-->

Naa vimochakuda yesayya nee jivana ragalalo నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో

Song no: 87

    నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నీ జీవన రాగాలలో....
    నీ నామమే ప్రతిధ్వనించెనే నా విమోచకుడా యేసయ్యా....

  1. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నను నింపినందునా } 2
    నీవు చూపిన నీ కృప నేమరువలేను } 2 || నా విమోచకుడా ||

  2. జీవ వాక్యము నాలోన నిలిపి జీవమార్గమలో నడిపించి నందునా } 2
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను } 2 || నా విమోచకుడా ||

  3. మమతలూరించె వారెవరు లేరని నిరాశల చెరనుండి విడిపించినందునా } 2
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను } 2 || నా విమోచకుడా ||
Share:

Naa marghamu naku dhipamaina na yesunitho sadha నా మార్గము నకు దీపమైన నా యేసుతో సదా సాగెద

Song no: 90
    నా మార్గము నకు దీపమైన
    నా యేసుతో సదా సాగెద

  1. గాఢాంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను } 2
    ఆత్మయందు నే కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి
    ఆత్మనాధునితో సాగెదను } 2 || నా మార్గ ||

  2. నాయొక్క ప్రయత్నములన్నియును నిష్పలముగ అవి మారినను } 2
    నా యొక్క ఆశలు అన్నియును నిరాశలుగా మారిపోయినను
    నిరీక్షణతో నే సాగెదను } 2 || నా మార్గ ||

  3. సమస్తమైన  నా భారములు సంపూర్ణముగా ప్రభు తీర్చునుగా } 2
    నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన
    నా దేవునితో సాగెదను } 2 || నా మార్గ ||

  4. ప్రతి ఫలము నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును
    పలు శ్రమలందును విడవకుండ ప్రాణాత్మ దేహము సమర్పించి
    ప్రియుని ముఖము చూచి సాగెదను || నా మార్గ || 
Share:

Halleluya prabhu yesuke sadhakalamu padedhanu హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను

Song no: 79

    హల్లెలూయా ప్రభు యేసుకే సదాకాలము పాడెదను... హల్లెలూయా....

  1. ఆనందం మానంద మానందమే శాశ్వత ప్రేమచే నన్ను ప్రేమించి !!2!!
    సొంత పుత్రునిగా మార్చినది నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||

  2. ఆనందం మానంద మానందమే ఆనంద తైలంతో అభిషేకించి !!2!!
    అతి పరిశుద్ధ స్థల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. . . . || హల్లెలూయా ప్రభు యేసుకే ||


  3. ఆనందం మానంద మానందమే జ్యోతియైన సీయోన్ నివాసమే } 2
    తండ్రి కుడిపార్స్య నిరీక్షణయే నా జీవిత భాగ్యమే. . . . } 2 || హల్లెలూయా ప్రభు యేసుకే ||
Share:

Naa hithuda snehithuda na apthuda na aathmiyuda నా హితుడా స్నేహితుడా నా ఆప్తుడా నా ఆత్మీయుడా

Song no:

    నా హితుడా - స్నేహితుడా
    నా ఆప్తుడా - నా ఆత్మీయుడా నీ కంటే సన్నిహితులు
    నాకెవరున్నారయ్యా నీ వంటీ ఉత్తములు
    వేరెవరున్నారయ్యా

  1. నేను ఆశపడ్డప్పుడు
    నన్ను తృప్తి పరిచావు నేను అలసి ఉన్నప్పుడు
    నన్ను సేదదీర్చావు నేను ఆపదలో
    చిక్కుకున్నప్పుడు నన్ను ఆదుకొని
    ఎత్తుకున్నావు. / నీ కంటే /

  2. నేను బాధ పడ్డప్పుడు
    నన్ను ఓదార్చినావు నేను కష్టాల్లో ఉన్నప్పుడు
    నన్ను చేరదీశావు నేను అనాధనై
    దిక్కు లేనప్పుడు నన్ను ఆదరించి
    హత్తుకున్నావు. / నీ కంటే /
Share:

Snehithuda naa snehithuda na prana snehithuda స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా

Song no:

    స్నేహితుడా నా స్నేహితుడా
    నా ప్రాణ స్నేహితుడా
    ఆపదలో నన్నాదుకొనే
    నిజమైన స్నేహితుడా (2)

