Yesayya janminche Bethlehemulo యేసయ్యా జన్మించే బేత్లహేములో

యేసయ్యా జన్మించే బేత్లహేములో
నీ కొరకు నా కొరకు పశుల పాకలో (2)
బాలుడై జన్మించే దినుడై దిగి వచ్చే
పరలోక వైబావం వదలివచ్చే మన కొరకు (యేసయ్యా జన్మించే)
పిల్లాలారా పేద్దాలరా యేసు యెద్దకే రండి
సాంబ్రాణి బోలముతో ఆరాధించాగ రండి (2)( బాలుడై జన్మించే)
నిత్యమైన జీవము మనకీయా దిగివచ్చే
క్రీస్తు యేసు శుభవార్త చాటెదము రారండి (2) (బాలుడై జన్మించే)

Yesayya puttinadu lendayya యేసయ్య పుట్టినాడు - లెండయ్యో.. లెండయ్యో

యేసయ్య పుట్టినాడు - లెండయ్యో.. లెండయ్యో
రక్షకుడు ఉదయించాడు - లెండయ్యో...లెండయ్యో
పాపమును పారద్రోలు ...రాజు..మనకు పుట్టినాడులే
రాత్రి వేళ గొల్లలు ...మందగాయుచుండగ
దేవ దూత వారికి కన్పించి  చెప్పగా
మీ కొరకు రారాజు... జన్మించినాడంటు(యేసయ్య)
తూర్పున జ్ఞానులు...చుక్కాను కనుగొని
మక్కువతో ప్రభుని చూడ..బెత్లెహేము కొచ్చిరి
బంగారం సాంబ్రాణి ...బోళము లర్పించిరి..(యేసయ్య)

Muthyala kanna rathnala kanna ముత్యాలకన్నా - రత్నాలకన్నా యేసు రాజన్న - నాకెంతో మిన్న

ముత్యాలకన్నా - రత్నాలకన్నా
యేసు రాజన్న - నాకెంతో మిన్న
కన్న బిడ్డలకన్నా - అన్నదమ్ములకన్నా
బంధుమిత్రులకన్నా - బహు మంచివాడన్నా
మరియమ్మ గర్భాన పుట్టినాడన్న
మహిలోకి రక్షణ తెచ్చినాడన్నా
మార్గము తానే అన్నాడన్నా
మరణము గెలచి లేచినాడన్నా
పాపుల కొరకై వచ్చినాడన్నా
ప్రాణము దానము చేసినాడన్నా
జీవము తానే అన్నాడన్నా
జయ జీవితము ఇచ్చినాడన్నా
నమ్మిన వారిని కాచువాడన్నా
వేడిన వారిని బ్రోచువాడన్నా
దారుణ హింసను ఓర్చినాడన్నా
ధరణికి దీవెన తెచ్చినాడన్నా

Yesu kreesthu puttenu nedu pashuvula pakalo యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో

యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో
మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో (2)
ఇది పండుగ – క్రిస్మస్ పండుగ
జగతిలో మెండుగ – వెలుగులు నిండగా (2)       ||యేసు క్రీస్తు||
పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2)
కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను (2)        ||ఇది పండుగ||
సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా (2)
నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను (2)        ||ఇది పండుగ||
శరీర ధారిగా – కృపగల దేవునిగా (2)
పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను (2)        ||ఇది పండుగ||

Yesu kreesthu jananamu deva devuni bhahumanam యేసుక్రీస్తు జననము - దేవ దేవుని బహుమానం

యేసుక్రీస్తు జననము - దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతి రూపము - ప్రేమ రూపి జననము
యూదయ బెత్లెహేమందున - యూదుల రాజుగ పుట్టెను (2)
రక్షించును తన ప్రజలను - రాజుల రాజు క్రీస్తు (2) ..యేసు
ఆదియందున్న వాక్యము - అభిషిక్తునిగ అవతరించెను (2)
శరీరధారిగా పుట్టెను - సత్య స్వరూపి క్రీస్తు (2)
ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు
విమొచన ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు (2)  ఇలలో జీవము క్రీస్తు..

Yesayya puttenu nedu thara velisindhi chudu యేసయ్యా పుట్టేను నేడు తార వేలసింది చూడు

Song no:

    హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  మేరీ మేరీ క్రిస్మస్

    యేసయ్యా పుట్టెను నేడు - తార వేలసింది చూడు
    సందడి చేద్దామా నేడు - ఊరంతా పండుగ చూడు } 2
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ - లోకనికిదే నిజమైన పండుగ
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ సర్వలోకనికే ఘనమైన పండుగ || యేసయ్యా పుట్టెను ||

  1. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  మేరీ మేరీ క్రిస్మస్

    దూతదేల్పెను గొల్లలకు శుభవార్త
    గోర్రేలటిని విడచి పరుగేడిరి } 2
    నేడే మనకు రక్షణ వార్త
    యేసుని చేరి ప్రనుతిచేదము } 2
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ - లోకనికిదే నిజమైన పండుగ
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ సర్వలోకనికే ఘనమైన పండుగ

  2. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్  మేరీ మేరీ క్రిస్మస్

    సర్వలోకనికి దేవుడు ఆ యేసే
    విశ్వమంతటికి దీనుడు మన యేసే } 2
    ఘనులవలే క్రీస్తుని వేదకి అర్పించేదము
    హృదయమును నేడే
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ - లోకనికిదే నిజమైన పండుగ
    నేడే పండుగ క్రిస్మస్  పండుగ సర్వలోకనికే ఘనమైన పండుగ || యేసయ్యా పుట్టెను ||

Yesu jananamu lokanikentho varamu యేసు జననము లోకానికెంతో వరము

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము ॥2॥ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ॥2॥
బెత్లెహేములో పశులపాకలోపొత్తిళ్ళలో మరియ ఒడిలో ॥2॥
పవళించినాడు ఆనాడునీ హృదిని కోరాడు నేడు॥2||   ॥ఆహాహహా॥
గొల్లలంతా పూజించిరిజ్ఞానులంతా ఆరాధించిరి ॥2॥
అర్పించుము నీ హృదయంఆరాధించుము ప్రభు యేసున్ ॥2||      ॥ఆహాహహా॥