Dhayagala hrudhayudavu nee swasthvamunu దయగల హృదయుడవు నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు

Song no: 173

    దయగల హృదయుడవు
    నీ స్వస్త్యమును ఎన్నడు ఎడబాయవు
    ఎడారిలో ఊటలను
    జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు
    సర్వలోకము నీకు నమస్కరించి
    నిన్ను కొనియాడును "దయగల"

  1. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవమార్గము
    సారము వెదజల్లు నీ జాడలె నాకు జీవన గమనము 2
    శ్రేష్టమైన ఉపదేశముతో జీవముగలిగిన సంఘములో
    నింపుచున్నావు దీవెనలతో నను నడుపుచున్నావు సమృద్దితో 2

  2. పరిశుద్దుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము
    పరిశుద్దుల సహవాసమై నాకు క్షేమధారాము 2
    విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా
    విసుగక నిత్యము ప్రార్ధింతును నిను నిశ్చలమైన నిరీక్షణతో 2

  3. పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము
    పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము 2
    ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే
    ఆరాధింతును నా యేసయ్యా నిను నిత్యము కీర్తించి ఘనపరతును

Devaa vembadinchithi nee namamun దేవా! వెంబడించితి నీ నామమున్

Song no: 367

    దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే
    రావె నా భాగ్యమా యేసువా ||దేవా||

  1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని
    యేసువాడను నే నంటిని ||దేవా||

  2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము
    పురికిన్ పావనా జూపుము మార్గము ||దేవా||

  3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే
    నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా||

  4. స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ
    సత్య సువార్త నే జాటుదున్ ||దేవా||

  5. రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
    రక్షణానందము గూర్చుము ||దేవా||

Kasta nastalaina kadagandla brathukaina కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా

Song no:

    కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
    ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)

    నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
    బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
    యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||

    కొండగా అండగా – నీవుండగ లోకాన
    ఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగా
    యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||

    కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
    నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||

Ye sati leni yesuni prema yepudaina ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా

Song no:
    ఏ సాటి లేని యేసుని ప్రేమ ఎప్పుడైనా రుచియించినావా
    యిప్పుడైనా ఆశించి రావా

  1. నీ దేవుండెవరు నీ పూజెవ్వరికి నశియించె వెండి బంగారాలకా
    నిజ దైవమెవరు నీ రక్షకుడెవరు నీవెన్నడైనా తలచావా
    నీకున్న లోటెరిగినావా || ఏ సాటి లేని ||

  2. కలువరి గిరిపై విలువైన ప్రాణం అర్పించి మరణించిందీ నీ కొరకై
    నిన్నెంతగానో ప్రేమించినట్టి నీ దేవుని ప్రేమ
    గ్రోలన్ మోదంబున రావదేల || ఏ సాటి లేని ||

  3. వేదంబులందు వ్రాయబడినట్లు ఈ ధరను రక్షింప నవతరంచి
    బలియాగమైన ప్రభు యేసు కాక మరి ఎవ్వరైనను కలరా
    మనసారా యోచించిరావా || ఏ సాటి లేని ||



Song no:
    Ye sati leni yesuni prema eppudaina ruchiyimchinava
    Yippudaina asimchi rava

  1. Ni devumdevaru ni pujevvariki nasiyimche vemdi bamgaralaka
    Nija daivamevaru ni rakshakudevaru nivennadaina talachava
    Nikunna loteriginava|| Ye sati leni ||

  2. Kaluvari giripai viluvaina pranam arpimchi maranimchimdi ni korakai
    Ninnemtagano premimchinatti ni devuni prema
    Grolan modambuna ravadela|| Ye sati leni ||

  3. Vedambulamdu vrayabadinatlu I dharanu rakshimpa navataramchi
    Baliyagamaina prabu yesu kaka mari evvarainanu kalara
    Manasara yochimchirava || Ye sati leni ||




Naku jeevamai unna naa jeevama నాకు జీవమై ఉన్న నా జీవమా

Song no:
    నాకు జీవమై ఉన్న నా జీవమా
    నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా
    నాకు బలమై ఉన్న నా బలమా
    నాకు సర్వమై ఉన్న నా సర్వమా
    నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
    నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై||

  1. పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
    యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు } 2
    నా ఆరాధన నా ఆలాపన
    నా స్తుతి కీర్తన నీవే
    నా ఆలోచన నా ఆకర్షణ
    నా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై||

  2. నాయకుడా… నా మంచి స్నేహితుడా
    రక్షకుడా… నా ప్రాణ నాథుడా } 2
    నా ఆనందము నా ఆలంబన
    నా అతిశయము నీవే
    నా ఆదరణ నా ఆశ్రయము
    నా పోషకుడవు నీవే ||నాకు జీవమై||



