Aalinchu ma prardhana ma rakshaka yalinchu ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు

Song no: 587

    ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||
  1. ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||
  2. ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||
  3. ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||
  4. నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||
  5. చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||

Aanandhamanandha mayenu nadhu priyakumaruni ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని

Song no: 628

    ఆనందమానంద మాయెను నాదు ప్రియకుమారుని యందు ||మహదానం||
  1. ప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని ద్వేషించినావు నీవు అందుచే నీ తోటి వారికంటె ఆనందతైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను ||మహదానం||
  2. అంత్యదినముల యందున ఆ వింతకుమారునిద్వారా ఈ మానవులతోడ మాట్లాడెను సర్వమునకు తండ్రి తనయుని వారసునిగా నియమించెను ||మహదానం||
  3. తనయుండె ఆ తండ్రి మహమ ఆ తత్వంబు రూపంబు తానె ఆ మహాత్యమైనట్టి మాటలచేత సమస్తమును నిర్వహించు అందరిలో అతి శ్రేష్ఠుండాయే ||మహదానం||
  4. నీవు నాదు కుమారుడవు నిన్ను ప్రేమించి కన్నాను నేను నేడు దండిగ తనయుని ముద్దాడుడి నిండుగ వాని నాశ్రయించుడి రండి రండి ధన్యులు కండి ||మహదానం||
  5. విజ్ఞాన సంపద లెల్లను ఆ సుజ్జానిలో గుప్తమాయెను ఆ సంతోసహమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను ||మహదానం||
  6. అందరికన్న నీవెంతనో అతి సుందరుడవై యున్నావు నీవు నీ పెదవుల మీద పోయబడి నిండి యున్నది దయారసము నిన్నాశీర్వదించును తండ్రి ||మహదానం||
  7. దివ్యరారాజై కుమారుడు ఒక వెయ్యివర్షాలు పాలించును మహా అంతములేని రాజ్యమేలును యెందరు జయంబు నొందుదురో అందరును పాలించెదరు ||మహదానం||

Aalinchu deva na manavula nalimchu ఆలించు దేవా నా మనవుల నాలించు

Song no: 375

    ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
  1. సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||నాలించు||
  2. పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||నాలించు||
  3. నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||నాలించు||
  4. నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||నాలించు||
  5. నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||నాలించు||

Aanandha magu mukthi ye na mandhiramu ఆనంద మగు ముక్తి యే నా మందిరము

Song no: 347

    ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనందమగు||
  1. పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||నానంద మగు||
  2. బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||నానంద మగు||
  3. ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||నానంద మగు||

Anamdham anandham dhinadhinam anandham ఆనందం ఆనందం దినదినం ఆనందం

Song no: 630

    ఆనందం ఆనందం దినదినం ఆనందం యేసురాజు నా స్వంతమాయెనే యీ లోకమందు స్వంతవాడాయెనే నా మదిలో స్వంతమాయెను(2)
  1. తొలి బాల్యవయసులో నన్ను గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2) తన ప్రాణమును నాకర్పించి జీవం పొందుకొనుమని చెప్పెను ||ఆ..ఆనందమే||
  2. ఏ స్థితిలోనైనా ప్రభు ప్రేమతో నన్ను విడువక కాపాడును నన్ను నమ్మి యిచ్చిన బాధ్య తను ప్రభువు వచ్చువరకు కాచుకొందును ||ఆ..ఆనందమే||
  3. ప్రభువు వచ్చుదినమున తనచేయి చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును ప్రభువు సమూహమందు అచ్చటాయనతో ఆడిపాడి సంతోషించెదన్ ||ఆ..ఆనందమే||

Aadharimpumu yesuva ni nna srayimchithi ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి

Song no: 321

    ఆదరింపుము యేసువా ని న్నాశ్రయించితి నా కికన్ లేదు వేరొక యాశ్రయంబని లెస్సగా మది నమ్మితిన్ ||ఆద||
  1. నిరతముండెడు పరమ ధనమను నీతి జీవిత రీతిలో పెరుగ గోరుచు నిన్ను జేరితి ప్రేమ జూపుము యేసువా
  2. సత్య సంధుడ లోక బాంధవ సర్వశాంతి సుధాకర నిత్యజీవ జలంబు లొసగుము నీతి నిధుల సజీవుడా ||ఆద||
  3. ముందు వెనుకను దుష్ట శక్తుల మూక నన్నరి కట్టగన్ బంధితుండనైతి నా ప ద్బాంధవ విడిపించుమా ||ఆద||
  4. పరమ పురమున కరుగ నేరని పాలసుడనో రక్షకా కరుణతో నా మొరను గైకొని కలుషముల నెడబాపవే ||ఆద||
  5. పరమ ధాముడ వని యెరిగి నీ శరణు వేడితి నో ప్రభో తనువు విడిచిన వేళలో నీ తలుపు నాకై తెరువు మా ||

Aathma nadupu sa thyamu loni kipude ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే

Song no: 239

    ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||కాత్మా||
  1. ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా||
  2. అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా||
  3. నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా||
  4. సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా||
  5. దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా||