No title ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా పరమ పావనాత్మ నీదు వరములీయుమా ఆత్మ నింపుమా.. కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ….. నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా || అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ….. ఈ కరుణ మెంచి శరణమీయుమా తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా || ఆత్మ నింపుమా || || || Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : S.P.Balasubrahmanyam Book 📖 : Music 🎵 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector
Post a Comment
0Comments