Song no: #86
ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు నీకు ||నేమి||
- నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి||
- అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||
- నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి||
- నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ క్షమాపణ కొరకు ||నేమి||
- నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||డేమి||
Song no: #85
చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||జేరి||
- ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ ||జేరి||
- జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ ||జేరి||
- సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని ||జేరి||
- దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని ||జేరి||
- యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ ||జేరి||
- మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ ||జేరి||
- పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||జేరి||
- జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని ||చేరి||
Song no: #84
ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె ||ఇదిగో||
- ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ||ఇదిగో||
- నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె ||ఇదిగో||
- కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె ||ఇదిగో||
- మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె ||ఇదిగో||
- జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము ||ఇదిగో||
Song no: #82
యేసుభజనసేయవే దోసపుమనసా! వాసిగ నేనే, వరరక్షకుఁడు వేసారి వసుధ నెవ్వారినిఁ గానము ||యేసు||
- ధారుణపాప భరణా! హరణా! కారుణ్యకరయని కోరిభజింపవె ||యేసు||
- శాంతిసునీతి సదములభక్తిన్ వింతగనిడు మన శ్శాంతిసుధాకరుఁ ||డేసు||
- అనఘా! నీవే అవనితలంబున ననుఁగనుఁగొంటివి నా ధనమంటివి ||యేసు||
- మనసా! నీదు మలినంబును తా మనుగడ, సిల్వపై మాపెమహాత్ముఁ డు ||యేసు||
Song no: #80
యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసు||
- ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు||యేసు||
- ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును||యేసు||
- లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును||యేసు||
- వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా||యేసు||
- నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా||యేసు||
Song no: #78
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు జేయు పలు దోసములు మోయు ||యేసు||
- మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ గాలావధి ఁగూల||యేసు||
- అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత మోక్ష యను దీక్షన్||యేసు||
- మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత వాటములను మీటు||యేసు||
- శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ మాత్రము విను మనుచున్||యేసు||
- మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్||యేసు||
Song no: #232
అమ్మా విశ్వాసమ్మా అణుకువ కలిగుండాలమ్మా } 2
భక్తిగల స్త్రీలకు తగినట్టుగా } 2
శక్తి నాశ్రయించి బ్రతకాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||
- నగలు నాణ్యత పైన అత్యాశ వలదమ్మా } 2
క్షయముకాని శాశ్వతధనము పైన నీకు కలదమ్మా } 2
నీ వేష భాషలలో అనుకరణ చావాలమ్మా } 2
నీతి వస్త్రధారణనే అలంకరణ కావాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||
- తేనెలాంటి తీపిమాటలు వల్లించుట దేనికమ్మా } 2
క్రియలు లేని గొప్పబోధలు ఉపయోగం లేనివమ్మా } 2
అనురాగం ఆత్మీయతలే నీ సంపదలవ్వాలమ్మా } 2
యేసు ప్రేమ ప్రతిరూపముగా ఇల నీవు నిలవాలమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||
- మెడలోనే సిలువ ధరిస్తే నీకేమి లాభమమ్మా } 2
జీవితాన సిలువను మోస్తే నిత్యమైన జీవమమ్మా } 2
గుడిలోన దేవదూతలా కనిపిస్తే సరిపోదమ్మా } 2
ప్రతిచోట క్రీస్తుదివ్వెలా వెలుగిస్తే సిరి నీదమ్మా } 2 || అమ్మా విశ్వాసమ్మా ||