Song no: 16
నేడు దేవుడు నిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడా మేలుకో =
ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై - మేలుకో పాపము చాలుకో
- దైవకోపమునుండి - తప్పించు బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో =
తుదకు - నీవు మోక్షము చేరి నిత్యముండుటకై ఎత్తుకో = బాలుని హత్తుకో|| నేడు ||
- నరకంబుతప్పించు - నరుడౌదేవపుత్రుని - పుచ్చుకో నరుడా పుచ్చుకో =
మరియు దురితాలన్ గెల్పించు పరిశుద్ధబాలుని పుచ్చుకో = దేవుని మెచ్చుకో|| నేడు ||
- హృదయమను తొట్టెలో - నేయుండుమని మొర్ర - బెట్టుకో మొర్ర - బెట్టుకో =
మనకు -ముదమిచ్చి బ్రోచెడి - ముద్దు బాలకుని పట్టుకో ముద్దు బెట్టుకో || నేడు ||
raagaM: daeSaakshi
taaLaM: chaapu
naeDu daevuDu ninnu - chooDavachchinaaDu - maelukO - naruDaa maelukO =
idigO naeDu rakshaNa techchinaaDu nee kOsamai - maelukO paapamu chaalukO
- daivakOpamunuMDi - tappiMchu baaluni - ettukO - naruDa ettukO =
tudaku - neevu mOkshamu chaeri nityamuMDuTakai ettukO = baaluni hattukO|| naeDu ||
- narakaMbutappiMchu - naruDaudaevaputruni - puchchukO naruDaa puchchukO =
mariyu duritaalan^ gelpiMchu pariSuddhabaaluni puchchukO = daevuni mechchukO|| naeDu ||
- hRdayamanu toTTelO - naeyuMDumani morra - beTTukO morra - beTTukO =
manaku -mudamichchi brOcheDi - muddu baalakuni paTTukO muddu beTTukO || naeDu ||
Song no: 15
దేవా మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా నరుల హృదయము నందు నీకు స్తోత్ర గీతము || దేవా మేము ||
- నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు
నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము ||
- నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు
అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు || దేవా మేము ||
- అనుమానము లేకుండా - జేయు ఆత్మవు
వెనుకాడు గుణము బెరికి - వేయు విజయశాలివి || దేవా మేము ||
- నీ ప్రేమను నమ్మని నైజము - కూల్చు తండ్రివి
నీ శక్తిని నమ్మని బుద్ధిని పరిమార్చు ప - రాక్రమ శాలివి || దేవా మేము ||
- అవిశ్వాసపు సంగతులు - దహించు అగ్నివి
అవి నాలోనుండి తీసివేయు వి - శ్వాస పాత్రుడవు || దేవా మేము ||
- క్రీస్తునుబట్టి ఈ మేలు - చేయు దేవా
నా హృదయము నిండ ఉన్న స్తుతులు - అంగీకరించుము || దేవా మేము ||
- తండ్రికిని కుమారునికిని - పరిశుద్ధ ఆత్మకున్
యుగయుగముల - వరకు మహిమ కలుగును గాక || దేవా మేము ||
daevaa maemu nammadagina vaaramaa - sRshTi kartaa narula hRdayamu naMdu neeku stOtra geetamu || daevaa maemu ||
- naalOni aviSvaasamu pO - goTTu daevuDavu
naa saMdaehamunu - aNachunaTTi daevuDavu || daevaa maemu ||
- naalOpuTTu saMSayamu maa - npiMchu daevuDavu
apanammikanu nirmoola - parachunaTTi kartavu || daevaa maemu ||
- anumaanamu laekuMDaa - jaeyu aatmavu
venukaaDu guNamu beriki - vaeyu vijayaSaalivi || daevaa maemu ||
- nee praemanu nammani naijamu - koolchu taMDrivi
nee Saktini nammani buddhini parimaarchu pa - raakrama Saalivi || daevaa maemu ||
- aviSvaasapu saMgatulu - dahiMchu agnivi
avi naalOnuMDi teesivaeyu vi - Svaasa paatruDavu || daevaa maemu ||
- kreestunubaTTi ee maelu - chaeyu daevaa
naa hRdayamu niMDa unna stutulu - aMgeekariMchumu || daevaa maemu ||
- taMDrikini kumaarunikini - pariSuddha aatmakun^
yugayugamula - varaku mahima kalugunu gaaka || daevaa maemu ||
Song no: 14
దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||
- కాబట్టి నేను నిన్ను స్తు - తించుచున్నాను - నిన్ను స్తుతించు స్తుతినే - యెంచుకొనుచున్నాను || దేవా నీవే ||
- దేవదూతలు నిన్ను స్తు - తించుచున్నారు - వారే మహిమతో స్తోత్రించుచున్నారు || దేవా నీవే ||
- పరలోక పరిశుద్ధులు నిన్ను స్తు - తించుచున్నారు వారును మహిమతోనే స్తు - తించుచున్నారు || దేవా నీవే ||
- మేము వారివలె స్తు - తించలేము - మేమింక నటకు రానందున - అట్లు స్తుతించ లేము || దేవా నీవే ||
- అయినను మ స్తుతులు కూడ - కోరుకొనుచున్నావు - గనుక నీ కోరిక కనేక - స్తోత్రములు || దేవా నీవే ||
- యేసు ప్రభువును బట్టి మా - స్తోత్రములు అందుకొందువని స్తుతి - చేయుచున్నాము || దేవా నీవే ||
daevaa neevae - stOtra paatruDavu neevu maatramae - mahima roopivi || daevaa neevae ||
- kaabaTTi naenu ninnu stu - tiMchuchunnaanu - ninnu stutiMchu stutinae - yeMchukonuchunnaanu || daevaa neevae ||
