Pranamlo pranama odharcche dhaivama ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా

Song no: 01
HD
    ప్రాణంలో ప్రాణమా ఓదార్చే దైవమా
    దేవుడా దేవుడా దారి చూపే దేవుడా
    ఏ చేయూత లేని శూన్యంలో

  1. ఏ తోడు లేని నా జీవితంలో నీ ప్రేమ నాకు తోడాయెనా
    ఏ నీడలేని నా గమనమందు నీ జ్ఞాపకాలే ఆలంబనం
    మనిషిగా పుట్టినా మచ్చలేని దేవుడా
    నీ........... ప్రేమలోనే నా జీవితం || ప్రాణంలో ||

  2. నీ ప్రేమ నాకు కరువైన నాడు అల్లాడి పోదా ఈ జీవితం
    శిలనైన నన్ను కళతోటి నింపి మలిచావు దేవా నీ రూపుగా
    ప్రేమగా జాలిగా ఆదరించే దైవమా
    నీ.......... ఆజ్ఞలందే నా జీవితం || ప్రాణంలో ||

Nee nirnayam yentho viluvainadhi నీ నిర్ణయం ఎంతో విలువైనది

Song no:

    నీ నిర్ణయం ఎంతో విలువైనది ఈ లోకంలో
    అది నిర్దేశించును జీవిత గమ్యమును
    ఈనాడే యేసుని చెంతకు చేరు (2) || నీ నిర్ణయం ||

  1. లోకం దాని ఆశలు గతించిపోవును
    మన్నైన నీ దేహం మరల మన్నై పోవును (2)
    మారుమనస్సు పొందినచో పరలోకం పొందెదవు
    క్షయమైన నీ దేహం అక్షయముగా మారును (2) || నీ నిర్ణయం ||

  2. పాపం దాని ఫలము నిత్య నరకాగ్నియే
    శాపంతో నీవుండిన తప్పదు మరణము (2)
    భరియించె నీ శిక్ష సిలువలో ఆ ప్రభు యేసే
    ఈనాడే యోచించి ప్రభు యేసుని నమ్ముకో (2) || నీ నిర్ణయం ||
Nee Nirnayam Entho Viluvainadi Ee Lokamlo
Adi Nirdeshinchunu Jeevitha Gamyamunu
Eenaade Yesuni Chenthaku Cheru (2)          ||Nee Nirnayam||

Lokam Daani Aashal Gathinchipovunu
Mannaina Nee Deham Marala Mannai Povunu (2)
Maarumanassu Pondinacho Paralokam Pondedavu
Kshayamaina Nee Deham Akshayamugaa Maarunu (2)          ||Nee Nirnayam||

Paapam Daani Phalamu Nithya Narakaagniye
Shaapamlo Neevundina Thappadu Maranamu (2)
Bhariyinche Nee Shiksha Siluvalo Aa Prabhu Yese
Eenaade Yochinchi Prabhu Yesuni Nammuko (2)          ||Nee Nirnayam||

Chusthunnadamma chelli chusthunnadamma చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా

Song no: 51

    చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా
    నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా
    అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా
    తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా } 2

  1. చీకట్లో చేశానని - నన్నెవరు చూస్తారని
    చూసినా నాకేమని - ఎవరేమి చేస్తారని } 2
    భయమసలే లేకున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||

  2. విదేశాల్లో ఉన్నానని - చాలా తెలివైనదాన్నని
    అధికారాలున్నాయని - ఏం చేసినా చెల్లుతుందని } 2
    విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||

  3. సువార్తను విన్నా గాని - నాకు మాత్రం కానే కాదని
    ఇప్పుడే తొందరేమని - ఎపుడైనా చూడొచ్చులే అని } 2
    వాయిదాలు వేస్తున్నావా చెడ్డ పమలు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||

Dandalu dandalayya sami ninda దండాలు దండాలయ్యా సామి నిండా

Song no: 50

    దండాలు దండాలయ్యా సామి నిండా మా దండాలయ్యా } 2

    మెండుగ దీవించి మా బతుకు పండించి
    అండగ ఉండవయ్యా నీవుండగా లోటేదయ్యా
    మా కొండవు నీవేనయ్యా } 2

