Yesu nannu preminchinavu papinaina యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను

Song no: 171

    యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||

  1. నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||

  2. తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||

  3. మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ||

  4. నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ||

  5. నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ||

Kreesthe sarvadhikari kreesthe mahopakari క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి

Song no: 144

    క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
    క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||

  1. ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
    భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||

  2. దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
    దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||

  3. శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
    శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||

  4. సైతాను జనము గూల్పన్ పాతాళమునకు బంపన్
    నీతి పథంబు బెంప రుధిరంబు గార్చెగాన ||క్రీ||

  5. మృత్యువు ముల్లు తృంపన్ నిత్యజీవంబు బెంపన్
    మర్త్యాళిభయము దీర్పన్ మరణంబు గెలిచెగాన ||క్రీ||

  6. పరమందు దివిజులైన ధరయందు మనుజులైన
    ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించుగాన ||క్రీ||

  7. ఈ నామమునకు మించు నామంబు లేదటంచు
    యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు గాన ||క్రీ||

Sarvaloka sampoojya namo namo సర్వ లోక సం పూజ్యా నమోనమో

Song no: #87

    సర్వ లోక సం పూజ్యా నమోనమో
    సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
    సర్వ సత్య సారాంశా నమోనమో
    దేవా గావో || 4

  1. దీన భక్త మందారా నమోనమో
    దోష శక్తి సంహారా నమోనమో
    దేవా యేసావతార నమోనమో
    దేవా గావో || 4

  2. దేవలోక ప్రదీపా నమోనమో
    భావలోక ప్రతాపా నమోనమో
    పావనాత్మ స్వరూపా నమోనమో
    దేవా గావో || 4

  3. వేదవాక్యాదర్శ మీవె నమోనమో
    వేద జీవమార్గం బీవె నమోనమో
    వేదవాక్కును నీవే నమోనమో
    దేవా గావో || 4

  4. శాపగ్రహివైతివి నాకై నమోనమో
    ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో
    ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో
    దేవా గావో || 4

Jay jay jay yesayya pujyudavu neevayya జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా

Song no:
    హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్
    జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా
    ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా
    మాకు సంతోషం తెచ్చావయ్యా (2)

  1. కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
    పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
    పశుల పాకలో పశుల తొట్టిలోపసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై॥

  2. దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను
    నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు (2)
    లోక రక్షకుడు జన్మించెననిసంతోషముతో ఆనందముతో (2)
    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై|

Nee prama nee karuna chalunaya naa jeevithana నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా

Song no:

    నీ ప్రేమా..... నీ కరుణా... చాలునయా నా జీవితానా
    మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జాగానా

    చాలయ్య చాలీ దీవెనలు చాలు
    మేలయ్యమేలు నీ సన్నిధి మేలు

  1. గురిలేని నన్ను గుర్తించినావే
    ఎనలేని ప్రేమను చూపించినావే
    వెలలేని నాకు విలువిచ్చినావే
    విలువైన పాత్రగా నను మార్చినావే

  2. చేజారిన నాకై చేజాచినావే
    చెదరిన నన్ను విడిపించినావే
    చెరనుండి నన్ను విడిపించినావే
    చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే

  3. నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
    కల్వరిలో ప్రాణమిచ్చి ననుకొన్నావే
    నీప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
    నీ కుమారునిగా నను మార్చినావే

Kaluvari siluva siluvalo viluva naku thelipenuga కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిసెనుగా

Song no:
    కలువరి సిలువ సిలువలో విలువ
    నాకు తెలిసెనుగా
    కలుషము బాపి కరుణను చూపి
    నన్ను వెదికెనుగా (2)
    అజేయుడా విజేయుడా
    సజీవుడా సంపూర్ణుడా (2) ||కలువరి||

  1. కష్టాలలోన నష్టాలలోన
    నన్నాదుకొన్నావయ్యా
    వ్యాధులలోన బాధలలోన
    కన్నీరు తుడిచావయ్యా (2)
    మధురమైన నీ ప్రేమ
    మరువగలనా ఆ ప్రేమ (2)
    అనుక్షణం నీ ఆలోచన
    నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||

  2. పాపానికైనా శాపానికైనా
    రక్తాన్ని కార్చావయ్యా
    దోషానికైనా ద్వేషానికైనా
    మరణించి లేచావయ్యా (2)
    మధురమైన నీ ప్రేమ
    మరువగలనా ఆ ప్రేమ (2)
    అనుక్షణం నీ ఆలోచన
    నిరంతరము నాకు నీవిచ్చిన ||కలువరి||
Kaluvari Siluva Siluvalo Viluva
Naaku Thelisenugaa
Kalushamu Baapi Karunanu Choopi
Nannu Vedikenugaa (2)
Ajeyudaa Vijeyudaa
Sajeevudaa Sampoornudaa (2) ||Kaluvari||

Kashtaalalona Nashtaalalona
Nanaadukonnavayyaa
Vyaadhulalona Baadhalalona
Kanneeru Thudichaavayyaa (2)
Madhuramaina Nee Prema
Maruvagalanaa Aa Prema (2)
Anukshanam Nee Aalochana
Nirantharamu Naaku Neevichchina ||Kaluvari||

Paapaanikainaa Shaapaanikainaa
Rakthaanni Kaarchaavayyaa
Doshaanikainaa Dweshaanikainaa
Maraninchi Lechaavayyaa (2)
Madhuramaina Nee Prema
Maruvagalanaa Aa Prema (2)
Anukshanam Nee Aalochana
Nirantharamu Naaku Neevichchina ||Kaluvari||

Jeevinchuchunnadhi nenu kadhu kreesthutho nenu జీవించుచున్నది నేను కాదు క్రీస్తుతో నేను సిలువవేయబడినాను

Song no: 176

    జీవించుచున్నది నేను కాదు
    క్రీస్తుతో నేను సిలువవేయబడినాను
    క్రిస్తే నాలో జీవించుచున్నడు

  1. నేను నా సొత్తు కానేకాను } 2
    క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను
    నేను నా సొత్తు కానేకాను
    క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను

    నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు } 2
    యేసయ్య చిత్తమే నాలో నేరవేరుచున్నది } 2 || జీవించు ||

  2. యుద్ధము నాది కానేకాదు } 2
    యుద్ధము యేసయ్యదే నా పక్షమున
    యుద్ధము నాది కానేకాదు
    యుద్ధము యేసయ్యదే నా పక్షమున

    జయమసలే నాది కానేకాదు } 2
    యేసయ్య నా పక్షమున జయమిచ్చినాడు } 2 || జీవించు ||

  3. లోకము నాది కానేకాదు } 2
    యాత్రికుడను పరదేశిని
    లోకము నాది కానేకాదు
    యాత్రికుడను పరదేశిని

    నాకు నివాసము లేనేలేదు } 2
    యేసయ్య నివాసము నాకిచ్చినాడు } 2 || జీవించు ||