Kondameedha sukka bodise gundelona dhipamelige కొండమీద సుక్కబోడిసె గుండెలోన దీపమెలిగె


Song no:


కొండమీద సుక్కబోడిసె గుండెలోన దీపమెలిగె 
బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ … 
తూర్పువైపు వెలుగు రేఖ 
నిలువు పొడుగు పెరుగుతుంటె నిలువలేక పోతున్నా మందకాడ 
అబ్బో దూత మాట వచ్చిందిరో వర్తమాన మిచ్చిందిరా,
దావీదు పురమంటరో అల్ల దేవరాజు కోలువంటరా //2//

1. దీపమెల్ల దారి తను చూపుతుంటే ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే 
గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే 
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల – 
అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల//కొండ .

Krupayu sathyamu kalisi velisenu kreesthu rajuga కృపయు సత్యము కలిసి వెలసెను


Song no:


కృపయు సత్యము కలిసి వెలసెను
క్రీస్తురాజుగా మహిమ రూపము మనిషి ఆయెను
బాలయేసునిగా హల్లెలూయ
ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమై
సకల ప్రజలకు రక్షణై - సంతస వార్తయై
గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనై
బీదలకు సువార్తయై - రక్షణ మార్గమై
నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడై
శాంతికే నిలయమై నిత్యజీవమై

Orey chinnoda vatthunna orey peddoda aa yentinna ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న


Song no:


ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న ఒరేయ్ పెద్దోడా .... ఎంటిన్న 
రక్షకుడు  మనకోసం పుట్టడాంటరా- తొందరగా  రండి బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్నా   ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా ఒరేయ్ జోనా అన్నా(2సా)
పోధము రండిరా బెత్తెముకు రక్షకుడు పుట్టే మనకు
దావీదు పురామందు రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు మనకు తెలియజేశారు – (2)
సంతోషమే హాయ్ - సంతోషమే హాయ్
సంతోషమే మనకు సమాధానమే హాయ్ (2)
పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)
పశువులు తొట్టిలో పరుండిన పసివాడు
పాపము తొలగింప పరము నుండి దిగినాడు (2)

Oka mrogindhi veenula vindhuga oka thara sagindhi ఒక మ్రోగింది వీనుల విందుగా ఒక తార సాగింది కన్నుల పంటగా


Song no:


ఒక మ్రోగింది వీనుల విందుగా
ఒక తార సాగింది కన్నుల పంటగా
జనులందరికీ పరమ సంతసం కలిగించే రక్షకుడు పుట్టాడని
చూపులో విరిసె వెన్నెల చల్లదనం
మాటలో కురిసె కమ్మని కరుణరసం
శతకోటి దీపాల కాంతులు వెదజల్లే
సుత యేసుక్రీస్తు ప్టుటడని
రాజ్యాలనేలే రారాజు ప్రభుడు
పూజింపదాగిన బలవంతుడగు విభుడు
పాపాలనే బాపి నిత్యము తోడుండే
కాపరిగా ఇలపుట్టాడని

Yedanumtiviraa oranna vegi viriki rara oranna ఏడానుంటివిరా ఓరన్న వేగి ఉరికి రారా ఓరన్న


Song no:


ఏడానుంటివిరా ఓరన్న
వేగి ఉరికి రారా ఓరన్న (2)
యాదికొచ్చెరా యాదన్న
యేసు సిత్ర కథ వినరన్న (2)
ఏలియాలో ఏలియాలో ఏలియాలో
యేసే నా రక్షకుడు ఏలియాలో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (2)
యూదా దేశమందు ఓరన్న
బెత్లెహేమునందు ఓరన్న
పశువుల శాలయందు ఓరన్న
ప్రభు యేసు జన్మించె ఓరన్న
చుక్కల రెక్కలు ఎగుర వేయుచు
చల్లని దూతలు   పాడిరి (2)
చల్ల చల్లని చలిలోన ఓరన్న
గొల్ల గొల్లలు మ్రొక్కిరి ఓరన్న (2)        ||ఏలియాలో||
పెద్ద పెద్దని వాడై యేసన్న
ఇంత ఇంతింత ఎదిగె యేసన్న
వింత వింతలు చేసె యేసన్న
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచెను (2)
తుఫాను నణిచెను యేసన్న
సంద్రాన నడిచెను యేసన్న (2)        ||ఏలియాలో||
ఏ పాపమెరుగని ఓరన్న
యేసయ్య తండ్రిని ఓరన్న
సిలువ వేయమని ఓరన్న
కేకలు వేసిరి ఓరన్న
సిలువ మోసెను శ్రమల నోర్చెను
మూడవ నాడు తిరిగి లేచెను (2)
పరలోకమెళ్లాడు యేసన్న
త్వరలోనే వస్తాడు యేసన్న (2)        ||ఏలియాలో||

Yentho Shubhakaram prabhu jananam ఎంతో శుభకరం ప్రభు జననం


Song no:


ఎంతో శుభకరం ప్రభు జననం
చీకటి బ్రతుకుల అరుణోదయం
.: విడుదల దొరికెను శ్రమలిక వెడలెను సంతోషము విరిసెను
పరిశుద్దముగా తనపిల్లలుగాఇలలో జీవింపను 
మనకై నీతిరాజు మనిషై  వెలిసాడు
తన వైభవమును విడిచి దిగినాడు
జీవితకాలము లేకుండా భయము  దేవుని సేవింపను 
సర్వాధికారి తండ్రి కుమారుడయ్యాడు
రక్షణ శృంగమై  భువిలో  పుట్టాడు.

Yentha dhuramentha dhuramo aa balayesu basanu chera ఎంత దూరమెంత దూరమో ఆ బాలయేసు బసను చేర


Song no:


ఎంత దూరమెంత దూరమో - ఆ బాలయేసు బసను చేర
ఎంత దూరమెంత దూరమో - ఆ స్వామి మాకు దర్శనమీయ
దేవుళ్ళకు దేవుడంట - నిక్కమైన దేవుడంట
రాజులకు రారాజంట - సక్కనైన మారాజంట
నమ్మినోళ్ళందరిని - గమ్మున రక్షించునంట (2)(ఎంత)
పెద్ద పెద్ద లోగిళ్ళలో - పెత్తనాల సావిళ్లలో
విత్తబోయి సూత్తుండగా - ఇంకా సానా రేత్రుండగా
బేత్లేములో పుట్టెనట - పశుల పాకలోనట(2)(ఎంత)