బెత్లెహేము గ్రామములోన
క్రీస్తు యేసు జన్మించినాడే
ఆ పశువుల పాకలోన
ప్రభు యేసు జన్మించినాడే } 2
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కీష్టులైన మనషులకు భూమి మీద సమాదానం } 2
దేవుని స్వరూపము కలిగినవాడై
దాసుని స్వరూపము ధరించుకొని
తన్నుతాను రిక్తునిగా చేసుకొని
ఆకారమందు మనుషుడాయేనే } 2
సిల్వ మరణం పొందినంతగా
- తన్నుతాను తగ్గిచ్చుకొనెను } 2
మరణమొంది మూడవ దినమునాడు
-మృత్యుజయుడై తిరిగి లేచినాడే} 2 || బెత్లెహేము ||
ఆయన ఎదుట ప్రతి మోకాళ్లు వంగున్
ప్రతి నాలుక యేసు ప్రభుని ఒప్పుకొనును
అధికంగా ఆయనను హెచ్చించేదం
యేసు నామమునే గొప్ప చేసెదాము } 2
పరలోకమునకు వెళ్ళి దూతల మీదను
-అధికారుల మీదను శక్తుల మీదను } 2
అధికారం పొందినవాడై
-దేవుని కుడి పార్శమున ఉన్నాడు } 2 || బెత్లెహేము ||
బెత్లెహేము పురముకు ఆ గొర్రెల కాపరులు
పరుగు పరుగునెల్లి ఆ శిశువును పూజించె } 2
బ్రతుకుల్లో సంబరాలే ఆ రోజుతొ వచ్చాయిలే
ప్రకటించె ఈ వార్తని మన యేసు పుట్టాడని } 2
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2
తార చూపు దారిలో ఆ శిశువును చూడాలని
తూర్పు దేశ జ్ఞానులు తరలి తరలి వెళ్లారు } 2
పశువుల పాకలోనే ఆ శిశువును చూశారులే
బంగారము బోళము సాంబ్రాణులనర్పించెను } 2
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ } 2 || రారండోయ్ ||
వచ్చాడు వచ్చాడు రారాజు
పరలోకంలో నుండి వచ్చాడు
తెచ్చాడు తెచ్చాడు రక్షణ
పాపుల కొరకై తెచ్చాడు } 2
ఆనందమే ఆనందమే
క్రిస్మస్ ఆనందమే
సంతోషమే సంతోషమే
మన బ్రతుకుల్లో సంతోషమే } 2 || వచ్చాడు ||
చలి చలిగా ఉన్న ఆ రాత్రి వేళలో
దేవదూత వచ్చి శుభవార్త చెప్పెను } 2
మీ కొరకు రక్షకుడు
లోకానికి ఉదయించేనూ } 2
దూతలేమొ సందడి
గొల్లలేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||
పశువుల పాకలో పరిశుధ్దుడు
మనమెట్టి వారమైన త్రోసివేయడు } 2
మన దోషం తొలగించే
యేసు క్రీస్తు జన్మించెను } 2
దాసులేమొ సందడి
దేశమేమొ సందడి
యేసయ్య పుట్టాడని } 2 || వచ్చాడు ||