-->
Song no: #65
దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ అవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను
||దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్చును అనంత జీవము నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము.
సముద్రమును సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి నరుండు కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును.
Song no: #64
ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే ||ఎంత||
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని జూడరే ||ఎంత||
పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి దేహము దాల్చి ||ఎంత||
ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా ||ఎంత||
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన రాజ్యమును మనకీయును ||ఎంత||
గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క ||ఎంత||
Song no: #63
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ
జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు ||పరమ||
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరమ||
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరమ||
Song no: #62
గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె నిత్యఁడౌ ప్రభువా ||గత||
నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||
నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత||
వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గత||
గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||
Song no: #61
ఘనుఁడైన యెహోవా గద్దె ముందట మీరు వినతు లిప్పుడు చేయుడి యోజనులార వినయంబుగా నిర్మలానంద రసలహరి మన మనం బొప్పుచుండనో జనులార ||ఘనుఁడైన||
ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ జక్కగాను సృజియించు సంహరించు ననియున్ నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే మక్కరలేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె మృత్తుచే మానవులఁగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరఁ దిరుగఁదన దొడ్డిఁబెట్టెనో జనులారా ||ఘనుఁడైన||
మే మందరము వందనపు పాటతో మూగి మించు నీ గుమ్మములలో మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా మధురలయ సహితముగను భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ బొందైన నీ నగరి కా ధామంబులను గాన సన్నుతి వితతిపూరి తమ్ములుగఁ జేయు దేవా యో జనులారా ||ఘనుఁడైన||
ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనె యున్న దయదయ పొరలిపోవుచు నున్నవత్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులారా ||ఘనుఁడైన||
Song no: #59
సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్ర్యేక దేవ స్తుతిఁగావింతు మెంతయు.
నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యఁ బడెను.
భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము ప్రితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు.
Song no: #58
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||
మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||
దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||