కలవంటిది నీ జీవితం - కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనది నీజీవితం - వ్యర్ధముచేయకుమా
యువకా వ్యర్ధము చేయకుమా - యువతీ వ్యర్ధముచేయకుమా
నిన్ను ఆకర్షించే ఈలోకము - కాటువేసే విషసర్పము
యువకా అది కాలు జారే స్థలము -
ఉన్నావు పాపపు పడగనీడలో నీ అంతము ఘోర నరకము -
యువకా అదియే నిత్య మరణము
నిన్ను ప్రేమించె యేసు నీ జీవితం - నూతనా సృష్టిగామార్చును పాపం క్షమియించి రక్షించును -
ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువూ - నీవు నిత్యము ఆనందింతువు } 2 {కలవంటిది}
ముద్దు మురిపాల చిన్నారి నాన్నా-సద్దు చేయకే నా చిట్టికన్నా
ఈ మాట వింటే మదిని దాచుకుంటే
నీ జీవితంలో సిరుల పంటే - ఆనందం కలకాలం నీవెంటే
జోలాలీ లాలీ జోలాలీ (2)
తల్లిదండ్రులను గౌరవించి - తనవారినెల్లను ప్రేమించి
శత్రువులను సయితము క్షమించి - పరిచారకుడుగా జీవించి
దేవాదిదేవుడే అత్యంత దీనుడై
ఎంతో తగ్గించుకొని మాదిరి చూపించెను
ఆ యేసుని అడుగులలో నడవాలి నిరతం
ఆ క్రీస్తుని బోధలలో పెరగాలి సతతం - జోలాలీ లాలీ జోలాలీ (2)
దేవుని ఉపదేశమును మరువక-దయను సత్యమునెన్నడు విడువక
బుద్ది వివేచనకై వెదకిన - భయభక్తులు యేసునియందుంచిన
సుఖజీవము కలిగి ధరలో జీవింతువు
దేవుని దృష్టిలో నీవు కృప సంపాదింతువు
నిజమైన జ్ఞానానికి యేసే ఆధారం
పరలోకం చేరేందుకు ఏకైకమార్గం - జోలాలీ లాలీ జోలాలీ (2)
నీ కృప తప్ప నాకేమి లేదయ్యా నీకృప తప్ప నా కేమి లేదయ్యా కృపా నీవే ఆధారం కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )
అన్నీ వేళలా అన్నీ కాలాల్లో ఆదరించావు (2)
ఆదరించావు నన్ను అభిషేకించావు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)
తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పారు అంటాడు
పీల్చొద్దురా అంటే ఎక్కడ రాసుందో చూపమాంటాడు } 2
దాన్ని చేసినోడే రాసిన హెచ్చరిక మరిచేడు } 2
గుండె తూట్లు పడ్డగాని దాన్ని మాత్రం విడువడు } 2 {ఎవడండీ}
సరదా అంటూ మొదాలు పెడతాడు మల్లా దానికే బానిసౌతాడు
డబ్బులన్ని తగలబెడతాడు కోరి జబ్బులెన్నో తెచ్చుకుంటాండు } 2
ఆరోగ్యమే క్షిణిస్తున్నా కళ్ళు మాత్రం తెరవడు } 2
శక్తి అంతా కోల్పోతున్నా ఎంతమాత్రం వెరవడు } 2 {ఎవడండీ}