Sarvadeshamulara sre yese devumdu సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు

Song no: #69
    సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి ||సర్వ||

  1. ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు ||సర్వ||

  2. మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము ||సర్వ||

  3. కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోఁజేరండి ||సర్వ||

  4. ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే ||సర్వ||

  5. శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా ||సర్వ||

Saswathuda vismayamomdhi nenu nee swamthahastha శాశ్వతుడా విస్మయమొంది నేను నీ స్వంతహస్త

Song no: #67
    శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంతహస్త సృష్టిజూడగా నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభూ నిన్నారాధింతును ||ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షకా! నమస్కరింతునిన్ మారని యో మహాదేవా||

  1. వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్.
  2. మహాదేవా! నీయేక పుత్రుండిలన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.
  3. క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను జేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి జేతునో మహాదేవా.

Dhaiva prema prathviloni yannitini దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని

Song no: #66
  1. దైవ ప్రేమ పృథ్విలోని యన్నిటిని మించును యేసు మాలో నివసించు యది మా విముక్తియే నీ కమూల్య ప్రేమ యుండు నీవు దాసుల మైన మమ్ముఁ గృపతో రక్షించుము.

  2. మమ్ము సంరక్షించు శక్తి నీకుండు, మా ప్రభువా ఎన్నఁ డెనఁ డేని నీదు సన్నిధిని బాయుము నిన్ స్తుతించుచుండి మేము సర్వదా సేవింతుము. నిన్ బ్రార్థించి పూర్ణప్రేమ మే మతిశయింతుము

  3. క్రొత్తగా మమ్ము సృజించి పాప మెల్లఁ బాపుము మాకు స్వస్థత నొసంగి గొప్ప రక్షఁ జూపుము భక్తి యభివృద్ది పొంది స్వర్గమందుఁ జేరగా వింత నొంది ప్రేమ స్తుతి నీకర్పింతు మెప్పుడు.

Devuni goppa premanu kalambu దేవుని గొప్ప ప్రేమను కలంబు

Song no: #65
  1. దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను
      ||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
  2. యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్చును అనంత జీవము నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము.
  3. సముద్రమును సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి నరుండు కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును.

Yetha premincheno devudu manapai ఎంత ప్రేమించెనో దేవుడు మనపై

Song no: #64
    ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత||

  1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత||
  2. పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత||
  3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||
  4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత||
  5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత||

Paramapuri kalpabhuja niratha bhunarula puja పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ

Song no: #63
    పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ

  1. జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు ||పరమ||
  2. నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

  3. కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

  4. ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

  5. అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||

gathakalamulayandhu ghanasahayuda deva గతకాలములయందు ఘనసహాయుడ దేవా

Song no: #62
    గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె నిత్యఁడౌ ప్రభువా ||గత||

  1. నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||
  2. నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత||
  3. వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గత||
  4. గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||