మెండుగ దీవించి మా బతుకు పండించి
అండగ ఉండవయ్యా నీవుండగా లోటేదయ్యా
మా కొండవు నీవేనయ్యా } 2
పేదయింట పుట్టినావా బీదలైన మమ్ము బ్రోవ } 2
కష్టాలెన్నో ఓర్చినావా - మాదు నష్టాలు తీర్చేటి దేవ } 2
నీవు లేక నిముషమైన బతకలేము
నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||
చెదరిన గొర్రెల వెదకే కరుణామయుడవయ్య దేవ } 2
మది నిండ రూపు నిలిపి శరణు కోరితిమయ్య దేవ } 2
నీవు లేక నిముషమైన బతకలేము
నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||
పుట్టించి మమ్ముల పెంచే సృష్టికర్తవు నీవు దేవ } 2
విడువమయ్య - నీవే నడిపించవయ్య మా నావ } 2
నీవు లేక నిముషమైన బతకలేము
నీదు సెలవు లేక అడుగు కదపలేము } 2 || దండాలు ||
నశియించిపోయే నన్ను బ్రతికించినావే
కృశియించిపోయే నాలో వసియించినావే } 2
నీ కార్యము వివరించెదను - నీ నామము హెచ్చించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే
గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే } 2
నీలో అతిశయించెదన్ - నీ ఆనందించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||
శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే
కృపచేత ఆపదనుండి విడిపించినావే } 2
నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్
నాకున్న సర్వమా - ఏకైక దైవమా } 2|| గళమెత్తి ||