-->

Praardhana Vinnaavayyaa ప్రార్ధన విన్నావయ్యా విజయం నిచ్చావయ్యా

Song no:
HD
    ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా (2)
    తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు (2)
    పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
    పరవశించి పాడెదా (2)
    తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా (2)
    నిరంతరం గొప్పవాడా (2)

  1. కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా (2)
    విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||

  2. ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా (2)
    ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||

  3. నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్ (2)
    శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||

    Praardhana Vinnaavayyaa – Vijayam Nichchaavayyaa (2)
    Thotrilla Niyyaledu – Thodundi Nadipinchaavu (2)
    Pogadeda Paata Paadi – Penu Thuphaanaagipoye
    Paravashinchi Paadedaa (2)
    Thandri Devaa Manchivaadaa – Nirantharam Goppavaadaa (2)
    Nirantharam Goppavaadaa (2)

  1. Kanneeru Choosaavayyaa – Karam Patti Nadipaavayyaa (2)
    Vinnapam Vinnaavayyaa – Vidudala Nichchaavayyaa (2) ||Pogadeda||

  2. Ebinejar Neevenayyaa – Sahaayam Chesaavayyaa (2)
    Elroyi Neevenayyaa – Nannila Choosaavayyaa (2) ||Pogadeda||

  3. Ninne Nammukonedan – Neepai Aanukonedan (2)
    Shaanthi Nosaguvaadaa – Nee Sannidhi Chaalunayyaa (2) ||Pogadeda||
Share:

Andhamaina kreesthu katha mee ralimparayya అందమైన క్రీస్తు కథ విూ రాలింపరయ్య

Song no: 151
HD

రా – నవరోజు 

పుట్టుగ్రుడ్డికిఁ జూపునిచ్చుట

తా – త్రిపుట 



అందమైన క్రీస్తు కథ విూ – రాలింపరయ్య ||అందమైన||

  1. పొందుగ శిష్యులతో యేసు – పోవుచుండు మార్గమందు – ముందుగ వీక్షించి రొక్క పుట్టంధకుని = అందుఁ గొందఱు శిష్యు – లాత్మలో భావించి – రెందు కీతఁడు చీక – య్యెను దీని విధమేమో – డెందములనుఁ గల్గు – సందియములు వీడ – విందమనుచు లోక – వంద్యుని సంతతా = నందుని మనుజ – నందనుని నడిగిరప్పు ॥డందమైన॥

  2. చీకువాఁడై జన్మించుటకుఁ జేసెనా దుష్కృతము నితఁడు – లేక వీని జననీ జనకు – లేమి చేసిరో = యిూ కారణముఁ దెల్పు – మోకర్త యిపుడీవు – మాకంచు తను వేఁడ – లోకేశ్వరుండు ని – రాకారుఁ డితనియం – దీకార్యములుఁ జూపం – బ్రాకటముగఁ జేసెఁ – గాక వేరొకవిధము = లేకున్నదని తెల్పి – చీకుఁ బ్రోవం దలంచె ॥నందమై॥

  3. బురద వాని కన్నులందుఁ – గరములతోఁ జమిరియొక్క – చెఱవులో బ్రక్షాళించుటకు – సెలవిచ్చెఁ బ్రభువు = బిరబిర నయ్యంధుఁ – డరిగి యేసుని పల్కుఁ – దిరముగ మదినమ్మి – సరసిలో మునిఁగి సుం – దరమైన నేత్రముల్ – ధరియించి యానంద – భరితుడై చనుదెంచు – తఱివాని పొరుగింటి = నరులబ్బురముగఁ జూ – చిరి మార్మోమగువాని ॥నందమైన॥

  4. చూపులేని గ్రుడ్డివానిఁ – జూడఁ గలుగఁజేయువాఁడే – పాపాంధకార మగ్నుల నా – ప్రభువే రక్షించు = పైపైని మనకన్ను – చూపు చూపది గాదు – లోపలి కనుగుడ్డి – యైపోయి యున్నది – యాప త్పరంపర – లోఁ బొరలుచున్నాము – కాపాడుమని యేసు – శ్రీ పాదములుఁ బట్టి = చూపు లోపలి చూపుఁ – జూచి యానందింత ॥మందమైన॥



Share:

Anjali ghatiyinthu deva ni manjula అంజలి ఘటియింతు దేవా నీ మంజుల పాదాంబుజముల కడ

Song no:
HD
    అంజలి ఘటియింతు దేవా (2)
    నీ మంజుల పాదాంబుజముల కడ
    నిరంజన మానస పరిమళ పుష్పాంజలి || అంజలి ||

  1. పరమాత్మ నీ పాద సేవ
    చిరజీవ సంద్రాన నావ (2)
    సిలువ మహా యజ్ఞ సింధూర
    రక్తా రుణమేయ సంభావనా (2)
    దేవా దేవా యేసు దేవా (2)
    అంజలి ఘటియింతు దేవా || అంజలి ||

  2. అవతార మహిమా ప్రభావ
    సువిశాల కరుణా స్వభావ (2)
    పరలోక సింహాసనాసీన
    తేజో విరాజమాన జగదావనా (2)
    దేవా దేవా యేసు దేవా (2)
    అంజలి ఘటియింతు దేవా || అంజలి ||


    Anjali Ghatiyinthu Devaa (2)
    Nee Manjula Paadaambujamula Kada
    Niranjana Maanasa Parimala Pushpaanjali || Anjali ||

  1. Paramaathma Nee Paada Seva
    Chirajeeva Sandraana Naava (2)
    Siluva Mahaa Yagna Sindhoora
    Rakthaa Runameya Sambhaavanaa (2)
    Deva Devaa Yesu Devaa (2)
    Anjali Ghatiyinthu Devaa || Anjali ||

  2. Avathaara Mahimaa Prabhaava
    Suvishaala Karunaa Swabhaava (2)
    Paraloka Simhaasanaaseena
    Thejo Viraajamaana Jagadaavanaa (2)
    Deva Devaa Yesu Devaa (2)
    Anjali Ghatiyinthu Devaa || Anjali ||

Share:

Anchulanundi jarela ginnela nindi అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా

Song no:
HD
    అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
    ఆశీర్వదిస్తాడు యేసయ్యా } 2
    విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన } 2
    మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే } 2 || అంచుల ||

  1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై } 2
    స్తోత్ర గానము చేయు చున్నావా } 2
    కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||

  2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై } 2
    స్తోత్ర గానము చేయు చున్నావా } 2
    కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||

  3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై } 2
    స్తోత్ర గానము చేయు చున్నావా } 2
    కృతజ్ఞత కలిగున్నావా } 2 || మితిలేని ||

Share:

Mahonnathuda nee vakyamu yentho balamainadhi మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది

Song no:
HD
మహోన్నతుడా నీ వాక్యము ఎంతో బలమైనది మహాఘనుడా నీ ఉద్దెశము ఉన్నతామైనది ||2|| Brathukunu మార్చునది - రక్షణనిచ్చునది ||2|| బ్రతికింప చేయునది - పూజింపదగినది //2// నీకే ఆరాధనా నీకే స్తోత్రార్పణ - నీకే హృదయార్పణ నీకే నా యేసయ్యా ...... 1 నశియించి పోతున్న నన్ను - నీ వాక్యముతో దర్శించినావు నా యందు నీ ద్రుష్టి నిలిపి - నీ ఉద్దేశమును తెలిపినావు //2// దినదినము నా బ్రతుకును , ఫలభరితముగా మార్చినావు అనుక్షణము నన్ను నీ పాత్రగా మలచుచున్నవయ Neeke ఆరాధనా ......... 2. నా నోట నీ శ్రేష్ఠమైనా - స్తుతికీర్తనలు పాడుచు నీ సన్నిధిలో నేను నిరతం - నీ మాటలను ధ్యానించుచు //2// || ||

Share:

Yevari kosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

Share:

Repemi jaruguno nakemi teliyunu రేపేమి జరుగునో నాకేమితెలియును

Song no:
HD
రేపేమి జరుగునో నాకేమి తెలియును
చింతించి మాత్రము ఏం లాభముండును } 2
భవిష్యత్తునెరిగిన యేసునివైపే భారము వేసెదను } 2 || రేపేమి జరుగునో ||


1. జరిగిపోయిన దినములలో కరుణతో కాచిన దైవము } 2
విడిచి పెట్టునా నాచేయి రాబోయేకాలము} 2
ఏ ఆపదకూడా నా పై పడదుకదా తప్పించువాడు రక్షించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో ||

2. విత్తని కోయని పక్షులకు కడుపునింపిన దైవము } 2
అనుగ్రహించడా ప్రతిరోజు నాకు ఆహారము } 2
అన్యజనులవలెనే విచారపడదగునా పోషించువాడు - పాలించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో ||

3. కష్టపడని ఆ పువ్వులను అలంకరించిన దైవము } 2
ధరింపజేయడా నాచేత మేలైన వస్త్రము } 2
నాకేం కావలెనో తండ్రికి తెలుసుసుమా దీవించువాడు - ప్రేమించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో ||

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts