-->

Vinaledha neevu gethsemanelo vyakula rodhananu వినలేదా నీవు గెత్సేమనెలో వ్యాకుల రోదనను

Song no: 88
HD
    వినలేదా నీవు గెత్సేమనెలో
    వ్యాకుల రోదనను
    ప్రాణనాధుడు పాపులాకై
    విజ్ణాపన చేయుచుండె

  1. భరింపజాలని భారము వలన
    దేహము కృశించి క్షిణించెనుగా
    దాహము సహించి తండ్రి సన్నిధిలో
    బాధతో విలపించెగా || వినలేదా ||

  2. వచ్చితినే నీ చిత్తము చేయ
    ఇచ్చెదను నేను నా శరీరం
    నీ చిత్తమే సిద్ధించునుగాకని
    పలుకుచు ప్రార్థించెను || వినలేదా ||

  3. తొలగించు మీ గిన్నె నీ చిత్తమైతే
    తనయుడు తండ్రిని వేడిన వేళలో
    స్వేద బిందువులు రక్తమై మారి
    నేలను కారెనుగా || వినలేదా ||
Share:

Siluvalo nee rupame rakthamayamaye naakosame సిలువలో నీ రూపమే రక్తమయమాయె నాకోసమే

Song no: 84

సిలువలో నీ రూపమే
రక్తమయమాయె నాకోసమే
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు } 2

కపట ముద్దులు మోమున గుద్దులు
కఠినగాయాలు కందిన నీ ఒళ్లు } 2
కారినా రక్తం పారెను ఏరులై } 2
కలుషాత్ముడ నను కడుగ నేగా } 2 || సిలువలో ||

అన్నెం పున్నెం ఎరుగని నీవు
అక్రమ మన్యాయం అసలే ఎరుగవు } 2
అన్యాయము నీకు న్యాయము చెప్పేనా
అరుపుల కేకల అలజడిలోన } 2 || సిలువలో ||

Share:

Premamrutham nee sannidhi nithyamu naapennidhi ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నాపెన్నిధి

Song no: 74

    ప్రేమామృతం నీ సన్నిధి
    నిత్యము నాపెన్నిధి } 2

  1. నీ కృప నన్నాదరించెనులే
    భీకర తుపాను సుడిగాలిలో } 2
    కరములు చాచి ననుచేరదీసి
    పరిశుద్ధుడా నీ బసచేర్చినావు } 2 || ప్రేమామృతం ||

  2. కమ్మని వెలుగై నీవున్నావులే
    చిమ్మచీకటి కెరటాలతో } 2
    చీకటి తెరలు ఛేదించినావు
    నీతి భాస్కరుడా నీవు నాకున్నావు } 2 || ప్రేమామృతం ||
Share:

Yedabayani nee krupalo nadipinchina naa deva యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

Song no: 64

    యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
    దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  1. నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి } 2
    నిత్యములో నను నీ స్వాస్థ్యముగ } 2
    రక్షణ భాగ్యము నొసగితివే

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  2. నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి } 2
    చెదరిన నా హృది బాధలన్నిటిని } 2
    నాట్యముగానే మార్చితివే

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  3. అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా } 2
    ఆహా రక్షక నిన్ను స్తుతించెద } 2
    ఆనంద గీతము నేపాడి

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

Share:

Sthuthi sthothramulu chellinthumu sthuthi geethamune స్తుతి స్తోత్రములు చెల్లిం తుము స్తుతి గీతమునే

Song no: 61
HD
Chorus: హోసన్నా....  హోసన్నా.... 4

    స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
    స్తుతి గీతమునే పాడెదము } 2
    Chorus: హోసన్నా....  హోసన్నా.... } 4

  1. ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
    ప్రభు కృపలకు నేనర్హుడనా
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......
    ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
    ప్రభు కృపలకు నేనర్హుడనా
    నను కరుణించిన నా యేసుని
    నా జీవిత కాలమంత స్తుతించెదను
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......
    నను కరుణించిన నా యేసుని
    నా జీవిత కాలమంత స్తుతించెదను

    Chorus: హల్లెలూయా....  హల్లెలూయా.... } 4

  2. యేసుని ప్రేమను చాటెదను
    నా యేసుని కృపలను ప్రకటింతును
    Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....
    యేసుని ప్రేమను చాటెదను
    నా యేసుని కృపలను ప్రకటింతును
    యేసుకై సాక్షిగా నేనుందును
    నా యేసు కొరకె నే జీవింతును
    Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....
    యేసుకై సాక్షిగా నేనుందును
    నా యేసు కొరకె నే జీవింతును
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా

    Chorus: హల్లెలూయా హల్లెలూయా  } 2

    స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
    స్తుతి గీతమునే పాడెదము } 2
Share:

Sreemanthuda yesayya na athmaku abhishekama శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా

Song no: 60

    శ్రీమంతుడా యేసయ్యా
    నా ఆత్మకు అభిషేకమా
    నా అభినయ సంగీతమా } 2

  1. సిలువధారి నా బలిపీఠమా
    నీ రక్తపు కోట నాకు నివాసమా } 2
    నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
    ఇదియే నీ త్యాగ సంకేతమా } 2 || శ్రీమంతుడా ||

  2. మహిమగల పరిచర్య పొందినందున
    అధైర్యపడను కృప పొందినందున } 2
    మహిమతో నీవు దిగి వచ్చువేళ
    మార్పునొందెద నీ పోలికగా } 2 || శ్రీమంతుడా ||

  3. సీయోను శిఖరము సింహాసనము
    వరపుత్రులకే వారసత్వము } 2
    వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
    వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2 || శ్రీమంతుడా ||

Share:

Yesu devuni asrayinchuma sodhara sodhari యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ

Song no:
HD
    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన

  1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
    మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
    విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2
    యేసు నందు విశ్వాసముంచుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
    మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
    నీవు అడుగుము నీకివ్వబడును } 2
    యేసుని ప్రార్థించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  3. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
    యధారతకు నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను
    సహసము చూపుము సమకూడి జరుగును } 2
    యేసు నందు నిరీక్షించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts