Nammakamaina naa prabhu ninnu ne నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును


Song no: 177
1కోరింథీయులకు 10: 13 దేవుడు నమ్మకమైనవాడు


నమ్మకమైన నా ప్రభు

నిన్ను నే స్తుతింతును – నిన్ను నే స్తుతింతును    ||   నమ్మకమైన ||

కరుణతోడ పిల్చియు – స్థిరపరచి కాపాడిన

స్థిరపరచి కాపాడిన (2)

స్థిరపరచిన నా ప్రభున్

పొగడి నే స్తుతింతును (2)        || నమ్మకమైన ||

ఎన్నో సార్లు నీ కృపన్ – విడచియుంటినో ప్రభు

విడచియుంటినో ప్రభు (2)

మన్ననతోడ నీ దరిన్

చేర్చి నన్ క్షమించితివి (2)       || నమ్మకమైన ||

కృంగియుండు వేళలో – పైకి లేవనెత్తితివి

పైకి లేవనెత్తితివి (2)

భంగ పర్చు సైతానున్

గెల్చి విజయమిచ్చితివి (2)        || నమ్మకమైన ||

నా కాశ్రయశైలమై – కోటగా నీవుంటివి

కోటగా నీవుంటివి (2)

ప్రాకారంపు ఇంటివై

నన్ను దాచియుంటివి (2)          || నమ్మకమైన ||

సత్య సాక్షివై యుండి – నమ్మదగినవాడవై

నమ్మదగినవాడవై (2)

నిత్యుడౌ మా దేవుడా

ఆమేనంచు పాడెద (2)            || నమ్మకమైన ||

Nammakamaina Naa Prabhu

Ninnu Ne Sthuthinthunu – Ninnu Ne Sthuthinthunu  ||Nammakamaina||

Karuna Thoda Pilchiyu – Sthiraparachi Kaapaadina

Sthiraparachi Kaapaadina (2)

Sthiraparachina Naa Prabhun

Pogadi Ne Sthuthinthunu (2)     ||Nammakamaina||

Enno Saarlu Nee Krupan – Vidachiyuntino Prabhu

Vidachiyuntino Prabhu (2)

Mannana Thoda Nee Darin

Cherchi Nan Kshaminchithivi (2)     ||Nammakamaina||

Krungiyundu Velalo – Paiki Levaneththithivi

Paiki Levaneththithivi (2)

Bhanga Parchu Saithaanun

Gelchi Vijayamichchithivi (2)        ||Nammakamaina||

Naa Kaashraya Shailamai – Kotagaa Neevuntivi

Kotagaa Neevuntivi (2)

Praakaarampu Intivai

Nannu Daachiyuntivi (2)        ||Nammakamaina||

Sathya Saakshivai Yundi – Nammadagina Vaadavai

Nammadagina Vaadavai (2)

Nithyudou Maa Devudaa

Aamenanchu Paadeda (2)        ||Nammakamaina||


Rakshakuda yesu prabho sthothramu deva రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

"క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు?" రోమా Romans 8:35
Song no: 178
    పల్లవి : రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా
    స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా } 2

  1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? } 2
    దూతలైనను ప్రధానులైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను } 2
    కరువైనను ఖడ్గమైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  3. సర్వలోకరక్షణకై సిలువనెక్కెను } 2
    శ్రమయైనను బాధయైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  4. ఎంచలేని యేసునాకై హింసపొందెనే } 2
    హింసయైనను హీనతయైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  5. మరణమున్ జయించి క్రీస్తు తిరిగి లేచెను } 2
    మరణమైనను జీవమైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను } 2
    ఎత్తైనను లోతైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    || రక్షకుడా ||

  7. ఎన్నడైన మారని మా యేసుడుండగా } 2
    ఉన్నవైనను రానున్నవైనను } 2
    ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
    హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ || రక్షకుడా ||


    Rakshakudaa Yesu Prabho Sthothramu Devaa

    Swachchamaina Nithya Prema Choopina Devaa (2)    ||Rakshakudaa||

    Sarva Loka Rakshanakai Siluvanekkenu (2)

    Shrama Ayinanuu Baadha Ayinanuu (2)

    Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa

    Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa

    Rakshakudaa…           ||Rakshakudaa||

    Enchaleni Yesu Naakai Himsa Pondene (2)

    Himsa Ayinanuu Heenatha Ayinanuu (2)

    Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa

    Kreesthu Prema Nundi Nannu Veru Cheyunaa

    Rakshakudaa…           ||Rakshakudaa||

    Ennadaina Maarani Maa Yesudundagaa (2)

    Unnavainanuu Raanunnavainanuu (2)

