"యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాని నతిక్రమింపదు." కీర్తన Psalm 148
పల్లవి : స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
పవిత్ర దూతగణ సేనాధిపతికి
ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి
1.కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా
ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా
ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||
2. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా
బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి
ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి
ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
యెహోవాను స్తుతించుడి
|| స్తుతించుడి ||