• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Yendhukintha naa paina intha prema yesayya ఎందుకింత నాపైన ఇంత ప్రేమ యేసయ్యా


Song no:

ఎందుకింత నాపైన
ఇంత ప్రేమ యేసయ్యా
ఇల ఎవ్వరు చూపలేదు
ఇలాంటి ప్రేమను
ఇంతగ ప్రేమించలేదు
ఇలఎవ్వరు నాపైన

ప్రాణానికి ప్రాణమని
అన్నారు ఎందరో
పరిస్థితులు మారిపోగా
కానరారే ఎవరైన
ఉన్నావు తోడుగా ఇమ్మానుయేలుగా

అయినవారె దూరమై
అనాధగా నే మిగిలాను
అప్తులంత హేళన చేసి
అవమాన పరిచిన
ఉన్నావు తోడుగా ఇమ్మానుయేలుగా

నా ప్రాణ క్రయధనముగాను
నీ ప్రాణమిచ్చావు
కనుపాప వలేనే నన్ను
కాపాడు చున్నావు
ఏమిచ్చి నీ ఋణము
తీర్చుకుందు యేసయ్యా
Share:

Iemmanuyelu devuda mammu kanna dhaivamu ఇమ్మానుయేలు దేవుడు మముకన్న దైవము


Song no:

ఇమ్మానుయేలు దేవుడు
మముకన్న దైవము
మా తోడైయుండి నడిపే నాయకుడు
మా క్షేమము కోరి నడిపే నావికుడు

నా కన్న తల్లితండ్రి నన్ను విడచినా
నా స్నేహితులే నన్ను విడచినా
విడువక నాపై ప్రేమను చూపినది
తన కరములు చాపి
కృపతో నడిపినది

శత్రు సమూహము చుట్టు ముట్టినా
అపజయముతో నే కృంగి యుండగా
సైన్యాధిపతిగా అభయము నిచ్చినది
జయశీలుండై విజయము నిచ్చినది
Share:

Iedhigo nenoka nuthana kriyanu cheyuchunnanu ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను


Song no:

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను
ఇపుడే అది మొలుచుచున్నది
నేను అరణ్యములో త్రోవను
కలుగజేయుచున్నాను
ఎడారిలో నదులను
పారచేయుచున్నాను

అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును
కస్తూరి పుష్పము పుయునట్లు
అడవి పూయును
ఉల్లసించును బహుగా పూయుచు
స్తుతి గీతములు పాడును

ఎండ మావులే మడుగులగును
ఎడారిలో నీటి బుగ్గలు పుట్టును
జీవజలపు ఊటలను
ప్రవహింప జేయును
దుఃఖము లేదిక నిట్టూర్పు లేదిక
నిత్యము ఆనందము
Share:

Alakinchudi na priyuni swaramu vinabadenu ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడెను


Song no:


ఆలోచించుడి నా యేసు రాక సమీపమాయే
చలికాలము గడిచిపోయెను వర్షకాలము తీరిపొయెను
దేశమంతట పూలు పూసెను పిట్టలన్నీయు కొలహలం చేసెను
వస్తుంది వస్తుంది యేసు రాకడని
త్వరగా వస్తుంది క్రీస్తు రాకడని

ఎటు చూచిన యుద్ద సమాచారము
ఎటు చూచిన కరువు భూకంపములు
జనము మీదికి జనము
రాజ్యము మిదికి రాజ్యము
యేసు రాకడకు ఇవియే సూచనలు

సూచనలెన్నో నేరవేరుచున్నవి
కాలమును నీవు గుర్తించ వేల
ఉరివలే ఆ దినము నీ పైకి వచ్చును
సిద్దపడుమా సంసిద్దముగా ఉండుమా
Share:

Akasa pakshulu ninne stuthinchuchunnavi ఆకాశ పక్షులు నిన్నె స్తుతియించుచున్నావి


Song no:

ఆకాశ పక్షులు నిన్నె స్తుతియించుచున్నావి
సముద్రజల చరములన్ని సంతోషించుచున్నావి
ఏకముగా కూడి అన్ని పాడుచున్నావి
ప్రభు యేసు నామమును ఘనపరచుచున్నవి

చేసితివి నాకెన్నో
ఘనమైన కార్యములు
దాచితివి ఇంకెన్నో
ఘనమైన మేలులను
మనసార నిన్ను పాడి కీర్తించనా
మహోన్నతుడైన
ప్రభు యేసు నామమునే

నా జీవితానికి ఆశ్రయమైనవయ్యా
ఆపదలో తోడుండి ఆప్తుడవైనవయ్యా
మరువలేని ప్రేమను
నాపై చూపావయ్యా
మారని కృపలో నన్ను
బలపరచినావయ్యా
Share:

Adhvithiyuda neeku aradhana srimanthuda neeku aradhana అద్వితీయుడా నీకు ఆరాధన శ్రీమంతుడా నీకు ఆరాధన


Song no:

అద్వితీయుడా నీకు ఆరాధన
శ్రీమంతుడా నీకు ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన

జలములలో బడి నీవు నడిచినను
అవి నీపై పారలేవని
అగ్ని మధ్యను సంచరించినను జ్వాలలు నిను కాల్చజాలవనిన

శత్రు సమూహము చుట్టుముట్టిన
కోటగా వుండి కాపాడితివే
వెనుక ముందు ఆవరించి
ముందుకు నడిపితివే
Share:

Adhbuthalu cheyuvada aradhana accharyakaruda aradhana అద్బుతాలు చేయువాడ ఆరాధన ఆశ్చర్యకరుడా ఆరాధన


Song no:

అద్బుతాలు చేయువాడ ఆరాధన
ఆశ్చర్యకరుడా ఆరాధన
ఆద్వితీయుడా నీకే ఆరాధన
అతి సుందరుడా ఆరాధన
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన

ఆకాశము నుండి మన్నా కురిపించావు
బండలో నుండి మధుర
జలమును నీ విచ్చావు

కష్ట కాలమందున
కరుణించి బ్రోచావు
కాకులకు ఆఙ్ఞ ఇచ్చి
ఆహరము పంపావు

ఆపద సమయంలో
అక్కున చేర్చుకొని
నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages