో వసింతున్ (నూతన)

5. సీయోను సౌందర్యం ఆ నగర మహిమ
సీయోనేశాశ్వత శోభాతిశయము
ఆదివ్య పురములో చేర్చుము త్వరగా
ఆకాంక్షతోనేను కనిపెట్టి జీవింతున్ (నూతన)

Share:

Nuthana yerushalem dhigi vacchuchunnadhi నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది

Song no: 51

    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
    స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి 

  1. శోభ కలిగిన - ఆ దివ్య నగరము
    వర్ణింప శక్యము - కానిదియే -2
    బహు సహస్రముల - సూర్యుని కంటె -2  
    ప్రజ్వలించుచున్నది - మహిమవలెను
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

  2. పరిపూర్ణమైన -సౌందర్యమును .
    పృథ్వికి - ఆనందముగాను -2 
    భూరాజులందరు - మహిమ తెచ్చెడి -2  
    మహిమగల నగరము – ఇదియే
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి

  3. ధగధగ మెరయు - సూర్యకాంతం వలె  
    జ్వలించుచున్న- దైవనగరమందు -2  
    నీతిమంతులే - సూర్యునివలెను -2  
    నిత్య నిత్యముగా - ప్రకాశించుచుందురు
    నూతన యెరుషలేమ్ - దిగి వచ్చుచున్నది
    పెండ్లికుమార్తె వలె - మహిమతో నిండి
Share:

Nuthnavathstharam vinuthnavathsaram yethenchi yunnadhi నూత్నవత్సరం వినూత్నవత్సరం ఏతెంచియున్నది మనకోసం

నూత్నవత్సరం వినూత్నవత్సరం
ఏతెంచియున్నది మనకోసం
చిరుచీకి తెరలు తీసిపారిపోవగా
తొలిభానుడు తొంగిచూసి పలకరించగా
అ.ప. : హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయయంచుసాగిపోదామా
ఇన్నినాళ్ళలో మనలగాచిన
కృపలుతలచుకుంటూ నడచిపోదామా

1. మరలమరలవత్సరాలువచ్చుచున్నవి
పాతగిలిపోయిమరలిపోవుచున్నవి
దినదినమున నూతనమైన కృపలుకురియుచు
దాయాకిరీటములు మనకుఅమరుచున్నవి

2. గడియగడియగడచుచుగతియించుచున్నది
యేసురాజురాకడ ఏతెంచనున్నది
గడువుపెట్టక ఇంకతడవుచేయక
వడివడిగాసంధింపను సిద్ధాపడుదామా.

Share:

Nuthana keerthana padedhanu deva ninu koniyadedhanu నూతన కీర్తన పాడెదను దేవా నిను కొనియాడెదను

నూతన కీర్తన పాడెదను దేవా నిను కొనియాడెదను అన్నివేళలో- అన్ని తావులలో 
నీ మేళ్ళను తలుచుకుంటూ- నీవే దయాలుడవంటూ

1.అనుదినము నీ  రక్షణవార్తను ప్రకటన చేసెదను     అన్యజనులలో నీ మహిమనునీ ప్రచురము చేసెదను     నీ నామమునకు తగిన మహిమును చెల్లించెదను    
నీ ఆవరణములలో చేరి నిను సెవించెదను

2. జనములలో నీ ఆశ్చర్యక్రియలను తెలియజేసెదను     పరిశుద్ధమైన నీ నామములో సంతోషించెదను    
నీ  పాదపీటము ఎదుటస్తుతలనర్పించెదను    
నీ గుణములను పాడినమస్కరించెదను

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts