-->
త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచు ఉండును
నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసేనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే || త్రియేక ||
నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మధనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే || త్రియేక ||
నా స్థితిని మార్చిన స్తుతులతో
నా హృదయము పొంగిపొర్లేనే
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే || త్రియేక ||
Song no: 135
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో
సుళువుగా చిక్కులు పెట్టే పాపములు విడిచి
సాగిపోదును నా యేసయ్యతో
ఆత్మీయ బలమును పొందుకొని
లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా
దేవుని శక్తిసంపన్నతతో ప్రకారములను దాటెదను
నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను || సాగిపోదును ||
నూతనమైన మార్గములో
తొట్రిల్లకుండ నడిపించును - నవ
దేవుని కరుణాహస్తము నాచేయి పట్టుకొని
నిశ్చయముగా మహిమలోనికి నన్ను చేర్చునే || సాగిపోదును ||
శ్రేష్ఠమైన బహుమానముకై
సమర్పణ కలిగి జీవింతును - మరి
దేవుని సన్నిధిప్రభావము నాపై ప్రసరించెను
నిశ్చయముగా మరి శ్రేష్ఠమైన సీయోనులో నిలుపును || సాగిపోదును ||
Song no: 144
శాశ్వతమైనదీ నీతో నాకున్న అనుబంధము
మరువలేనదీ నాపై నీకున్న అనురాగము ||2||
యేసయ్యా నీ నామ స్మరణయే
నీ శ్వాస నిశ్వాసవాయెను ||2|| || శాశ్వత ||
సంధ్యారాగము వినిపించినావు
నా హృదయ వీణను సవరించినావు ||2||
నా చీకటి బ్రతుకును వెలిగించినావు ||2||
నా నోట మృదువైన మాటలు పలికించినావు || శాశ్వత ||
నా విలాప రాగాలు నీవు విన్నావు
వేకువ చుక్కవై దర్శించినావు
అపవాది ఉరుల నుండి విడిపించినావు ||2||
శత్రువులను మిత్రులుగా నీవు మార్చియున్నావు || శాశ్వత ||
shaashvathamainadhee neethoa naakunna anubMDhamu
maruvalaenadhee naapai neekunna anuraagamu ||2||
yaesayyaa nee naama smaraNayae
nee shvaasa nishvaasavaayenu ||2|| ||shaashvatha||
1.sMDhyaaraagamu vinipiMchinaavu
naa hrudhaya veeNanu savariMchinaavu ||2||
naa cheekati brathukunu veligiMchinaavu ||2||
naa noata mrudhuvaina maatalu palikiMchinaavu ||shaashvatha||
2.naa vilaapa raagaalu neevu vinnaavu
vaekuva chukkavai dharshiMchinaavu
apavaadhi urula nuMdi vidipiMchinaavu ||2||
shathruvulanu mithrulugaa neevu maarchiyunnaavu||shaashvatha||
Song no: 152
సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి
యెహోవా ఏతెంచెను- తన పరిశుద్ధ ఆలయములో
మన సంతోషము - పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసింతుము
కరుణా కటాక్షము పాప విమోచన
యేసయ్యలోనే ఉన్నవి
విలువైన రక్షణ అలంకారముతో
దేదీప్యమానమై ప్రకాశించెదము || సర్వలోక ||
ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు
మన దేవుని సన్నిధిలో ఉన్నవి
పరిశుద్ధమైన అలంకారముతో
కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము || సర్వలోక ||
సమృద్ధి జీవము సమైక్య సునాదము
జ్యేష్ఠుల సంఘములో ఉన్నవి
మృదువైన అక్షయ అలంకారముతో
సద్భక్తితో సాగిపోదము || సర్వలోక ||
Song no: 159
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే } 2
సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి } 2
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2 || యేసయ్యా ||
నాతోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి } 2
చీకటి దాచిన -వేకువగా మార్చి
బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే } 2 || యేసయ్యా ||
నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి } 2
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై } 2 || యేసయ్యా ||
వందనాలు వందనాలు వరాలు
పంచే నీ గుణ సంపన్నతకు } 2
నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
అతి కాంక్షనీయుడా నా యేసయ్యా } 2 || వందనాలు ||
యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా } 2
యాజక వస్త్రములతో ననుఅలంకరించి
నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే } 2 || వందనాలు ||
ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము } 2
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి } 2 || వందనాలు ||
Vandanaalu Vandanaalu varaalu panche nee guna sampannataku
Nee tyaagaseelataku nee vasamaitine – ati kaankshaneeyudaa naa yesayyaa /2/vanda/
2. Yajamaanuda neevaipu – daasudanaina naa kannulettagaa /2/
Yaajaka vastramulatho nanu alankarinchi – nee unnata pilupunu sthiraparachitive /2/vanda/
3. Aadyantamuleni amaratvame nee swantamu /2/
nee vaarasatvapu hakkulanniyu naa aajnanu neraverchaga dayachesitivi /2/vanda/
Song no: 141
లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము || లెమ్ము ||
శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత || లెమ్ము ||
తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము || లెమ్ము ||
lemmu taejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa !
ninnae smariMchukonuchu nee saakshigaa prakaaSiMchuchu
raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenOLLa prakaTiMcheda !
unnata pilupunu nirlakshyaparachaka neetO naDuchuTae naa bhaagyamu
SaaSvata praematO nanu praemiMchi nee kRpachoopitivi
idiyae bhaagyamu- idiyae bhaagyamu - idiyae naa bhaagyamu " lemmu "
SramalalO neenu iMtavarakunu neetO niluchuTae naa dhanyata
jeevakireeTamunae poduTakae - nanu chaeradeesitivi
idiyae dhanyata - idiyae dhanyata - idiyae naa dhanyata " lemmu "