Song no:
    Naaku Jeevamai Unna Naa Jeevamaa
    Naaku Praanamai Unna Naa Praanamaa
    Naaku Balamai Unna Naa Balamaa
    Naaku Sarvamai Unna Naa Sarvamaa
    Nee Naamame Paadedan Naa Jeevitha Kaalamanthaa
    Nee Dhyaaname Cheseda Naa Oopiri Unnantha Varaku         || Naaku Jeevamai ||

  1. Poojyudavu… Unnatha Devudavu
    Yogyudavu… Parishuddha Raajuvu } 2
    Naa Aaraadhana Naa Aalaapana
    Naa Sthuthi Keerthana Neeve
    Naa Aalochana Naa Aakarshana
    Naa Sthothraarpana Neeke         || Naaku Jeevamai ||

  2. Naayakudaa… Naa Manchi Snehithudaa
    Rakshakudaa… Naa Praana Naathudaa } 2
    Naa Aanandamu Naa Aalambana
    Naa Athishayamu Neeve
    Naa Aadarana Naa Aashrayamu
    Naa Poshakudavu Neeve         || Naaku Jeevamai ||


Kadavari dhinamulalo ravali ujjivam కడవరి దినములలో రావాలి ఉజ్జీవం

Song no:
    కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
    యేసుని అడుగులలో నడవాలి యువతరం
    అ.ప: భావి భారత పౌరులారా కదలిరండి
    ఉత్తేజముతో క్రీస్తు రాజు వారసులారా
    తరలి రండి ఉద్వేగముతో

  1. క్రీస్తు సిలువను భుజమున మోస్తు
    ఆసేతు హిమాలయం యేసు పవిత్ర నామము
    ఇలలో మారు మ్రోగునట్లు
    విగ్రహారాధనను భువిపై రూపుమాపే వరకు
    భారతదేశం క్రీస్తు రాకకై సిద్ధమయ్యే వరకు
    కదలి రావాలి యువజనము
    కలసి తేవాలి చైతన్యం

  2. కులము మతము మనిషికి రక్షణ
    ఇవ్వవనినినదించండి యేసు క్రీస్తు
    ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
    మూఢనమ్మకాలు భువిపై సమసి పోయేవరకు
    అనాగరికులు మతోన్మాధులు మార్పు చెందే వరకూ
    కదలి రావాలి యువజనము
    కలసి తేవాలి చైతన్యం






Song no:
    Kadavari dinamulalo ravali ujjivam
    Yesuni adugulalo nadavali yuvataram
    A.pa: Bavi barata paurulara kadaliramdi
    Uttejamuto kristu raju varasulara
    Tarali ramdi udvegamuto

  1. Kristu siluvanu bujamuna mostu
    Asetu himalayam yesu pavitra namamu
    Ilalo maru mrogunatlu
    Vigraharadhananu buvipai rupumape varaku
    Baratadesam kristu rakakai siddhamayye varaku
    Kadali ravali yuvajanamu
    Kalasi tevali chaitanyam

  2. Kulamu matamu manishiki rakshana
    Ivvavanininadimchamdi yesu kristu
    Prabuve ilalo loka rakshakudanuchu
    Mudhanammakalu buvipai samasi poyevaraku
    Anagarikulu matonmadhulu marpu chemde varaku
    Kadali ravali yuvajanamu
    Kalasi tevali chaitanyam


Viluvaina premalo vanchana ledhu kalvari premalo విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో

Song no:
    విలువైన ప్రేమలో వంచన లేదు
    కల్వరి ప్రేమలో కల్మషం లేదు
    మధురమైన ప్రేమలో మరణం లేదు
    శాశ్వత ప్రేమలో శాపం లేదు
    యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు
    అద్భుత ప్రేమలో అరమరిక లేదు

  1. వాడిగల నాలుక చేసిన గాయం
    శోధన సమయం మిగిల్చిన భారం
    అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో } 2
    నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో } 2

  2. నా దోషములను మోసిన ప్రేమ
    నాకై సిలువను కోరిన ప్రేమ
    పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ } 2
    ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ } 2





Song no:
    Viluvaina premalo vamchana ledu
    kalvari premalo kalmasham ledu
    Madhuramaina premalo maranam ledu
    sasvata premalo sapam ledu
    Yesayya premalo edabatu ledu
    adbuta premalo aramarika ledu

  1. Vadigala naluka chesina gayam
    sodhana samayam migilchina baram
    Anichiveyabadenu ascharya premalo } 2
    Niluva nida dorikene nijamaina premalo } 2

  2. Na doshamulanu mosina prema
    nakai siluvanu korina prema
    Parisuddha patraga marchina prema } 2
    Asirvadimchina atmiya prema } 2