Song no: #59
సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచారమెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున మా త్ర్యేక దేవ స్తుతిఁగావింతు మెంతయు.
- నీయందు సృష్టికర్త విశ్రామ మొందెను నీయందు యేసుక్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను నీ యందు పావనాత్మ మాకియ్యఁ బడెను.
- భూవాసు లీ దినంబు సంతోషపడుచు సువార్త విని, పాడి మా యేసు స్తోత్రము ప్రితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు.
Song no: #58
ఇది యెహోవా కలిగించిన దినము సుదివసంబునను జొప్పడు గడియలు కొదువలేని దయ గుల్కెడు వానివి ||యిది||
- మోక్షము భూమియు సమ్మోద మంది నుతులక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక ||నిది||
- అతఁడీ దినమంచంత మొందు నర వితతి నుండి వే వేగ వచ్చెను ||ఇది||
- ఆ పిశాచ రా రాజ్యంబు కూలినది ఆ పరేశు విజయము లీ దినమున ||నిది||
- సేవక వరులు విలసింపఁగఁ జేసి యా పావనాద్భుతములఁ బ్రచురముఁ జేయుదు ||యిది||
- దావీదుని వర తనయుఁడై యభిషేకావృతుఁడౌ రాజా గ్రణికి హోసన్నా ||యిది||
Song no: #57
ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.
- గృహంబుఁ జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవఁ జేయు మమ్మును పాపంబుఁ జేయకుండఁగాయుము.
- మా చుట్టు నుండు మబ్బునఁ ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ముఁ బ్రోవుమా.
Song no: #56
రాత్రియయ్యెన న్నెడఁబాయకు ధాత్రిపైఁ జీఁకతులుఁ గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుఁడా, నన్ బాసిపోకుమీ.
- ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వఁజాలను నీకంటె నాకు లేదుగా లోక ప్రకాశుఁడా, నన్ బాయకు.
- నా చెంత నీవు చేరియుండఁగ ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ బాసిపోకుమా.
- సమృద్ధుఁడు సహాయుఁ డాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? మా మధ్యమున్ సర్వేశ పాయకు.
- రేవు నేఁ జేరఁబోవు వేళలోన్ కావుమయ్యా నీ దీప్తిఁ జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్ బాసిపోకుము.
Song no: #55
ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపఁగా స్తుతించుఁడి. || శుద్ధ, శుద్ధ, శుద్ద సర్వేశుఁడా యిద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ||
- జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండఁగాను మా కీవోసంగు నీ కృపన్ నిత్యోదయం.
- నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముఁ జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు.
ఆనందం పొంగిందీ - అపరాధం పోయింది
జీవితం మొదలైంది - ఈ అనుభవము నాలో } 2
రక్షణ ఆనందం - శ్రీ యేసు నీ జననం
తీయని అనురాగం - నీతోనే నా పయనం } 2
ఊహించిన వివరించిన - సరపోదయ్యా } 2 || ఆనందం ||
- చీకటి ఆవరించే నెమ్మదిలేక - కలవరమాయె నీవు లేక } 2
నా హృదయంలో జన్మించిన క్షణం - పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం } 2
కనుల పండుగ... గుండె నిండుగా... } 2 || ఆనందం ||
- ఎదురు చూసాను గమ్యం లేక - నీవొస్తావని చిన్ని కోరిక } 2
దిగివచ్చావు శరీరదారియై - తరియించింది మానవాళి ఏకమై } 2
నీ జన్మము... సమాధానము...} 2 || ఆనందం ||
Song no: 63
క్రీస్తు జన్మదినం - పుడమి పుణ్యదినం
మరువలేని మరపురాని మహా పర్వదినం } 3
wish you happy Christmas (4)
- యేసయ్యగా మెస్సీయగా పాకలో ఉదయించినాడు
రారాజుడే దీనుడుగా తొట్టిలో పవళించినాడు || wish you ||
- ఆ యేసుని దర్శించిన నీ మది వికసించును
ఆ రాజుని పూజించిన నీ హృది పులకించును || wish you ||