Nindu manasutho ninne aaradhinchuta nee sankalpam నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం

ly
0
Song no: 169

    నిండు మనసుతో నిన్నే ఆరాదించుట నీ సంకల్పం
    మేలు చేయు నీ వలనే బలమొందుట నా బాగ్యం
    మనోహరమే నిను స్తుతించుట మాధుర్యమే నీ కృప ధ్యానించుట } 2

  1. నీ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో అనుభవించాను
    దివారాత్రులు నను కాయుటకు నాకు కేడెమై నిలిచావు }2
    అందుకో నా దీన స్తుతి పాత్రను సర్వ శక్తుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||

  2. నీ కృపలోనే నిలుచుటకు నేనొక వరమును అడిగితిని
    నా మనవులు మానక అంగీకరించి దీవెన ద్వారము తెరచితివి } 2
    నీకోసమే నా స్తుతుల హృదయార్పణ ఆరాద్యుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||

  3. సర్వ సృష్టి సౌందర్యమంతయు నీ కీర్తినే ప్రకటించుచుండగా
    వేలాది దూతల సైన్యములు నీ మహిమను కొనియాడుచుండగా } 2
    నా స్తుతి సింహసనమునే కోరితివి పరిశుద్దుడా నా యేసయ్య } 2 || నిండు మనసుతో ||


Post a Comment

0Comments

Post a Comment (0)