Song no: 169
నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం
మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట } 2
- నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు }2
అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||
- నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి } 2
నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||
- సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా
వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా } 2
నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||
Song no: 170
నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా } 2
నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ } 2 || నీ బాహుబలము ||
- ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి }2
అవమానించినవారే అభిమానమును పంచగా
ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం } 2 || నీ బాహుబలము ||
- సారవంతమైన తోటలో నను నాటితివి
సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి } 2
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును } 2 || నీ బాహుబలము ||
- వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు } 2
శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు
గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును }2 || నీ బాహుబలము ||
Song no: 171
ఆర్భాటముతో ప్రధాన దూత శబ్ధముతో దేవుని బూరతో } 2
మహిమతో ప్రభువు తన స్వాస్త్యముకై త్వరగా రానైయున్నాడు } 2
- అరుదెంచెను నవ వసంతము చిగురించుచున్నది అంజూరము } 2
అనుకొనని గడియలో ప్రత్యక్షమగును మేఘాలపై మన ప్రియుడు
ఓపిక కలిగి ఆత్మ ఫలమును ఫలించెదము ప్రభు కొరకే } 2 || ఆర్భాటముతో ||
- పరిశుద్ధతలో సంపూర్ణులమై ప్రభువు వలె మార్పునొందెదము } 2
సూర్య చంద్రులు అక్కర లేని సీయోను నగరము నందు
గొర్రె పిల్ల దీపకాంతిలో ప్రకాశించెదము } 2 || ఆర్భాటముతో ||
- వధువు సంఘముగా ప్రభువుతో కలిసి నిత్యము నివాసముండెదము } 2
ఆహా ఎంతో సొగసైన వైభవమైన పన్నెండు గుమ్మముల నగరములో
యుగయుగాలు మన ప్రాణ ప్రియునితో లీనమై పోదుము } 2 || ఆర్భాటముతో ||
Song no: 85
నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే
- ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక } 2
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా || నా కెంతో ||
- నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని } 2
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా || నా కెంతో ||
Song no: 87
నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో....
నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో....
నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....
- నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2 || నా విమోచకుడా ||
- జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2 || నా విమోచకుడా ||
- మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2 || నా విమోచకుడా ||
Song no: 90
నా మార్గము నకు దీపమైన
నా యేసుతో సదా సాగెద
- గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||
- నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||
- సమస్తమైన నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||
- ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ ||
Song no: 79
హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను... హల్లెలూయా....
- ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి !!2!!
సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||
- ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి !!2!!
అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||
- ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే } 2
తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. . . . } 2 || హల్లెలూయా ప్రభు యేసుకే ||