Yesu jananamu lokanikentho varamu యేసు జననము లోకానికెంతో వరము

యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము ॥2॥ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ॥2॥
బెత్లెహేములో పశులపాకలోపొత్తిళ్ళలో మరియ ఒడిలో ॥2॥
పవళించినాడు ఆనాడునీ హృదిని కోరాడు నేడు॥2||   ॥ఆహాహహా॥
గొల్లలంతా పూజించిరిజ్ఞానులంతా ఆరాధించిరి ॥2॥
అర్పించుము నీ హృదయంఆరాధించుము ప్రభు యేసున్ ॥2||      ॥ఆహాహహా॥

Yesu kreesthu putte elokaniki vacche యేసు క్రీస్తు పుట్టే ఈలోకానికి వచ్చే

యేసు క్రీస్తు పుట్టే ఈలోకానికి వచ్చే
దారిమానకు చూపే కుమారుడుదిగొచే 
ఆకాశాన చూడు ఒక తార మెరిసే
తూర్పు జ్ఞనులకు దారిచుపించే
భుమి లోన చూడు దూత సైన్యము పాడేనే
ఆకాశాన చూడు తరాలని మెరిసేనే(2)
పశువుల పాక చూడు
ఆనందంతో నిండెనే
యేసు క్రీస్తు పుట్టి ఆనందలుపంచెనే(2) (యేసు క్రీస్తు

Yesu puttadani yegiregiri padaku యేసు పుట్టాడని ఎగిరెగిరి పడకు - ఎర్రోడా ఓ బుల్లోడా

యేసు పుట్టాడని ఎగిరెగిరి పడకు - ఎర్రోడా ఓ బుల్లోడా
నీ యెదలో యేసయ్యా పుట్టాడా ఎర్రోడా ఓ బుల్లోడా
కొత్తబట్ట లేసుకున్నావు - ఎర్రోడా ఓ బుల్లోడా
క్రొత్త బ్రతుకు నీకున్నదా..? (యేసు)
పిండి వంటలొండుకున్నావు -ఎర్రోడా ఓ బుల్లోడా
నిండు బ్రతుకు నీకున్నదా..? ( యేసు)
హంగులెన్నో చేసుకున్నావు - ఎర్రోడా ఓ బుల్లోడా
ఆత్మశాంతి నీకున్నదా...? (యేసు)

Yesu puttenu nedu paramunu vidichenu యేసు పుట్టెను నేడు పరమును విడిచెను నేడు

యేసు పుట్టెను నేడు
పరమును విడిచెను నేడు
పాపికి విడుదల నేడు
ప్రతి పాపికి విడుదల నేడు
*హ్యాపీ హ్యాపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
1  వేధనలు నీ బాధలను  }
తొలగించ వచ్చెను           }॥2॥
కష్టాలను నష్టాలను తొలగించ వచ్చెను ॥2॥
ఓ సారి యోచించుమా  }
ఆ యేసుని చేరుమా     }॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యపీ హ్యపీ క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*
*జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్*
*జింగిల్ ఆల్ ద వే*
*ఓహ్ వాట్ ఫన్ ఇట్జ్ టు రైడ్*
*ఇన్ ఏవన్హర్స్ ఓపెన్ స్లెయ్*
2  నే మార్గము నేనే సత్యము }
నేనే జీవమని చెప్పెను           }॥2॥
నీ జీవితము నీ సమస్తము }
సరిచేయ వచ్చెను              }॥2॥
ఓ సారి యోచించుమా }
ఆ యేసుని చేరుమా    }॥2॥
అందుకే అందుకే అందుకే
*హ్యాపీ హ్యపి క్రిస్ట్మస్ మెర్రీ మెర్రి క్రిస్ట్మస్*॥2॥
          ॥యేసు పుట్టెను నేడు॥

Yesu janiyinche prabhu yesu janiyinche యేసు జనియించె – ప్రభు యేసు జనియించె

యేసు జనియించె – ప్రభు యేసు జనియించె
శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా
ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/
యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/
Happy Christmas – Merry Christmas /4/శాంతికి /
1.కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..
పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె
భువనాలనేలువాడు – భవనాలలోన కాదు
పశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/
2.శుభము కూర్చే – శిశువు తానై
దిశను మార్చే – సూచనై
పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే..  – ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/
3.నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె
దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే
మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే – ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె  – ప్రభుకిరణం – తొలికిరణం  /శాంతికి/

Randaho vinarandaho shubha vartha okati రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం

రండహో వినరండహో శుభ వార్త ఒకటి వినిపించెదం
సంతోషముతో దరి చేరండి సంభ్రాలతో యిక స్తుతి కలపండి (2).. రండహో
అలనాడు బెత్లేహేము పశుల పాకలోకన్నియ మరియకు శిశువు పుట్టెను (2)
గొల్లలు జ్ఞానులు కానుకలతో స్తుతులర్పించిరి (2) ॥రండహో॥
ప్రవచనమునుబట్టి అభిషక్తుడవతరించె భూరాజులకదిఎంతో భీతి కలిగించెన్ (2)
అంతము చేయ దలచినంత దూత గణం రక్షించెన్ (2)
సంభ్రాలతో యిక శృతి కలపండి ॥రండహో॥
నాటి నుండి నేటి వరకు కృపతో తోడుండిపరమందు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నా (2)
యేసుని జన్మ శుభాశిస్సులందు కొనరండి (2)
సంభ్రాలతో యిక శృతికలపండి ॥రండహో||  

Yesu janminchera thammuda యేసే జన్మించేరా తమ్ముడా

యేసే జన్మించేరా తమ్ముడా...
దేవుడవతరించేరా తమ్ముడా...
ఓరోరి తమ్ముడా... ఓరోరి తమ్ముడా...
పెద్ద పెద్ద రాజులంతా - నిద్దురాలు బోవంగా
అర్ధరాత్రి వేల మనకు - ముద్దుగా జన్మించినయ్యా
బెత్లెహేము గ్రామమందు - బీదకన్య గర్భమందు
నాధుడు జన్మించినయా - వెలుగు మన కందరికి
కన్య రాశి మరియమ్మ - జోల పాటలు పాడంగా
గగనాల ధూతలంతా - గానాలు పాడంగా