Vinava manavi yesayya Lyrics


వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం పగిలెను జీవితం
చేసుకో నీ వశం
1 లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
చిటికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీలో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా
2 ఆశ ఏది కనరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూశాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతొషించనీ యేసయ్యా
నా దైవము నీవయ్యా


Yesulo unna jeevamu Lyrics


యేసులో ఉన్న జీవము భువిలో ప్రత్యక్షమాయెను
మరణాచ్చయలోని జనమ అరుణోదయమును కనుగొనెను
1 అనుదిన జీవిత అక్కరలన్నీ తీర్చును ఆ జీవం
శాంతి సౌక్యం ఆశీర్వాదం కూర్చును ఆ జీవం
వెలుగైన ఆ జీవం ఉదయించెను మనకోసం
నిజమైన ఆ దైవం జరిగించను రక్షణ కార్యం
2. చీకటి శక్తియుక్తులను హతమార్చును ఆ జీవం
బాధలయందు నిర్భయులనుగా తీర్చును ఆ జీవం
వెలుగైన ఆ జీవం ఉదయించెను మనకోసం
నిజమైన ఆ దైవం జరిగించను రక్షణ కార్యం


Manasunna manchideva Lyrics


మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
అ.ప : నా మదిని కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియుంచుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగినా నిజదేవుడా
2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయుంచితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పుర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా


Gurileni brathukidhi Lyrics


గురిలేని బ్రతుకిది దరిచేర్చవా నా ప్రభు
నీ తోడు లేక నే సాగలేను నీ నీడనే కోరితి
1 గాలికెగురు పొట్టువంటిది నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును ఆవిరివంటి నా బ్రతుకు
2. వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును బుడగవోలె నా బ్రతుకు
3. కలకాలం నిలిచిపోవును ప్రభువా నీ దివ్య వాక్యం
నిత్యజీవమనుగ్రహించును పరిశుద్దుడా నీ నామం


Matlade deva naa yesayya Lyrics


మాట్లాడే దేవా నా యేసయ్యా
మాట తప్పవు నీవు మారనివాడవయ్యా
1 నీ మాటలో జీవమున్నది
అదియే నన్నిలలో బ్రతికించుచున్నది
మాటతోనే మృతలలేపినావా మరణముల్లు విరిచిన ఓ దేవా
2 నీ మాటలో స్వస్థతున్నది
అదియే నా రోగము తొలగించుచున్నది
మాటతోనే చక్కజేసినావా సర్వశక్తి కలిగిన ఓ దేవా
3 నీ మాటలో జ్ఞానమున్నది
అదియే నీ త్రోవలో నడిపించుచున్నది
మాటతోనే బుద్ధినేర్పినావా హృదయమును ఎరిగిన ఓ దేవా


Nannu viduvani yesayya Lyrics


నన్ను విడువని యేసయ్యా నిన్ను విడిచి ఉండనయ్యా
కన్నతల్లి నను మరచినను ఎన్నడూ మరువనంటివయ్యా
అ.ప: వందనం నీకే నా వందనం నీకే
1 నా స్వంత ఆశలతో నిన్ను విడిచి వెళ్ళియుంటిని
ఈ లోక స్నేహముతో నాశనము తెచ్చుకుంటిని
తప్పినా నన్ను వెదకుటకై - నిత్యజీవము నిచ్చుటకై
నీవే దిగివచ్చినావయ్యా - నీవే దిగివచ్చినావయ్యా
2 నీ అరచేతులలో నన్ను నివి చెక్కుకుంటివి
జీవగ్రంధములో నా పేరును రాసియుంటివి
వ్యసనములను నిందలను నాడు వ్యదిబాధలను
నీవే భరియుంచినావయ్యా - నీవే భరియుంచినావయ్యా
3 విలువైన రక్తముతో నన్ను శుద్ధి చేసియుంటివి
పరిశుద్ధ నామములో కొత్త జన్మనిచ్చియుంటివి
ఆత్మతో సత్యముతో విరిగిన హృదయముతో
నిన్నే ఆరాధిస్తానయ్యా - నిన్నే ఆరాధిస్తానయ్యా


Andhari hrudhayalanu Lyrics


అందరి హృదయాలను ఎరిగియున్న దేవుడు
అంతరెంద్రియాలను పరీక్షించు నాధుడు
అ.ప: యేసు ఒక్కడే యేసు ఒక్కడే
1 పిలువకముందే బదులిచ్చినాడు
వెదకకముందే ఎదురోచ్చేవాడు
అడగకముందే గ్రహియించేవాడు
తలవకముందే కనిపించేవాడు
2 పగిలిన హృదిని సరిచేసేవాడు
మరణపు విషము విరిచేసేవాడు
చెదరిన ప్రజను సమకుర్చేవాడు
పలికిన మాట వెరవేర్చేవాడు
3 దీనుల మొరను ఆలించేవాడు
పాపపు చెరను ఛేదించేవాడు
కూలిన బ్రతుకు నిర్మించేవాడు
అంతము వరకు ప్రేమించేవాడు