Bethlehem puramuna chithrambu kalige బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె

బేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
1. ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి            ||బేత్లేహేం||
2. పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై
నరుల దుఃఖములన్ తొలగించివేసి
పరలోక శాంతి స్థిరపరచె ప్రభువు         ||బేత్లేహేం||
3. నీదు చిత్తమును నాదు హృదయమున
ముదమున జేయ మదినెంతో యాశ
నీదు పాలనము పరమందు వలెనె
ఈ ధరణియందు జరుగంగ జూడ       ||బేత్లేహేం||
4. దేవుని సన్నిధి దీనత నుండ
పావనయాత్మ పవిత్ర పరచున్
పావనుడేసు ప్రకాశమిచ్చి
జీవంబు నొసగి జీవించు నెదలో       ||బేత్లేహేం||
5. గతించె రాత్రి ప్రకాశించె కాంతి
వితానముగ వికసించె నెల్ల
దూతల ధ్వనితో పతి యేసు క్రీస్తు
అతి ప్రేమతోడ అరుదెంచె నోహో     ||బేత్లేహేం||

Mana koraku rakshakudu puttiyunnadu మన కొరకు రక్షకుండు పుట్టియున్నాడు

మన కొరకు రక్షకుండు పుట్టియున్నాడు
నీ కొరకు రక్షకుండు పుట్టియున్నాడు
ఉత్సాహ గానముతో త్వరపడి రండి యేసు నొద్దకు
సంతోష గానముతో త్వరపడి రండి క్రీస్తు నొద్దకు
Ch: wow...wow...wow...wow
గొఱ్ఱెల కాపరులు ఆ గొప్ప జ్ఞానులు
యేసుని చూచి మహిమపరచిరి/పరవశించిరి (2)
ఇదే శుభదినం యేసుని జన్మదినం
ఇదే శుభదినం క్రీస్తుని జన్మదినం ..మన
ప్రకటింతును నీ జన్మ సువార్తను సర్వలోక జనులందరికి
చీకటి బ్రతుకులో వెలుగును నింపిన యేసు వార్తను చాటెదము (2)
ఇదే శుభదినం యేసుని జన్మదినం
ఇదే శుభదినం క్రీస్తుని జన్మదినం

Bhaga bhaga mande arani mantalu భగ భగ మండే – ఆరని మంటలు

భగ భగ మండే – ఆరని మంటలు
గణ గణ మ్రోగే – క్రీస్మస్ గంటలు
భయం భయం – ఏటు చూసిన
స్థిరం స్థిరం మది – క్రీస్తులో స్థిరం స్థిరం
సమిరంలో – శాంతి సందేశం
తిమిరంలో- క్రాంతి ప్రతిబింబం
అశ్రులలో- హర్షభిషేకం  “2”
నిస్పృహలో- నిరీక్షనాస్పదం “2”
దీనులకే – సువార్త మానము
అణచబడే –జనజన సత్యము
బందితుల – విమోచనా గీతం
బరువెక్కిన – హృదయాల స్తుతి వస్త్రము
ద్వేషమును – ప్రేమ జూషదమే
ధూషణలో – స్నేహ  బాషనమే
జగత్తులో – శాంతి దాతగా “2”
జనియించిన – ఈ శుభ వేళలో “2”

Mana yesu Bethlehemulo మన యేసు బెత్లేహేములో

మన యేసు బెత్లేహేములో
చిన్న పశుల పాకలో పుట్టెన్  పాకలో పుట్టెన్
గొల్లంలంతా దూత ద్వార - యేసు నొద్దకు
వచ్చియుండిరి వచ్చియుండిరి - నమస్కరించుడి
జ్ఞానులంతా చుక్క ద్వార - యేసు నొద్దకు
వచ్చియుండిరి వచ్చియుండిరి – కానుకలిచ్చిరి

Mee andhariki shubakankshalu మీ అందరికి శుభాకాంక్షలు క్రీస్తెసు జన్మదినం

మీ అందరికి… శుభాకాంక్షలు…. #2#
క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం #2#
Happy Christmas.. – Merry Christmas.. #2#
1. ఏడాది గడచినను – తోడుగ నిలచిన దేవా
మా పాపాలు పెరిగినను – ప్రాణాలు నిలపిన దేవా (2)
నీ ప్రేమకు వెలలేదు – నీ కరుణను మా పై నిలపుమా (2)
Happy Christmas.. – Merry Christmas.. #2#
 2. రాబొవు కాలములో – రక్షణనొసగుము దేవా..
మా జీవితకాలమే – ముగియునేమో ఇలలోన (2)
నీ సన్నిధి చేరుటకు – మార్గమును తెరువుమా (2)
 Happy Christmas.. – Merry Christmas.. #2#
మీ అందరికి… శుభాకాంక్షలు…. #2#
క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం #2#

Maa korakai e bhuviyandhu janminchinavu మా కొరకై ఈ భువియందు జన్మించినావు ఓ క్రీస్తు

మా కొరకై ఈ భువియందు జన్మించినావు ఓ క్రీస్తు
బెత్లెహేములో పశులపాకలో మరియ ఒడిలో ఓ తనయుడ
ఏ మంచి మాలో లేకున్నవేళ దివినుండి వచ్చితివి
చీకటిలో ఉన్న మమ్మును చూసి నీ వెలుగును ఇచ్చితివి
ఎంత జాలిని చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్
మా శిక్షను భరియించుటకై ఈ భువిలో జన్మించినావు
ఏమిచ్చినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా
ఎంత ప్రేమను చూపించినావు నీకే వందనము
హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్యు ఏ మెర్రి క్రిస్మస్

Yesayya janminche Bethlehemulo యేసయ్యా జన్మించే బేత్లహేములో

యేసయ్యా జన్మించే బేత్లహేములో
నీ కొరకు నా కొరకు పశుల పాకలో (2)
బాలుడై జన్మించే దినుడై దిగి వచ్చే
పరలోక వైబావం వదలివచ్చే మన కొరకు (యేసయ్యా జన్మించే)
పిల్లాలారా పేద్దాలరా యేసు యెద్దకే రండి
సాంబ్రాణి బోలముతో ఆరాధించాగ రండి (2)( బాలుడై జన్మించే)
నిత్యమైన జీవము మనకీయా దిగివచ్చే
క్రీస్తు యేసు శుభవార్త చాటెదము రారండి (2) (బాలుడై జన్మించే)