Jeeva nadhini naa hrudhayamulo జీవనదిని నా హృదయములో

Song no:
HD
    జీవనదిని నా హృదయములో
    ప్రవహింప చేయుమయ్యా (2)

  1. శరీర క్రియలన్నియు
    నాలో నశియింప చేయుమయ్యా (2) || జీవ నదిని ||

  2. బలహీన సమయములో
    నీ బలము ప్రసాదించుము (2) || జీవ నదిని ||

  3. ఆత్మీయ వరములతో
    నన్ను అభిషేకం చేయుమయ్యా (2) || జీవ నదిని ||


    Jeevanadini Naa Hrudayamulo
    Pravahimpa Cheyumayyaa (2)

    Shareera Kriyalanniyu
    Naalo Nashiyimpa Cheyumayyaa (2) || Jeeva Nadini ||

    Balaheena Samayamulo
    Nee Balamu Prasaadinchumu (2) || Jeeva Nadini ||

    Aathmeeya Varamulatho
    Nannu Abhishekam Cheyumayyaa (2) || Jeeva Nadini ||

Nee krupa nanu veedanannadhi nee krupa నీ కృప నను వీడనన్నది నీ కృప ఎడబాయనన్నది

Song no:
HD
    నీ కృప నను వీడనన్నది
    నీ కృప ఎడబాయనన్నది } 2
    పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
    సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది

  1. క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
    విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
    ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
    నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
    నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||

  2. పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
    మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
    లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
    నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
    నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||




Deva na arthadwani vinava nenela దేవా నా ఆర్తధ్వని వినవా నేనేల

Song no: 149

    దేవా నా ఆర్థధ్వని వినవా
    నేనేల దూరమైతిని - కృప చూపవా నీ దరికి చేర్చుకొనవా

  1. గాలివాన హోరులో - గమ్యమెటో కానరాక
    గురియైన నిను చేర - పరితపించుచున్నాను
    ఆదరణయైనను- ఆరోగ్యమైనను - ఆనందమైనను నీవేగదా || దేవా ||

  2. అంతరంగ సమరములో - ఆశలెన్నో విఫలముకాగ
    శరణుకోర నినుచేర - తల్లుడిల్లుచున్నాను
    ఆధారమైనను - ఆశ్రయమైనను - ఆరాధనైనను నీవేగదా || దేవా ||

Sarvadhikarivi sarvagnudavu sampurna sathyaswarupivi సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్యస్వరూపివి

Song no: 146

    సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు } 2
    దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
    మహిమాత్మతో నను నింపితివా } 2

  1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ
    కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా } 2
    ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
    స్తుతించుచు నిను నే మహిమపరతును } 2 || సర్వాధికారివి ||

  2. బలశౌర్యములుగల నా యేసయ్యా
    శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
    మారవే నీ సాహసకార్యములు యెన్నడు
    ధైర్యముగా నిను వెంబడింతును } 2 || సర్వాధికారివి ||

  3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక
    భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా } 2
    బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి
    నిరీక్షణతో నే సాగిపోదును } 2 || సర్వాధికారివి ||

Thriyeka devudaina yehovanu kerubulu త్రియేకదేవుడైన యెహోవాను కెరూబులు

Song no: 136
HD

    త్రియేక దేవుడైన యెహోవాను
    కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
    పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
    గాన ప్రతి గానములు చేయుచు ఉండును

  1. నా శాపము బాపిన రక్షణతో
    నా రోగాల పర్వము ముగిసేనే
    వైద్య శాస్త్రములు గ్రహించలేని
    ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||

  2. నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
    పరిశుద్ధాత్మలో ఫలించెదనే
    మేఘ మధనములు చేయలేని
    దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||

  3. నా స్థితిని మార్చిన స్తుతులతో
    నా హృదయము పొంగిపొర్లేనే
    జలాశయములు భరించలేని
    జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||

Sagipodhunu nenu na viswasamunaku karthayaina సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో

Song no: 135

    సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
    సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
    సాగిపోదును నా యేసయ్యతో

  1. ఆత్మీయ బలమును పొందుకొని
    లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
    దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
    నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును ||

  2. నూతనమైన మార్గములో
    తొట్రిల్లకుండ నడిపించును - నవ
    దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
    నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును ||

  3. శ్రేష్ఠమైన బహుమానముకై
    సమర్పణ కలిగి జీవింతును - మరి
    దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
    నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును ||

Saswathamainadhi neetho nakunna anubandhamu శాశ్వతమైనది నీతో నాకున్న అనుబంధము

Song no: 144

    శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
    మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||
    యేసయ్యా నీ నామ స్మరణయే
    నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| || శాశ్వత ||

  1. సంధ్యారాగము వినిపించినావు
    నా హృదయ వీణను సవరించినావు ||2||
    నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||
    నా నోట మృదువైన మాటలు పలికించినావు || శాశ్వత ||

  2. నా విలాప రాగాలు నీవు విన్నావు
    వేకువ చుక్కవై దర్శించినావు
    అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||
    శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు || శాశ్వత ||

    shaashvathamainadhee neethoa naakunna anubMDhamu
    maruvalaenadhee naapai neekunna anuraagamu ||2||
    yaesayyaa nee naama smaraNayae
    nee shvaasa nishvaasavaayenu ||2|| ||shaashvatha||

    1.sMDhyaaraagamu vinipiMchinaavu
    naa hrudhaya veeNanu savariMchinaavu ||2||
    naa cheekati brathukunu veligiMchinaavu ||2||
    naa noata mrudhuvaina maatalu palikiMchinaavu ||shaashvatha||

    2.naa vilaapa raagaalu neevu vinnaavu
    vaekuva chukkavai dharshiMchinaavu
    apavaadhi urula nuMdi vidipiMchinaavu ||2||
    shathruvulanu mithrulugaa neevu maarchiyunnaavu||shaashvatha||