  1. నన్నెంతో ప్రేమించినావు
    నాకోసం మరణించినావు (2)
    మరువగలనా నీ స్నేహము
    మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||

  2. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
    నే వేచానే నిరతం నీ తోడుకై (2)
    ఇచ్చెదన్ నా సర్వస్వము
    నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||

  3. కన్నీటితో ఉన్న నన్ను
    కరుణించి నను పలుకరించావు (2)
    మండిన ఎడారిలోన
    మమత వెల్లువ కురిపించినావు (2) ||స్నేహితుడా||
Share:

Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య

Song no:

    నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్య
    నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2)
    నాతో ఉండేది - నీ స్నేహం యేసయా
    నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం"

  1. మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
    విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
    నీకెవరూ సాటే రారయ్యా
    నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం"

  2. ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా
    అలరించే అందాలన్నీ - వ్యర్థమే కదా (2)
    నిజమైన స్నేహం నీదయ్యా
    నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా (2) "నిత్యం"

Share:

Yesu kresthuni siluva dhyanamu cheyu యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు

Song no: 32

    యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా = మనదోసంబు నెడబాపు - ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా

  1. ధీరుండై ధీనుండై - ధారుణ్య పాపభారంబు మోసెను సోదరా = తన్ను - జేరినవారిని - పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా || యేసు ||

  2. ఎండచే గాయములు - మండుచునుండెను - నిండు వేదన సోదరా = గుండె - నుండి నీరుకారు - చుండె దుఃఖించుచు - నుండు వేళను సోదరా || యేసు ||

  3. ఒళ్ళంత రక్తము - ముళ్ళ కిరీటము - తలపై బెట్టిరి సోదరా = ఒకడు బళ్ళెంబుతో బొడవ - నీళ్ళు రక్తము గారె - చిల్లులాయెను సోదరా || యేసు ||

  4. కటకటా - పాపసంకటము - బాపుట కింత ఎటులోర్చితివి సోదరా = ఎంతో కఠినహ్రదయంబైన - అటుజూచి తరచినా కరిగిపోవును సోదరా || యేసు ||

  5. పంచగాయములు - నేనెంచి తలంచినా వంచనయిది సోదరా = నన్ను వంచించు సైతాను - వలనుండి గావ - తానెంచి బొందెను సోదరా || యేసు ||

  6. మరణమై నప్పుడు - ధరణి వణికెను గుడి - తెర చినిగెను సోదరా = ఊరు గిరులు బండలు బద్ద - లాయె సమాధులు - తెరువబడెను సోదరా || యేసు ||







raagaM: - taaLaM: -



    yaesukreestuni siluva - epuDu dhyaanamu chaeyu maasatOnu sOdaraa = manadOsaMbu neDabaapu - ee saMtaapa maraNa - vyaasaMbuchae sOdaraa

  1. dheeruMDai dheenuMDai - dhaaruNya paapabhaaraMbu mOsenu sOdaraa = tannu - jaerinavaarini - paaradOlanani - evaru balkiri sOdaraa || yaesu ||

  2. eMDachae gaayamulu - maMDuchunuMDenu - niMDu vaedana sOdaraa = guMDe - nuMDi neerukaaru - chuMDe du@hkhiMchuchu - nuMDu vaeLanu sOdaraa || yaesu ||

  3. oLLaMta raktamu - muLLa kireeTamu - talapai beTTiri sOdaraa = okaDu baLLeMbutO boDava - neeLLu raktamu gaare - chillulaayenu sOdaraa || yaesu ||

  4. kaTakaTaa - paapasaMkaTamu - baapuTa kiMta eTulOrchitivi sOdaraa = eMtO kaThinahradayaMbaina - aTujoochi tarachinaa karigipOvunu sOdaraa || yaesu ||

  5. paMchagaayamulu - naeneMchi talaMchinaa vaMchanayidi sOdaraa = nannu vaMchiMchu saitaanu - valanuMDi gaava - taaneMchi boMdenu sOdaraa || yaesu ||

  6. maraNamai nappuDu - dharaNi vaNikenu guDi - tera chinigenu sOdaraa = ooru girulu baMDalu badda - laaye samaadhulu - teruvabaDenu sOdaraa || yaesu ||

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts