-->

Ye reethi stuthiyinthuno ye reeti sevinthuno ఏ రీతి స్తుతియింతునో ఏ రీతి సేవింతునో

Song no:
    ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
    నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
    తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
    ఏ రీతి స్తుతియింతునో…
    నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
    నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||

  1. మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
    సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||

  2. వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
    రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ||

  3. ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
    ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను (2) ||నా ప్రాణ||


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts