ప్రకాశించూచున్నావు నాపై " 2 "
సమాధానమై సదాకాలము
నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై
సీయోనులో మహోన్నతుడా యేసయ్య
" సీయోనులో "
అంతరంగమున ధైర్యము నిచ్చి " 2 "
నీ సన్నిధిలో నను నిలిపి
ఉన్నత విజయము నిచ్చితివి " 2 "
నీ ఆశలు నెరవేరుటకు
నీ చిత్తము జరిగించుటకు
విడువవు నను ఎడబాయవు " 2 "
" సీయోనులో "
నీ స్నేహబంధముతో ఆకర్షించి " 2 "
కృపావరములతో నను నింపి
సత్యసాక్షిగా మర్చితివి " 2 "
నీ మనసును పొందుకొని
నీ ప్రేమను నింపుకొని
కీర్తించెదను ప్రతి నిత్యం
నిను ఆరాదింతును అనుక్షణం
" సీయోనులో "
పరలోకమందు నే చూచెదను " 2 "
నీ కౌగిలిలో చేర్చుకొని
ప్రతి భాష్ప బిందువును తుడిచెదవు " 2 "
నీ మాటల మకరందమును
మరపురాని అనుబంధమును
మరువను ఎన్నడు విడువను
నేను మరువను ఎన్నడు విడువను
" సీయోనులో "