No title అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన... దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా... అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన - దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2) మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2) దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) || అనుభవానికి || రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2) దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2) || అనుభవానికి || మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2) దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2) || అనుభవానికి || || || Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : S.P.Balasubrahmanyam Book 📖 : Music 🎵 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector
Post a Comment
0Comments