50
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన Anubhavaniki vacchena anthuleni vedhana
అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన...
దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా...
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన -
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే
ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2)
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి
ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
|| ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment