Song no: 130
నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు } 2 || నా ప్రార్థనలన్ని ||
- అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా } 2
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు } 2 || నా ప్రార్థనలన్ని ||
- ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా } 2
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము } 2 || నా ప్రార్థనలన్ని ||
- ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా } 2
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు } 2 || నా ప్రార్థనలన్ని ||
Song no: 129
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం } 2
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను } 2
- నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే } 2
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను || నా జీవితాన || } 2
- నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది } 2
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది || నా జీవితాన || } 2
- నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు } 2
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను || నా జీవితాన || } 2
Song no: 128
నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని
యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద } 2
నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని } 2
- ఆధారణలేని ఈ లోకములో
ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే } 2
అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్యవాసమే మేలాయెనే } 2 || నా అర్పణలు ||
- గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే } 2
గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో
షాలేము నీడయే నాకు మేలాయెనే } 2 || నా అర్పణలు ||
- మందకాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే } 2
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోనుధ్యానమే నాకు మేలాయెను } 2 || నా అర్పణలు ||
Song no: 122
నీవుగాక ఎవరున్నారు నాకు ఇలలో యేసయ్య } 2
నీవే మార్గము సత్యము నీవే నిత్యజీవము నీవేగదయ్య } 2
- ఘోరపాపముతో నిండిన నా హృదిని
మార్చితివే నీదరి చేర్చితివే } 2
హత్తుకొని ఎత్తుకొని
తల్లివలె నన్ను ఆదరించితివే } 2 || నీవుగాక ||
- అడుగులు తడబడిన నా బ్రతుకుబాటలో
వెదకితివే నావైపు తిరిగితివే } 2
స్థిరపరచి బలపరచి
తండ్రివలె నాకు ధైర్యమిచ్చితివే } 2 || నీవుగాక ||
Song no: 120
నా యేసయ్య - నీ దివ్య ప్రేమలో
నా జీవితం - పరిమళించెనే } 2
- ఒంటరిగువ్వనై - విలపించు సమయాన
ఓదర్చువారే - కానరారైరి } 2
ఔరా! నీచాటు నన్ను దాచినందున - నీకే నా స్తోత్రర్పణలు } 2 || నా యేసయ్య ||
- పూర్నమనసుతో - పరిపూర్ణఆత్మతో
పూర్ణబలముతో - ఆరాధించెద } 2
నూతనసృష్టిగా - నన్ను మార్చినందున - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
- జయించిన నీవు - నా పక్షమైయుండగా
జయమిచ్చు నీవు - నన్ను నడుపుచుండగా } 2
జయమే నా ఆశ - అదియే నీ కాంక్ష - నీకే నా స్తోత్రర్పనలు } 2 || నా యేసయ్య ||
Song no: 119
నిత్యాశ్రయదుర్గమైన యేసయ్య
తరతరములలో నీవు మాకు చేయనివేమున్నవి } 2
ప్రణమిల్లేదను ప్రణుతించెదను పరవసించెద నీలోనే } 2 || నిత్యా ||
- నా నీతిసూర్యుడా నీ నీతికిరణాలు
నీ మార్గములలో నన్ను నడిపించెనే } 2
నా నిత్యరక్షణకు కారణజన్ముడా
నీకే సాక్షిగా తేజరిల్లేదనయ్య } 2 || నిత్యా ||
- నా అభిషిక్తుడా నీ కృపావరములు
సర్వోత్తమమైన మార్గము చూపెనే } 2
మర్మములన్నియు బయలుపరుచువాడా
అనుభవజ్ఞానముతో నేనడిచెదనయ్య } 2 || నిత్యా ||
Song no: 117
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2) || నా గీతా ||
- నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||
- చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||
- ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||