-->
Song no:
ఎంత కృపామయుడవు యేసయ్యా – ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా /2/
నలిగితివి వేసారితీవి – నలిగితివి వేసారితీవి /2/
నాకై ప్రాణము నిచ్చితివి – నాకై ప్రాణము నిచ్చితివి /2/
బండ లాంటిది నాదు మొండి హృదయం- ఎండిపోయిన నాదు పాప జీవితం /2/
మార్చితివి నీ స్వాస్త్యముగ /2/ – ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం /2/ఎంత/
వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా – ఆదరించెను నీ వాక్యము నన్ను /2/
స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను/2/ ప్రేమతో పిలచిన నాధుడవు /2/
కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను – ఈ లోకము నను వెలివేసిన /2/
మరువలేదు నన్ను విడువలేదు /2/ – ప్రేమతో పిలచిన నాధుడవు /2/ ఎంత/
ఆదరణ లేని నన్ను ప్రేమించితివి- అభిషేకించితివి ఆత్మలోను /2/
నిలచుటకు ఫలించుటకు /2/ – అత్మతో నను ముద్రించితివి /2/ ఎంత/
Song no:
కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా ||కంటి||
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|
kanti paapanu kaayu reppalaa
nanu kaachedi yesayyaa
chanti paapanu saaku ammalaa
daachedi maa ayya
neevegaa needagaa thodugaa
neethone nenunu jeevinthu
neekannaa minnaagaa evarayyaa
naaku neeve chaalayyaa ||kanti||
maarpuleni mathsarapadani prema choopinchinaavu
deergha kaalam sahanmu choope prema nerpinchinaavu
idi evaru choopinchani prema
idi laabham aashinchani prema
idi evaru edabaapani prema
idi maranam varaku karunanu choopina prema ||kanti||
dambamu leni haddulerugani prema kuripinchinaavu
nirmalamaina nisswaardhya premanu maapai kuripinchinaavu
idi evaru choopinchani prema
idi laabham aashinchani prema
idi evaru edabaapani prema
idi maranam varaku karunanu choopina prema ||kanti||
Song no: 431
ఆహా నాకేమానందము శ్రీ యేసు నాచేఁ బట్టుచు సహాయుఁడై నాయన్నిటన్ సజీవుఁడై నడుపును. ||నా దారిఁ జూపును యేసు నా చేఁబట్టి నడుపును ఎన్నఁడు నెడబాయఁడు యేసె నా దారిఁ జూఁపును ||
యేదే స్సుఖంబు లైనన్ సదా విచార మైనను బాధాంధకార మైనను ముదంబుతోడ నుందును.
చింతేల నాకు నీ దయన్ సంతత మీవు తోడుగాన్ బంతంబు నీచేఁ బట్టుచు సంతృప్తితో నే నుందును.
నా చావు వేళ వచ్చినన్ విచార మొందక ధృతిన్ నీ చేయి బట్టి యేసుఁడా నీ చారు మోక్ష మెక్కుదున్
Song no: 555
ఆశీర్వాదము నీయుమ మా పరమజనక యాశీర్వాదము నీయుమ ఆశలుదీరంగ నాయు వొసంగుచు వాసిగ కరుణను వర్ధిల్ల బిడ్డకు ||ఆశీర్వాదము||
యేసు పెరిగిన యట్టులే నీ దయయందు ఈసు బిడ్డను పెంచుము వాసిగ మనుజుల కరుణయందున బెరుగ భాసుర వరమిచ్చి బాగుగ బెంచుము ||ఆశీర్వాదము||
నెనరు మీరగ మోషేను నెమ్మదియందు తనర బెంచినట్లుగ ఘనముగ నీ శాంతి సంతసములయందు తనర నీ బిడ్డను తగురీతి బెంచుము ||ఆశీర్వాదము||
ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో నేపుగ బెంచితివో యారీతి నీ బిడ్డ నాత్మ స్నేహమునందు కోరి బెంచుము ప్రభువ కోర్కెలూరగ వేగ ||ఆశీర్వాదము||
సత్య విశ్వాసమునందు చక్కగ బెరుగ శక్తి యొసంగినడ్పుమా సత్య వాక్యమునందు సరగను వర్ధిల్ల నిత్యము నీ కృప నిచ్చి బ్రోవుమ ప్రభువ ||ఆశీర్వాదము||
భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా బెరుగ శక్తినీయ మా ప్రభువ ముక్తి పథంబున ముద్దుగ నడువంగ యుక్తజ్ఞానము నిచ్చి యుద్ధరించుమ ప్రభువ ||ఆశీర్వాదము||
Song no: 587
ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||
ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||
ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||
ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||
నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||
చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||
Song no: 628
ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం||
ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||
అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం||
తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||
నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం||
విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానం||
అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||
దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||
Song no: 375
ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||నాలించు||
పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||నాలించు||
నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||నాలించు||
నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||నాలించు||
నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||నాలించు||