- daevadootalu ninnu stu - tiMchuchunnaaru - vaarae mahimatO stOtriMchuchunnaaru || daevaa neevae ||
- paralOka pariSuddhulu ninnu stu - tiMchuchunnaaru vaarunu mahimatOnae stu - tiMchuchunnaaru || daevaa neevae ||
- maemu vaarivale stu - tiMchalaemu - maemiMka naTaku raanaMduna - aTlu stutiMcha laemu || daevaa neevae ||
- ayinanu ma stutulu kooDa - kOrukonuchunnaavu - ganuka nee kOrika kanaeka - stOtramulu || daevaa neevae ||
- yaesu prabhuvunu baTTi maa - stOtramulu aMdukoMduvani stuti - chaeyuchunnaamu || daevaa neevae ||
Song no: 13
స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబుతట్టు - మళ్ళునపుడు వెళ్ళగలము
- ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క ముక్కలై పోవు న్ || స్తుతి చేయ||
stuti chaeya raMDi raMDi - sOdarulaaraa - stuti stutulu chaeya raMDi = stutula venka stutulu chaeya - smRti kRtaj~nata oorunu - mati kaDaku mOkshaMbutaTTu - maLLunapuDu veLLagalamu
- ikkaDa stuti saagadu - manamu veLLu akkaDa stuti saagunu = ikkaDane stuti chaeyasaaguTa - keMtayunu yatnaMbu chaesina - yekkaDa laenaTTi Sramalu - mukka mukkalai pOvu n^ || stuti chaeya||
||Jesus||
Song no: 12
స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి
విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
- ప్రసవవేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన
ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
- ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి ||స్తుతులు||
raagaM: -
taaLaM: -
stutulu ghanasaMstutulu neekae - matilO naataMDri-prati
vishaya praardana samayaMbuna - kRtaj~nataa stOtramu taMDri
- prasavavaedana praardana chaeyu - vaalimmu taMDri - nisupaina vij~naapana
praardana - naerpu prasaadiMchumu taMDri ||stutulu||
- aa stitiyuMchumu neravaerupa - ryaMtamu naa taMDri - dusthiti
pOvuTa bhaagyamulanniTa - doDDabhaagyame naa taMDri ||stutulu||
Song no: 11
విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప - విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు || విజయ ||
- నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి || విజయ ||
- ఆటలాడుకొన్నను నీ నామమున - పాటల్ పాడు కున్నను = నాటకంబుల్ కట్టుకున్నను - నాట్యమాడుచు మురియుచున్నను - కూటములను జరుపుకున్నను - నీటుగను నీ కేను కీర్తి || విజయ ||
- పరలోకమున కీర్తి - దేవా నీకే ధరణియందున కీర్తి = నరుల హృదయములందు కీర్తి - పరమ దూతలందు కీర్తి - జరుగు కారయములందు కీర్తి - జరుగని పనులందు కీర్తి || విజయ ||
(chaaya : stuti chaeya raMDi, raMDi)
vijaya saMstutulae neeku - praema svaroopa - vijaya saMstutulu neeku = jayamu labhiMchu neeku - viSvamaMtaTa sarva deeksha - prajala valana nityamaina - praNutulu siddhiMchu neeku || vijaya ||
- naeDu maapanulellanu deeviMchumu - niMDugaa vardhillunu = chooDavachchina vaarikini bahu - Subhakaramugaa nuMDunaTula - keeDu baapuchu maeLLanu - sama kooDa jaesina neekae keerti || vijaya ||
- aaTalaaDukonnanu nee naamamuna - paaTal^ paaDu kunnanu = naaTakaMbul^ kaTTukunnanu - naaTyamaaDuchu muriyuchunnanu - kooTamulanu jarupukunnanu - neeTuganu nee kaenu keerti || vijaya ||
- paralOkamuna keerti - daevaa neekae dharaNiyaMduna keerti = narula hRdayamulaMdu keerti - parama dootalaMdu keerti - jarugu kaarayamulaMdu keerti - jarugani panulaMdu keerti || vijaya ||
Song no: 10
స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||
- వేడుకొనక ముందే - ప్రార్ధన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
- మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు కలుగును గాక || స్తుతి ||
raagaM: kharahara priya
taaLaM: aadi
stuti jaetumu neeku - daeva stuti jaetumu neeku = gatiyiMchenu keeDellanu gaana - stuti gaanamu jaeyudamO taMDri || stuti ||
- vaeDukonaka muMdae - praardhana viniyuMTivi daevaa = naeDunu raepunu ellappuDu sama - kooDunu stuti gaanamu neekilalO || stuti ||
- manasunu naalukayu neeku - anudina stuti jaeyun^ = janaka kumaaraatmalaku stOtramu - ghanatayu mahimayu kalugunu gaaka || stuti ||