Krupanidhi neeve prabu dhayanidhi neeve prabhu కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు

Song no: 35

    కృపానిధి నీవే ప్రభు దయానిధి నీవే ప్రభు - 2
    నీ కృపలో నన్ను నిలుపుము - 2
    నీ కృపతోనే నను నింపుము  -2 ౹౹కృపా౹౹

  1. నీ కృప ఎంతో మహోన్నతము
    ఆకాశము కంటే ఎత్తైయినది - 2
    నీ సత్యం అత్యున్నతము
    మేఘములంత ఎత్తున్నది - 2 ౹౹కృపా౹౹

  2. నీ కృప జీవముకంటే ఉత్తమము
    నీ కృప లేనిదే బ్రతుకలెను - 2
    నీ కృపా బాహుళ్యంమే నను
    నీలో నివసింప చేసినది  - 2౹౹కృపా౹౹

  3. నీ కృపలను నిత్యము తలచి
    నీ సత్యములో జీవింతును -2
    నీ కృపాతిశయములనే
    నిత్యము నేను కీర్తింతును  -2 ౹౹కృపా౹౹

  4. ఈ లోకము ఆశాశ్వతము
    నీదు కృపయే నిరంతరము  -2
    లోకమంతా దూషించినా
    నీ కృప నాకంటే చాలు  -2. ...౹౹కృపా౹౹

Mahima swarupuda mruthyumjayuda maranapu mullunu మహిమ స్వరూపుడా మృత్యుంజయుడామరణపుముల్లును

Song no: 34

    మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా
    మరణపుముల్లును విరిచినవాడా
    నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములునీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు

  1. నీ రక్తమును నా రక్షణకై
    బలియాగముగా అర్పించినావు
    నీ గాయములద్వారా స్వస్థతనొంది
    అనందించెద నీలో నేను!!మహిమ స్వరూపుడా!!

  2. విరిగిన మనస్సు నలిగినా హృదయం
    నీ కిష్టమైన బలియాగముగా
    నీ చేతితోనే విరిచిన రోట్టెనై
    ఆహారమౌదును అనేకులకు!!మహిమ స్వరూపుడా!!

  3. పరిశుద్ధత్మ ఫలముపొంది
    పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై
    సీయోను రాజా నీ ముఖము చూడ
    ఆశతో నేను వేచియున్నాను !!మహిమ స్వరూపుడా!!

Meghala paina mana yesu thwaralone manakai vacchuchunnadu మేఘాల పైన మన యేసు త్వరలోనే మనకై వచ్చుచున్నాడు

Song no:

    మేఘాల పైన మన యేసు
    త్వరలోనే మనకై వచ్చుచున్నాడు (2)
    సిద్ధపడుమా ఉల్లసించుమా
    నీ ప్రియుని రాకకై (2) ||మేఘాల||

  1. ఏ ఘడియో ఏ వేళయో – తెలియదు మనకు
    బుద్ధి కలిగిన కన్యకలు వలె – సిద్ధపడియుండు (2)
    బూర శబ్దం మ్రోగగా
    ప్రభుని రాకడ వచ్చును
    రెప్ప పాటున పరిశుద్ధులు
    కొనిపోబడుదురు ప్రభువుతో ||మేఘాల||

  2. పాపం వలన వచ్ఛు జీతం – మరణమే కాదా
    దేవుని కృపయే క్రీస్తు యేసులో – నిత్య జీవమే (2)
    వినుట వలన విశ్వాసం
    కలుగును సోదరా
    దేవుని ఆజ్ఞకు లోబడితే
    పొందెదవు పరలోకం ||మేఘాల||

  3. స్తుతియు మహిమ ఘనత ప్రభావం
    యేసుకే చెల్లు గాక
    తర తరములకు యుగయుగములు
    యేసే మారని దైవం (2)
    నిత్యము ఆనందమే ప్రభువా నీతో నుండుట
    నూతన యెరూషలేము చేరుకోనుటే నిరీక్షణ ||మేఘాల||
Meghaala Paina Mana Yesu Thvaralone Manakai Vachchuchunnaadu (2)
Siddhapadumaa Ullasinchumaa Nee Priyuni Raakakai (2) ||Meghaala||

 Ae Ghadiyo Ae Velayo – Theliyadu Manaku Buddhi Kaligina Kanyakala Vale – Siddhapadiyundu (2)
Boora Shabdam Mrogagaa Prabhuni Raakada Vachchunu Reppa Paatuna Parishuddhulu Konipobaduduru Prabhuvutho ||Meghaala||

 Paapam Valana Vachchu Jeetham – Maraname Kaadaa Devuni Krupaye Kreesthu Yesulo – Nithya Jeevame (2)
Vinuta Valana Vishwaasam Kalugunu Sodaraa Devuni Aagnaku Lobadithe Pondedavu Paralokam ||Meghaala||

 Sthuthiyu Mahima Ghanatha Prabhaavam Yesuke Chellu Gaaka Thara Tharamulaku Yugayugamulaku Yese Maarani Daivam (2)

Nithyamu Aanandame Prabhuvaa Neetho Nunduta Noothana Yerushalemu Cherukonute Nireekshana ||Meghaala||

Thejo vasula swasthyamandhu nanu cherchute తేజోవాసుల స్వాస్థ్యమందు నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా

Song no: 25

    తేజోవాసుల స్వాస్థ్యమందు - నను చేర్చుటే
    నీ నిత్యసంకల్పమా నను చేర్చుటే నీ నిత్యసంకల్పమా -2
    తేజోవాసుల స్వాస్థ్యమందు ......

  1. అగ్నిలో పుటము వేయబడగా - నాదు విశ్వాసము -2
    శుద్ధ సువర్ణమగునా - నీదు రూపు రూపించబడునా -2 ॥ తేజో ॥

  2. రాబోవు యుగములన్నిటిలో - కృపా మహదైశ్వర్యం -2
    కనుపరచే నిమిత్తమేనా - నన్ను నీవు ఏర్పరచితివా -2 ॥ తేజో ॥

  3. శాపము రోగములు లేని - శాశ్వత రాజ్యము -2
    శాపవిముక్తి పొందిన - శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా -2 ॥తేజో ॥

  4. నటనలు నరహత్యలు లేని - నూతన యెరూషలేం -2
    అర్హతలేని నన్నును - చెర్చుటయే నీ చిత్తమా -2 ॥తేజో॥

Yemani varnnithu neekrupanu yerulai parene ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెనె నా గుండెలోన

Song no: 22

    ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2
    ఏమని వర్ణింతు - నీ కృపను......

  1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా – 2
    అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥

  2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
    నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥

  3. మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2
    మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥

Madhuryame na prabhutho jeevitham మాధుర్యమే నా ప్రభుతో జీవితం

Song no: 21

    మాధుర్యమే నా ప్రభుతో జీవితం
    మహిమానందమే - మహా ఆశ్చర్యమే -2
    మాధుర్యమే నా ప్రభుతో జీవితం

  1. సర్వ శరీరులు గడ్డిని పోలిన - వారై యున్నారు -2
    వారి అందమంతయు -పువ్వువలె వాడిపోవును - వాడిపోవును ॥ మాధుర్యమే ॥

  2. నెమ్మది లేకుండ విస్తారమైన - ధనముండుట కంటె -2
    దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు - ఉండుటే మేలు ॥ మాధుర్యమే ॥

  3. వాడబారని కిరీటమునకై - నన్ను పిలిచెను -2
    తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో - ఎపుడు చేరెదనో ॥ మాధుర్యమే

Nuthana yerushalemu pattanamu నూతన యెరూషలేము పట్టణము

Song no: 03

    నూతన - యెరూషలేము పట్టణము
    పెండ్లికై- అలంకరింపబడుచున్నది

  1. దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
    వారాయనకు - ప్రజలై యుందురు
    ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹

  2. ఆదియు నేనే - అంతము నేనై యున్నాను
    దుఃఖము లేదు - మరణము లేదు
    ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹

  3. అసహ్యమైనది - నిషిద్ధమైనది చేయువారు
    ఎవ్వరు దానిలో - లేనేలేరు
    ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన ౹౹

  4. దేవుని దాసులు - ఆయనను సేవించుదురు
    ముఖ దర్శనము - చేయుచునుందురు
    ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹ నూతన౹౹

  5. సీయోనులో - గొర్రెపిల్లయే మూలరాయి
    సీయోను పర్వతము - మీదయు ఆయనే
    ఆనంద - ఆనంద - ఆనందమే ౹౹నూతన౹౹