Daivaatma rammu naa tanuvuna vraalumu దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలుము

Song no: 9
    దైవాత్మ రమ్ము - నా తనువున వ్రాలుము - నా = జీవమంతయు నీతో నిండ - జేరి వసింపుము || దైవాత్మ ||

    స్వంత బుద్ధితోను - యేసు ప్రభుని నెరుగలేను - నే = నెంతగ నాలోచించిన విభుని - నెఱిగి చూడ లేను || దైవాత్మ ||

    స్వంత శక్తితోను - యేసు - స్వామి జేరలేను - నే = నెంత నడచిన ప్రభుని కలిసికొని - చెంత జేరలేను || దైవాత్మ ||

    పాప స్థలము నుండి - నీ సువార్త కడకు నన్ను - భువి - నో = పరమాత్మ నడుపుచుండుము - ఉత్తమ స్థలమునకు || దైవాత్మ ||

    పాపములో మరల - నన్ను పడకుండగ జేసి - ఆ = నీ పరిశుద్ధమైన రెక్కల - నీడను కాపాడు || దైవాత్మ ||

    పరిశుద్ధుని జేసి - నీ వరములు దయచేసి - నీ = పరిశుద్ధ సన్నిధిని జూపుమ - పావురమా వినుమా || దైవాత్మ ||

    తెలివిని గలిగించు - నన్ను దివ్వెగ వెలిగించు - నీ = కలిగిన భాగ్యము లన్నిటిని నా - కంటికి జూపించు || దైవాత్మ ||

    నన్నును భక్తులను - యే నాడును కృపతోను - నిల = మన్నించుము మా పాప రాసులను - మాపివేయు దేవా || దైవాత్మ ||

    వందనములు నీకు - శుభ - వందనములు నీకు - ఆ = నందముతో కూడిన నా హృదయ వందనములు నీకు || దైవాత్మ ||





    daivaatma rammu - naa tanuvuna vraalumu - naa = jeevamaMtayu neetO niMDa - jaeri vasiMpumu || daivaatma ||


    svaMta buddhitOnu - yaesu prabhuni nerugalaenu - nae = neMtaga naalOchiMchina vibhuni - ne~rigi chooDa laenu || daivaatma ||

    svaMta SaktitOnu - yaesu - svaami jaeralaenu - nae = neMta naDachina prabhuni kalisikoni - cheMta jaeralaenu || daivaatma ||

    paapa sthalamu nuMDi - nee suvaarta kaDaku nannu - bhuvi - nO = paramaatma naDupuchuMDumu - uttama sthalamunaku || daivaatma ||

    paapamulO marala - nannu paDakuMDaga jaesi - aa = nee pariSuddhamaina rekkala - neeDanu kaapaaDu || daivaatma ||

    pariSuddhuni jaesi - nee varamulu dayachaesi - nee = pariSuddha sannidhini joopuma - paavuramaa vinumaa || daivaatma ||

    telivini galigiMchu - nannu divvega veligiMchu - nee = kaligina bhaagyamu lanniTini naa - kaMTiki joopiMchu || daivaatma ||

    nannunu bhaktulanu - yae naaDunu kRpatOnu - nila = manniMchumu maa paapa raasulanu - maapivaeyu daevaa || daivaatma ||

    vaMdanamulu neeku - Subha - vaMdanamulu neeku - aa = naMdamutO kooDina naa hRdaya vaMdanamulu neeku || daivaatma ||

Makai yesu janminchenu manalo yelugunu nimpenu మనకై యేసు జన్మించేను మనలో వెలుగును నింపేను

మనకై యేసు జన్మించేను
మనలో వెలుగును నింపేను " 2 "

పోదాం పోదాం రారండి " 2 "
పోదాం పోదాం బెత్లహేముకి
చూద్దాం చూద్దాం రారండి  " 2 "
చూద్దాం చూద్దాం బలయేసును

లోక పాపములను మోసుకొనిపోయేను
మానవులను స్వతంత్రులుగా చేసెను " 2 "
రక్షణ ఇచ్చెను శిక్షను తీసేను   " 2 "
లోక రక్షకుడిగా వచ్చెను  " పోదాం "

గొల్లలంతా చేరి సందడి చేసెను
జ్ఞానులంతా వెళ్ళి ప్రభువుని పొగడెను " 2 "
దూతలు పాడేను జనులు ఆడెను  ' 2 '
సంబరాలతో మునిగెను    " పోదాం "


Chinni pillalam yesayya chinnari pilllalam bujji pillalam చిన్ని పిల్లలం యేసయ్య చిన్నారి పిల్లలం బుజ్జి పిల్లలం

చిన్ని పిల్లలం యేసయ్య చిన్నారి పిల్లలం
బుజ్జి పిల్లలం తండ్రి అరచేతిలో పెరిగాం " 2 "

యేసయ్య మాకు తల్లితండ్రి నీవేగా
యేసయ్య మమ్ము నీ జ్ఞానముతో నడిపించెనుగా " 2 "
మీ పిల్లలుగా మేము ఎదగాలయ్య
మీ సువార్తను చాటాలయ్యా " 2 "
                    "  చిన్నిపిల్లలం "

యేసయ్య మాకు నిజ స్నేహితుడవు నీవేగా
యేసయ్య  ప్రేమ
మమ్ము పెంచి పోషించెనుగా  " 2 "
మీ త్రోవలో మేము నడవాలయ్యా మీ సాక్షిగా మేము నిలవాలయ్య " 2 " 
                     "  చిన్నిపిల్లలం "