  1. పేదయింట పుట్టినావా బీదలైన మమ్ము బ్రోవ } 2
    కష్టాలెన్నో ఓర్చినావా - మాదు నష్టాలు తీర్చేటి దేవ } 2
    నీవు లేక నిముషమైన బతకలేము
    నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||

  2. చెదరిన గొర్రెల వెదకే కరుణామయుడవయ్య దేవ } 2
    మది నిండ రూపు నిలిపి శరణు కోరితిమయ్య దేవ } 2
    నీవు లేక నిముషమైన బతకలేము
    నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||

  3. పుట్టించి మమ్ముల పెంచే సృష్టికర్తవు నీవు దేవ } 2
    విడువమయ్య - నీవే నడిపించవయ్య మా నావ } 2
    నీవు లేక నిముషమైన బతకలేము
    నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||

Sakkanaina yesu raju makkuvatho సక్కనైన యేసురాజు మక్కువతో

Song no: 49
    సక్కనైన యేసురాజు మక్కువతో పిలిసినాడు
    ఒక్కమారు ఇనిపో మరి ఎన్నియాలో
    నిక్కముగా నీదు బతుకు లెక్కలన్ని ఎరిగినోడు
    సక్కజేయ పిలిసె మరి ఎన్నియాలో } 2

  1. రాజ్యాలనే లెటోడు ఎన్నియాలో
    నిన్ను రాజుగా చేయగోరె ఎన్నియాలో } 2
    పూజలందుకునెటోడు ఎన్నియాలో
    నీతో భోజనం చేయగోరె ఎన్నియాలో } 2 || సక్కనైన ||

  2. ఆకసమే పట్టనోడు ఎన్నియాలో
    నీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో } 2
    సిరిగలిగిన గొప్పోడు ఎన్నియాలో
    నీకై దరిద్రుడుగ మారినాడు ఎన్నియాలో } 2 || సక్కనైన ||

  3. పాపాలను బాపెటోడు ఎన్నియాలో
    నీకై శాపమాయె సిలువలోన ఎన్నియాలో
    నరకాన్ని తప్పించి ఎన్నియాలో
    నిన్ను సొరగానికి సేర్చదలిచె ఎన్నియాలో || సక్కనైన ||

Galametthi padina swaramalapinchina గళమెత్తి పాడినా స్వరమాలపించినా

Song no: 113

    గళమెత్తి పాడినా - స్వరమాలపించినా } 2
    నీ గానమే - యేసు నీ కోసమే
    నీ ధ్యానమే - యేసూ నీ కోసమే

  1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే
    కృశియించిపోయే నాలో వసియించినావే } 2
    నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్
    నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||

  2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే
    గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2
    నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్
    నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||

  3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే
    కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2
    నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్
    నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||

Kanikara samppannudu krupa chupu devudu కనికర సంపన్నుడు కృపచూపు దేవుడు

Song no: 112
    కనికర సంపన్నుడు - కృపచూపు దేవుడు } 2

    విమోచకుడు - సహాయకుడు } 2
    శ్రీ యేసు దేవుడు - శ్రీ యేసు దేవుడు

  1. దోషము క్షమియించువాడు - పాపము తొలగించువాడు } 2
    ప్రేమించును - దీవించును } 2
    శ్రీ యేసు దేవుడు - శ్రీ యేసు దేవుడు || కనికర ||

  2. భారము భరియించువాడు - క్షేమము కలిగించువాడు } 2
    రోగమును తొలగించును } 2
    శ్రీ యేసు దేవుడు - శ్రీ యేసు దేవుడు || కనికర ||

  3. దీనుల మొర వినువాడు - ఆమేన్ అవుననువాడు } 2
    పాలించును - పోషించును } 2
    శ్రీ యేసు దేవుడు - శ్రీ యేసు దేవుడు || కనికర ||