- నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.
- నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.
- నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.
- నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.
- రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.
Naa yesu athma suryuda nivunna rathri kammadhu నా యేసూ ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు
E sayamkalamuna yesu prabho vededhamu ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము
- ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||మీ||
- చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||యీ||
- దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||మీ||
- నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||యీ||
- జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ||
Kruthagnathan thalavanchi naadu jeevaamu arpinthunu కృతజ్ఞతన్ తలవంచి నాదు జీవము అర్పింతును
Song no: 211
కృతజ్ఞతన్ తలవంచి – నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల – అర్పింతును నన్నే నీకు (2)
1. దూరమైతి నీ ప్రేమ మరచి – నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగా నిక వెళ్ళ జాల – కూర్చుండెద నీ చెంతనే (2) || కృతజ్ఞతన్ ||
2. ఆకర్షించె లోకాశలన్ని – లోక మహిమ నడ్డగించు (2)
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై – నిక్కముగా త్యజింతును (2) || కృతజ్ఞతన్ ||
3. తరముల నీ ప్రేమ నాకై – వర్ణింపను అశక్యము (2)
నిరంతరము సేవించినను – తీర్చలేను నీ ఋణము (2) || కృతజ్ఞతన్ ||
4. లోకముకై జీవించనింక – నీ కొరకై జీవింతును (2)
నీకర్పింపన్ నే వెనుదీయన్ – ఈ కొద్ది నా జీవితము (2) || కృతజ్ఞతన్ ||
5. చింతించితి గత పాపములకై – ఎంతో నేను యేడ్చుచుంటి (2)
కృతజ్ఞతతో సమర్పింతును – బ్రతుకంతయు నీ సేవకై (2) || కృతజ్ఞతన్ ||
Kruthagnathan Thalavanchi, Naadu Jeevaamu Arpinthunu
Lede Yeka Ne Yeevi Eela Arpinthunu Nanne Neeku
1. Duramaithi Nee Prema Marachi, Ne Repithi Nee Gayamul (X2)
Duramuga Nika Vellajaala, Kurchundedha Nee Chenthane (X2)
2. Akarshinche Lokaashalanni, Loka Mahima Naddaginchu (X2)
Korkelanni Kristhu Premakai, Nikkamuga Thvajinthunu (X2)
3. Tharamula Nee Prema Naakai, Varnimpanu Ashakyamu (X2)
Nirantharaamu Sevinchinanu, Thirchalenu Nee Runamu (X2)
4. Lokamukai Jeevinchaninka Ne Korake Jeevinthunu (X2)
Nee Karpimpan Ne Venudheeyan Ee Kodhi Naa Jeevithamu (X2)
5. Chinthinchithi Gatha Papamulakai Yentho Neenu Yedchuchunti (X2)
Kruthagnyathatho Samarpinthunu Brathukathayu Nee Seevakai (X2)
Lechi sthuthimpa bunudi lokeswaruni లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని
- లేచి స్తుతింపఁ బూనుఁడి లోకేశ్వరుని లేచి స్తుతింపఁ బూనుఁడి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతోఁ గరము జాచి కాపాడు విభుని ||లేచి||
- రాత్రి జాముల యందున రంజిలఁదన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపుసఁబ విత్ర గీతము పాడుచు ||లేచి||
- నిదురఁభోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదురఁబొంది యుదయాన లేచితిమి సదయుఁడైన క్రీస్తు పదముల దరిఁజేర ||లేచి||
- నిగమ వేద్యుఁడు మనలనుఁ దనలోన నీ పగలు కాపాడఁబూనెను దిగులు బొందక పనులు తెగువతోఁ జరుపుకొనుచు వగపుతో లేచి మ్రొక్కి మిగుల శుద్ధాత్మనడిగి ||లేచి||
- నేటి పాఠములయందు నిర్భయముగ దాటివెలసి యుందు సూటిగ నీదు ఱెక్కల చాటుగను నిలుపు మనుచు నీటుగా నెల్లవార నిత్యము ప్రేమనేల ||లేచి||
Sthothramu sthothramu o deva ie vekuvane sthothramu స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే
- స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||
- పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||
- కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో నీదినము మన నియ్యుమో దేవా||
- పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మముగాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్మో దేవా||
Vinave na vinathi nivedhana dhaya velayaga no వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో
- వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||
- నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||
- నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||
- ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||
- పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||
- నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే||
Deva neeku sthothramu e rathrilo ni velugu dheevenakai దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై
- దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||
- పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
- చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
- నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||