Yedabayani nee krupalo nadipinchina naa deva యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా

Song no: 64

    యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
    దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  1. నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి } 2
    నిత్యములో నను నీ స్వాస్థ్యముగ } 2
    రక్షణ భాగ్యము నొసగితివే

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  2. నా భారములు నీవే భరించి నా నీడగా నాకు తోడైయుండి } 2
    చెదరిన నా హృది బాధలన్నిటిని } 2
    నాట్యముగానే మార్చితివే

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

  3. అనుదినము నీ ఆత్మలోనే ఆనంద మొసగిన నా దేవా } 2
    ఆహా రక్షక నిన్ను స్తుతించెద } 2
    ఆనంద గీతము నేపాడి

    నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
    యెడబాయని నీ కృపలో

Sthuthi sthothramulu chellinthumu sthuthi geethamune స్తుతి స్తోత్రములు చెల్లిం తుము స్తుతి గీతమునే

Song no: 61
HD
Chorus: హోసన్నా....  హోసన్నా.... 4

    స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
    స్తుతి గీతమునే పాడెదము } 2
    Chorus: హోసన్నా....  హోసన్నా.... } 4

  1. ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
    ప్రభు కృపలకు నేనర్హుడనా
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......
    ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
    ప్రభు కృపలకు నేనర్హుడనా
    నను కరుణించిన నా యేసుని
    నా జీవిత కాలమంత స్తుతించెదను
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......
    నను కరుణించిన నా యేసుని
    నా జీవిత కాలమంత స్తుతించెదను

    Chorus: హల్లెలూయా....  హల్లెలూయా.... } 4

  2. యేసుని ప్రేమను చాటెదను
    నా యేసుని కృపలను ప్రకటింతును
    Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....
    యేసుని ప్రేమను చాటెదను
    నా యేసుని కృపలను ప్రకటింతును
    యేసుకై సాక్షిగా నేనుందును
    నా యేసు కొరకె నే జీవింతును
    Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....
    యేసుకై సాక్షిగా నేనుందును
    నా యేసు కొరకె నే జీవింతును
    Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా

    Chorus: హల్లెలూయా హల్లెలూయా  } 2

    స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
    స్తుతి గీతమునే పాడెదము } 2

Sreemanthuda yesayya na athmaku abhishekama శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా

Song no: 60

    శ్రీమంతుడా యేసయ్యా
    నా ఆత్మకు అభిషేకమా
    నా అభినయ సంగీతమా } 2

  1. సిలువధారి నా బలిపీఠమా
    నీ రక్తపు కోట నాకు నివాసమా } 2
    నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
    ఇదియే నీ త్యాగ సంకేతమా } 2 || శ్రీమంతుడా ||

  2. మహిమగల పరిచర్య పొందినందున
    అధైర్యపడను కృప పొందినందున } 2
    మహిమతో నీవు దిగి వచ్చువేళ
    మార్పునొందెద నీ పోలికగా } 2 || శ్రీమంతుడా ||

  3. సీయోను శిఖరము సింహాసనము
    వరపుత్రులకే వారసత్వము } 2
    వాగ్దానములన్ని నేరవేర్చుచుంటివా
    వాగ్దానపూర్ణుడా నా యేసయ్యా } 2 || శ్రీమంతుడా ||

Yesu devuni asrayinchuma sodhara sodhari యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ

Song no:
HD
    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమార్గాన

  1. రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
    మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
    విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును } 2
    యేసు నందు విశ్వాసముంచుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  2. దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
    మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను
    నీవు అడుగుము నీకివ్వబడును } 2
    యేసుని ప్రార్థించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

  3. శోధనలెన్నైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా
    యధారతకు నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను
    సహసము చూపుము సమకూడి జరుగును } 2
    యేసు నందు నిరీక్షించుము } 2

    యేసు నామములోనే స్వస్థత యేసు కృపలోనే భద్రత
    యేసు రక్తములోనే విమోచన యేసే నడిపించును జీవమారాన

    యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే
    విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
    స్వస్థత లేక సహాయము లేక సాలిపోయావా

Na yedhuta neevu therichina thalupulu నా ఎదుట నీవు తెరిచిన తలుపులు

Sthuthi ganame padanaa jayageethame paadanaa స్తుతి గానమే పాడనా జయగీతమే పాడనా

Song no: 143
HD
    స్తుతి గానమే పాడనా
    జయగీతమే పాడనా (2)
    నా ఆధారమైయున్న
    యేసయ్యా నీకు – కృతజ్ఞుడనై
    జీవితమంతయు సాక్షినై యుందును (2) || స్తుతి ||

  1. నమ్మదగినవి నీ న్యాయ విధులు
    మేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)
    నీ ధర్మాసనము – నా హృదయములో
    స్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) || స్తుతి ||

  2. శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు
    లౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)
    నీ శ్రేష్టమైన – పరిచర్యలకై
    కృపావరములతో నను – అలంకరించితివే (2) || స్తుతి ||

  3. నూతనమైనది నీ జీవ మార్గము
    విశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)
    నీ సింహాసనము – నను చేర్చుటకై
    నాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) || స్తుతి ||

Sthuthi Gaaname Paadanaa
Jayageethame Paadanaa (2)
Naa Aadhaaramaiyunna
Yesayyaa Neeku – Kruthagnudanai
Jeevithamanthayu Saakshinai Yundhunu (2)     ||Sthuthi||

Nammadhaginavi Nee Nyaaya Vidhulu
Melimi Bangaaru Kante – Entho Korathaginavi (2)
Nee Dharmaasanamu – Naa Hrudayamulo
Sthaapinchabadiyunnadhi – Parishuddhaathmuniche (2)     ||Sthuthi||

Shreshtamainavi Neevichchu Varamulu
Loukika Gnaanamu Kante – Entho Upayukthamainavi (2)
Nee Shreshtamaina – Paricharyalakai
Krupaavaramulatho Nanu – Alankarinchithive (2)     ||Sthuthi||

Noothanamainadhi Nee Jeeva Maargamu
Vishaala Maargamu Kante – Entho Aashinchadhaginadhi (2)
Nee Simhaasanamu – Nanu Cherchutakai
Naatho Neevuntive – Naa Guri Neevaithive (2)     ||Sthuthi||

Sthuthi ganama na yesayya nee thyagame స్తుతి గానమా నా యేసయ్య నీ త్యాగమే

Song no: 63

స్తుతి గానమా నా యేసయ్య
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం || స్తుతి గానమా ||

నా హీన స్థితిచూచి
నా రక్షణ శృంగమై } 2
నా సన్నిధి నీ తోడని
నను ధైర్యపరచినా } 2
నా నజరేయుడా } 2 || స్తుతి గానమా ||

నీ కృప పొందుటకు
ఏ యోగ్యత లేకున్నను } 2
నీ నామ ఘనతకే నా
శాశ్వత నీ కృపతో } 2
నను నింపితివా } 2 || స్తుతి గానమా ||