బెత్లహేములోనంటా – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
పాటలు పాడేనంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
అర్ధ రాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
రక్షకుడు పుట్టెనని – సందడి
వార్తను తెలిపేనటా – సందడి (2)
చేసారంట సందడే సందడి
చెయ్యబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
గొల్లలు వచ్చిరంటా – సందడి
మనసారా మ్రొక్కిరంటా – సందడి
అందాల బాలుడంటా – సందడి
అందరి దేవుడని – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్
తారను చూచుకుంటూ – సందడి
జ్ఞానులు వచ్చారంటా – సందడి
పెట్టెలు తెచ్చారంటా – సందడి
కానుకలిచ్చారంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)
|| goto ||
నూతనమైన ఆనంద రాగాలతో - క్రొత్త క్రొత్త ఊహల పల్లకిలో
ప్రియుడైన యేసుతో విహారములో - ఉప్పొంగెను నా మానసవీణ
నూతన వత్సరము - మన ముందు ఉన్నది
నిత్య నూతన దీవెనలు - మెండుగ ఉన్నవి ఆయనలో
I wish you all - Happy happy new year
we welcome you - 2020
we welcome you - to 2020
- గడచిన వత్సరం సంతోషపురమోలే - క్రొత్త క్రొత్త అనుభవాలు నేర్పగా
పరిశుద్ధతలో సంపూర్ణమగుటకై - కృపలతో సిద్ధపరచబడెదను
మునుపటికంటే అధికమైన మేళ్ళను చేయు - సర్వశక్తుడు మన ముందు నడువగా
జయధ్వనితో సాగిపోదుము - సాతాను దుర్గములు కూల్చుచూ
- నూతన వత్సరం శ్రేయస్కరమైన - ఆశీర్వాదములు ఇవ్వనుండగా
నా తలపై అపరంజి కిరీటము - ప్రభావ గౌరవము నే పొందుకొనెదను
వినువీధిలో సూర్యునికే గుడారము వేసిన - శక్తిమంతుడు మన ముందు నడువగా
ఉత్సాహగానముతో సాగిపోదును - జనులలో ఘనత పొందుచూ
- నూతన వత్సరం వాగ్ధానములను - హృదయముపై ప్రభువు వ్రాయుచుండగా
ఖర్జూర వృక్షమునై మొవ్వువేయుటకు - మందిరములో నాటబడెదను
ఏ తెగులును నా ఇంటిని సమీపించదని - బలశూరుడే మన ముందు నడువగా
స్తుతి ధ్వనితో సాగిపోదును - దేవదారు వృక్షమోలే ఎదుగుచు
|| goto ||
అదిగో కల్వరిలో యేసు రక్షకుడే } 1
దీనుడై వ్రేలాడుచున్నాడే } 2
- మహిమ ఘనతను మరచి వదిలెనే
కఠిన సిలువనే కోరుకొన్నాడే } 2
మాయ జగత్తులో నాశన మొందక } 2
కౌగలించెను కల్వరిలో ప్రేమన్ } 2 || అదిగో ||
- సురూపమైన సొగసైన లేదు
నన్ను రక్షించ వికారుండాయెన్ } 2
పలునిందలన్ భరించెను } 2
పదివేలలో నతి కాంక్షణీయుడే || అదిగో ||
- ముండ్ల మకుటం శోభిత వస్త్రమే
పాద హస్తములలో చీలలు కలవు } 2
రక్త డాగులతో వ్రేలాడెను } 2
మరణ దాసుల విమోచించెన్ || అదిగో ||
- యేసుని త్యాగం నా యాశ్రయమే
గొప్పసంతోషం ప్రియుని రాజ్యం } 2
పాద జాడలలో నడచుటయే } 2
నా జీవితమందలి యానందం || అదిగో ||
- సిలువ దృశ్యమును చూచి నే
ఉజ్జీవముతో సేవ చేయుదునే } 2
నిరీక్షణతో జీవించెదనే } 2
నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో || అదిగో ||
Song no: 80
అదిగో! కల్వరిలో యేసు రక్షకుడు
దీనుడై వేలాడు చున్నాడు } 2
- మహిమపరుడు - మహిమ లేనట్లు
ఘోర సిలువ - నెన్నుకొనెను } 2
మాయ లోకములో - నుండి నన్ను
శద్ధకల్వారి ప్రేమతో - దరిచేర్చను } 2 || అదిగో ||
- అందము లేదు - సౌందర్యము లేదు
వికారమైతిరి - నన్ను రక్షించను } 2
పలు నిందలు - భరించినను
పదివేలలో - అతి ప్రియుడవు } 2 || అదిగో ||
- ముండ్ల కిరీటమున్ - అంగీని తొడిగి
కాలు చేతులకు - మేకులు కొట్టిరి } 2
రక్తధారల్ తో - వేలాడుచుండె
నిత్యమహిమను - మనకిచ్చుటకు } 2 || అదిగో ||
- ఆశ్చర్యమే - యేసుని త్యాగం
అద్భుతమే - ప్రభుని ప్రేమ } 2
ఆ ధ్యానముతో - దినం జీవించి
ఆయన మార్గమే - వెంబడించెదను } 2 || అదిగో ||
- సిలువ దర్శనమొంది సాగెదను
సేవచేసెద - జీవము పెట్టి } 2
నన్ను - చేర్చెదనని చెప్పెను
నే న్నిరీక్షణతో - కనిపెట్టెదను } 2 || అదిగో ||
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు } 2
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
- దావీదుపురములో పుడమికి మధ్యలో జగమేలే రక్షకుడు జన్మించినాడు
ఆనాడు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలమును అర్పించి ఆరాధించారు } 2
పరమును విడచి రిత్తిని గా మారి దాసుని స్వరూపం ధరియించెను
పాపిని ప్రేమించి పాపమును ద్వేషించి పాపికి విడుదల నొసగేను
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
- పాపికి రక్షణ రోగులకు స్వస్థత పాపక్షమాపణ యేసులోనే
కీర్తి ప్రతిష్ఠలు సర్వ సంపదలు గుప్తామయున్నవి క్రీస్తులోనే } 2
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి మహోన్నతుడు
అల్ఫయు ఒమేగా ఆది సంభూతుడు ఆరాధ్య దైవం ఆ యేసే
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును ఆరాధించేద్దాం
రారండోయ్ రారండోయ్ క్రీస్తు యేసును పూజించేద్దాం
నింగిలోన తారవెలసి దారిచూపే జ్ఞానులకు
కన్య మరియకు సుతునిగా అవతరించే రక్షకుడు
ఎన్నియాలొ ఎన్నియాలో ఎన్నియాలొ
యేసయ్య పుట్టెను దునియాలో (4)
రారా పండగ సేద్దము సిన్నోడా
మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ ||
- సికటి బతుకులలో యెలుతురు నిండెనురా
పాపపు బతుకులలొ పండుగవచ్చేనురా } 2
సికటిపోయే యేన్నియాలో
పాపము పోయే యేన్నియాలో } 2
రారా పండగ సేద్దము సిన్నోడా
మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ ||
- కులిన బతుకులలో కృపదిగివచ్చెనురా
వాడిన బతుకులలో నవ్వులు విరిసెనురా } 2
కృపదిగివచ్చేను యేన్నియాలో
నవ్వులు విరిసెను యేన్నియాలో } 2
రారా పండగ సేద్దము సిన్నోడా
మనసారా యేసయ్యను గొలవంగ } 2 || ఎన్నియాలొ ||
నిశీధి రాత్రిలో….ఒక తార కాంతిలో....
జన్మించెను….పసిబాలుడు బెత్లేహేములో..
హ్యాపీ…. హ్యాపీక్రిస్మస్ - మెర్రి ….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో||
- ఆ..దూత ఆ..రాత్రి తెలిపెను – రక్షకుడు జన్మించెననీ -2
చాటించిరి ఆ గొల్లలు....లోకానికి శుభవార్తను -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో||
- బంగారు, సాంబ్రాణి బోళముల్ – అర్పించిరి ఆ..జ్జ్ఞానులు -2
దర్శించి పూజించిరి.....కీర్తించి కొనియాడిరి -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో||
- పరలోక దూతాళి గానాలతో - స్తోత్రించిరి పసిబాలుని -2
రక్షకుడు జన్మించెననీ.....మన పాపము క్షమియించుననీ -2
హ్యాపీ….హ్యాపీక్రిస్మస్ - మెర్రి….మెర్రిక్రిస్మస్ -2 ||నిశీధిరాత్రిలో||
పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు
పసిబాలుడవు కావు } 2
- చిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు 2
స్థలమైన లేదే జన్మకు } 2
తలవంచే సర్వ లోకము } 2 || పశుశాలలో ||
- స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే } 2
ధరియించలేదే ఆయుధం } 2
వశమాయే జనుల హృదయాలు } 2 || పశుశాలలో ||
- పాపంబు మోసి కలువరిలో ఓడించినావు మరణమును } 2
మేఘాలలోనా వెళ్ళినావు } 2
త్వరలోనే భువికి తరలుచున్నవు } 2 || పశుశాలలో ||
ఆ .... ఆ ....... ఆ