Song no: #77
విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్ హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||
- మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||
- పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను||విజయ||
- సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికిఁ కొలువుఁజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాల విలువ గలదని చాటుచు||విజయ||
Song no: #76
క్రీస్తుయేసుకు మంగళం మా కీర్తి రాజుకు మంగళం క్రీస్తుయేసే దైవమంచును కూడి పాడుదు మంగళం||
- ప్రవచనంబులు బల్కినట్టి ప్రాణనాధుడవీవె నీదు స్తవము జేయుచు మెలగు మనుజుల సత్ప్రభువుకిదె మంగళం ||క్రీస్తు||
- జగమునేలెడు జీవనాధుడ జపములందెడు గృపకటాక్ష అగణీ తంబగు ప్రేమజూపిన అమరతేజుడ మంగళం ||క్రీస్తు||
- ఖలుల బ్రోచెడు కనికరాత్మ కేంద్ర స్థానము నీ పదాబ్జము కలుషమును కడమార్చినట్టి సిలువ నాధుడ మంగళం ||క్రీస్తు||
- మనము గోరెడు మా హృదీశుడ మార్గదర్శుడ వీవెగావ అనయము నినుగొల్చు జనముల ఆది దేవుడ మంగళం ||క్రీస్తు||
- జనకసుత శుద్ధాత్మ దేవుడ గనని వినని ప్రేమ పూర్ణుడ తనివితీరగ పాడుదము యీ ధాత్రి నీకగు మంగళం ||క్రీస్తు||
Song no: #74
వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర నీకు ||వందనమే||
- యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునకు||వందనమే||
- ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు యెహోవా నీకు||వందనమే||
- మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ బరమేశ్వర నీకు||వందనమే||
- రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు భువనావన నీకు||వందనమే||
- ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము లర్పింతుము నీకు||వందనమే||
Song no: #72
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||
- రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ ||మంగళము||
- కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి వాఁడని శుభ||మంగళము||
- సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనిని||మంగళము||
Song no: #70
దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ||
- వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ||
- పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ||
- వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ||
- భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ||
- కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ వలదు ||దేవ||
- మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా ||దేవ||
Song no: #69
సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి ||సర్వ||
- ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు ||సర్వ||
- మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము ||సర్వ||
- కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోఁజేరండి ||సర్వ||
- ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే ||సర్వ||
- శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా ||సర్వ||
Song no: #67
శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంతహస్త సృష్టిజూడగా నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభూ నిన్నారాధింతును ||ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షకా! నమస్కరింతునిన్ మారని యో మహాదేవా||
- వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్.
- మహాదేవా! నీయేక పుత్రుండిలన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.
- క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను జేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి జేతునో మహాదేవా.