    Prabhuvu Prema Nundi Nannu Veru Cheyunaa

    Hallelooya Hallelooya Aamen Hallelooya

    Rakshakudaa…           ||Rakshakudaa||

Ruchi chuchi yerigithini yehovaa utthamudaniyu రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు


Song no: 161
కీర్తనలు 34: 8
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి 


రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2)

రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2)         || రుచి చూచి||

గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2)

తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2)   || రుచి చూచి||

మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2)

మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2)   || రుచి చూచి||

మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2)

ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2)  || రుచి చూచి||

కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2)

క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2)     || రుచి చూచి||

ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2)

సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2)    || రుచి చూచి||


Ruchi Choochi Erigithini – Yehovaa Uththamudaniyu (2)

Rakshaku Naashrayinchi – Ne Dhanyudanaithini (2)

Goppa Devudavu Neeve – Stuthulaku Paathruda Neeve (2)

Thaappaka Aaraadhinthun – Dayaaludavu Neeve (2)  ||Ruchi Choochi||

Mahonnathudavagu Devaa – Prabhaavamu Galavaadaa (2)

Manasaara Pogadedanu Nee – Aascharya Kaaryamulan (2) ||Ruchi Choochi||

Manchi Thanamugala Devaa – Athishreshtudavu Andarilo (2)

Mudamaara Paadeda Ninnu – Athi Sundarudavaniyu (2) ||Ruchi Choochi||

Kruthagnathaa Chellinthun – Prathi Daani Koraku Nenu (2)

Kreesthuni Yande Thrupthi – Pondi Harshinchedanu (2)  ||Ruchi Choochi||

Praardhinthunu Edathegaka – Prabhu Sannidhilo Cheri (2)

Sampoornamuga Pondedanu – Aduguvaatannitini (2)  ||Ruchi Choochi||

Ningiloni chanduruda mandha kache indhuruda నింగిలోని చందురుడా మంద కాచే ఇందురుడా

Song no: 118

    నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2
    నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2

  1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా
    దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
    ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన

    తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2

  2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
    యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
    అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి

    ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2

  3. లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
    మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
    అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి

    నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2
    ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2

O nesthama yochinchuma suryuni kindha ఓ నేస్తమా యోచించుమా సూర్యుని క్రింద అంతా శూన్యమే

నేస్తమా, యోచించుమా, సూర్యుని క్రింద అంతా శూన్యమే |3|
వ్యర్ధమే అంతా వ్యర్థమే సమస్తము వ్యర్థమే వ్యర్థమే |2| || నేస్తమా||

1. విద్య జ్ఞానాభ్యాసం శోకమే, అందము ఐశ్వర్యము ఆయాసమే |2|
కండ అండ బలమున్నా వ్యర్థమే, ఎన్ని ఉన్న నీ బ్రతుకు దుఃఖమే |2|
యేసు లేని నీ బ్రతుకు శూన్యమే, యేసు లేని నీ బ్రతుకు వ్యర్థమే |2| || నేస్తమా||

2. లోకములో మమతలన్నీ శూన్యమే, లోక భోగములన్నీ క్షణికమే |2|
నీ దేహము లయమగుట ఖాయమే, ప్రభు యేసే నీ జీవిత గమ్యము |2|
సత్య వేదము చెప్పు నిత్య సత్యము |2| || నేస్తమా||


Padana mounamugane stuthi keerthana పాడనా మౌనముగానే స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి

Song no: 150
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు = 2
యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే - 2

1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును = 2
నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే - 2

2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ = 2
నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే - 2

3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే
నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ = 2
నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే - 2

Natho neevu matladinacho ne brathikedhanu prabho నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో నా ప్రియుడా


Song no:
నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో
నా ప్రియుడా.. నా స్నేహితుడా
నా ప్రాణనాధుడా ..... నా రక్షకా ఆ.. ఆ.. ఆ..

తప్పిపోయినను తరలి తిరిగినను
దొడ్డినుండి వేరై హద్దు మీరినాను
ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

చచ్చియుండి నేను చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్
కానలేదు నిన్ను కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నియాన్
ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

యుద్ధమందు నేను మిద్దిమీద నుండి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను
బుద్ధి వీడినాను హద్దు మీరినను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
 ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..

కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను
వీడె నీదు ఆత్మ వీడె నీదు స్నేహం
గుడ్డి వాడనైతి తిరుగాలిసురుచుండి
దిక్కు లేకనే నీ దయను కోరుచుంటి
 ఒక్కమాట చాలు || 3 || ప్రభో  ఆ.. ఆ..