యేసయ్య తండ్రీ మాకొరకే జన్మించావయ్య
మీ పుట్టుకతో  మాలో
సంతోషం నింపావయ్యా " 2 "
మీ చల్లని ఒడిలో మమ్ము ఉంచావయ్య
మీ రెక్కల క్రిందా మమ్ము దాచావయ్య " 2 "
                     "  చిన్నిపిల్లలం "

Pravachana ghadiyalu yerpaduchunnavi ప్రవచన ఘడియలు ఏర్పడుచున్నవి

ప్రవచన ఘడియలు ఏర్పడుచున్నవి
దేవుని రాకడా సమీపమైయున్నది " 2 "
మేలుకో సోదరా మేలుకో సోదరీ " 2 "
సిద్ధపడుము దేవుని రాకడకై " 2 "
                                     " ప్రవచన "

ఉన్నపాటున దేవుడు వస్తే ఏమి చేయగలవు
ఇంతవరకు ఎలా జీవించావంటే
ఏమి చెప్పగలవు                           " 2 "
రక్షణ లేని నీవు ఎలా బ్రతుక గలవు " 2 "
పరలోక రాజ్యములో ఎలా చేరగలవు " 2 "
*మేలుకో సోదరా మేలుకో సోదరీ " 2 "
*ఇక సిద్ధపడుము దేవుని రాకడకై " 2 "
                                  "  ప్రవచన  "

రాజుల రాజుగ ప్రభుల ప్రభువుగా
దేవుని రాకడా సిద్ధమైనది
మేఘాలపై రానున్నది           " 2 "
అంత్య దినములయందు ఎలా ఉండగలవు
మారుమనస్సు పొందినచో
దేవునితో వెళ్లగలవు             " 2 "
*మేలుకో సోదరా మేలుకో సోదరీ " 2 "
*ఇక సిద్ధపడుము దేవుని రాకడకై " 2 "
                                     "  ప్రవచన  "

Najareyuda ninne chudalani neetho nadavalani నజరేయుడా నిన్నే చూడాలని నీతో నడవాలని

నజరేయుడా నిన్నే చూడాలని
నీతో నడవాలని ఆశగా...........
నాయేసయ్య నీలో నిలవాలని
స్తుతించాలని ప్రేమగా..........." 2 "
ప్రాణమిచ్చినావు నాకోసమా  " 2 "
నీ మనసేంతో బంగారమా      " 2 "

నీ దివ్యమైన నీ ప్రేమతో
నా హృదయమంతా ఉప్పొంగగా " 2 "
దేవా నీలో చేరుటయే
నాకెంతో ఐశ్వర్యమా                    " 2 "
                               "నజరేయుడా"

అనుదినము చేసే నీ సేవకై
నీ ధన్యతలో నన్ను నడిపితివా   " 2 "
తండ్రి నీలో జీవించుటే
నాకున్న ఆశ నిజమైనదా             " 2 "
                              

Agnni aaradhu purugu chavadhu vegamuga maru mithrama అగ్ని ఆరదు పురుగు చావదు వేగముగా మారు మిత్రమా

అగ్ని ఆరదు పురుగు చావదు
వేగముగా మారు మిత్రమా... "2"
యేసయ్య రాకడ సమీపించుచున్నది
వేగముగా మారు మిత్రమా.... "2"
మిత్రమా నా ప్రియ మిత్రమా   "2"
నా ప్రియ మిత్రమా...............
                                "అగ్ని ఆరదు"
   (1)
రాజది రాజుగా యేసు రాజు వస్తున్నాడు
యూదా గోత్రపు సింహముల వస్తున్నాడు
అంతిమ తీర్పు తీర్చుటకు...............
యేసు రాజు వస్తున్నాడు....................
సిద్ధముగా ఉండు మారు మనసు పొందు "2"
                                "యేసయ్య రాకడ"
   (2)
నువ్వు చేసిన పాపములు................
నువ్వు చేసినద్రోహాములు............
నువ్వు చేసిన చెడు క్రియలు నీవెళ్ళెన
చెడు మార్గములు.......................... "2"
యేసయ్య మందు ఒప్పుకొని.............
రక్షణ పొందు నేస్తమా................
సిద్ధముగా ఉండు మారు మనసు పొందు
                               "యేసయ్య పొందు"
                        (3)
పరలోక రాజ్యములో బంగారు వీధులలో
ప్రతి నిత్యం ఆనందం సదాకాలము......
సంతోషం......................................... "2"
జీవ కిరీటము నీకొరకే........................
మహిమ కిరీటము నీకే.......................
జీవ కిరీటము నీకొరకే మిత్రమా...........
మహిమా కిరీటము నీకొరకే నేస్తమా..... "2"
సిద్ధముగా ఉండు మారు మనసు పొందు
                               "యేసయ్య రాకడ"

Samvastharamulu jaruguchundaga nanu nuthanamuga marchinavayya సంవత్సరములు జరుగుచుండగా నను నూతనముగా మార్చినావయ్య

సంవత్సరములు జరుగుచుండగా
నను నూతనముగా మార్చినావయ్య
పాతవి గతియించెను
సమస్తమును క్రొత్తవాయెను " 2 "

దినములను క్షేమముగాను సంవత్సరములు సుఖముగాను వెళ్లబుచ్చెను  " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను నడిపించెను              " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

శోధనలో బాధలలో శ్రమలన్నిటిలో
నుండి నన్ను విడిపించెను    " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను ప్రేమించెను                " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ

నాజీవమును కృపలో నడిపి
అపాయము రాకుండ నన్ను కాపాడెను " 2 "
నాయేసు సంవత్సరమంతా
నన్ను రక్షించెను                      " 2 "
హోసన్నా హల్లెలూయ హోసన్నా హల్లెలూయ