-->

Saatileni dhaivama na yesayya సాటిలేని దైవమా నా యేసయ్యా

సాటిలేని దైవమా నా యేసయ్యా
మాటతోనే చేతువు ఏ కార్యమైనా  (2)

తోడు నీడగా వెంట ఉందువు
అన్ని వేళలా ఆదుకొందువు  (2) "సాటిలేని"

బండ నుండి నీటిని - ప్రవహింప జేసావు
ఎండిన యెముకలలో - జీవాన్ని పోసావు  (2)
నీవే నాతో ఉండగా - అపజయమే లేనేలేదుగా (2) "తోడు నీడగా"

ఆశగల ప్రాణాన్ని - సంతృప్తి పరచావు
ఆకలిగొను వారిని - మేలుతో నింపావు (2)
నీవే నాతో ఉండగా - అన్యాయము నాకు జరగదుగా (2)  "తోడు నీడగా"

నా ఎడారి భూములు - తోటగా మార్చావు
సంగీత గానము - వినిపింపజేసావు (2)
నీవే నాతో ఉండగా - అపశృతులే నాలో లేవుగా (2)  "తోడు నీడగా"

Share:

Peenugu unna chota graddhala gumppulamta పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట

పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట
అందులు చూపు బాట గుంటకు చేర్చునంట
మోసపోయేవాడు ఉన్నంత కాలం
మోసాగించేవాడికి పంచభక్ష్య పరమాన్నం
పడిపోయేవాడు ఉన్నంత కాలం
పడద్రోసేవాడికి నిత్యకళ్యాణం పచ్చతోరణం *పీనుగు**

గొర్రెచర్మం కప్పుకున్న తోడేళ్ళ గుంపులవెంట
మోసపోయి సాగుతున్న జ్ఞానంలేని మనుష్యులంట
చెట్టుమంచిదైతే దాని ఫలము కూడా మంచిదేగా ....
ముండ్లపొదలలోన  మీకు ద్రాక్షపండ్లు  దొరకవుగా
కడవరి దినములలో సాతాను అనుచరుల మోసాలు అధికము...

విశ్వాస భ్రష్టత్వం అవకాశం
ఎవరిని మింగుదునాయని తిరుగుతు ఉన్నది గర్జించుసింహం
పరలోక ప్రవేశం సత్ క్రియల వలనే సాధ్యం...
ఆత్మను రక్షించే శక్తికలిగినది దేవుని వాక్యం
   /పీనుగు/

సత్యవిషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట
అబద్దాలనాశ్రయించి దుష్టుని బలమునకు లొంగేనంట
ఆక్రమము చేయువారికి ప్రభువుయొద్ద చోటుందా
దైవద్రోహనేరానికి క్షమాపణ లభిస్తుందా?
ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా ఉపయోగం ఉంటుందా?

మోసాన్ని నమ్మడమే పతనానికి తొలిమెట్టు
అసత్య భోదకులకు అదేకదా ఆయువుపట్టు
భోధను మార్చడమే అబద్దికుల కనికట్టు...
నీ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని కనిపెట్టు
      ||పీనుగు||

Share:

Yennenno kalalu kanna na chinni thanaya ఎన్నెన్నో కలలు కన్న నా చిన్ని తనయ

ఎన్నెన్నో కలలు కన్న - నా చిన్ని తనయ
ఆశలెన్నో పెట్టుకున్న - ఓ ప్రియ తనయ
నీవేగా నాప్రాణం - నీవేగా నా లోకం
నీవేగా నా రూపం - నా కన్నా

పిలిచినా ఎంత పిలిచినా పలుకవే - బదులివ్వవే ||2||
ప్రేమించే తండ్రిపై - కోపము తగునా
కాక్షించే కళ్లకే - కన్నీళ్లే మిగిలేనా
గునపాలు గుచ్చకయా - నా గుండెలో
గాయాలు చేయకయ్యా ||2||

వేదకినా ఎంత వేదకినా దొరకవే నాకు దొరకవే
నా కన్నా నీకున్న - స్నేహమే ముఖ్యమా
ఈలోక పాపమే - నాకన్న సౌఖ్యమా
నన్నెడిపించకయా - నా నాయన
నా చెంత చేరుమయ్యా ||2||

Share:

Nayakudavu neevu kreesthu sevakudavu neevu నాయకుడవు నీవు క్రీస్తు సేవకుడవు నీవు

నాయకుడవు నీవు - క్రీస్తు సేవకుడవు నీవు
మాదిరికరము అనేకులకు - నీ జీవితం (4)
నిలిచే శిఖరమై నడిచే సైన్యమై - రగిలే జ్వాలవై వెలిగే జ్యోతివై (2)
మాదిరికరముగా  మాకు తోడుగా  - మమ్మును నడిపిన నీవే
మా అన్నగ తండ్రిగ మాకు అండగా - మాతో ఉన్నది నీవే (2)

సేవలో నలుగుతూ నవ్వుతూ భోదిస్తూ కడుగుతూ వెలిగించే దీపమా (2)
గతిలేని మమ్ము గుర్తించి మాకు గురినే చూపించావే (2)
మా కష్టాలలో నష్టాలలో మాకై ప్రార్థించావే
మా జీవితాలు ప్రభు చిత్తమేమిటో గ్రహియింపజేసావే
మేమంతా నీతోనే మా అడుగు నీతోనే (2)

ప్రార్ధనే స్నేహమై వాక్యమే ప్రాణమై జీవించే కాపరివి నీవయా
ప్రభువే ఇష్టమై ఆత్మలే ముఖ్యమై సేవించే కాపరి నీవయా
మా ఆకలి మంటలో అన్నం పెట్టిన అన్న దాతవు నీవే
( అలుపేలేని నీ సేవను చేస్తూ మా ఆదర్శంగా నిలిచావు)
నిరుపెదలెందరికో చేయూత నిస్తూ క్రీస్తు ప్రేమ  కనపరచావే
జీవించు చిరకాలం బ్రతికించు కలకాలం ||2||

Share:

Na manchi silpakaruda nanu nee rupulo chekkithivi నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి

నా మంచి శిల్పకారుడా నను నీ రూపులో చెక్కితివి (2)
నా మంచి కాపరి నా యేసయ్య (2)
నను నీ మార్గములో నడిపించుచుంటివి (2) " నా మంచి"

నీదు సమరూపమే నేను ఆశించితిని నా ఆశలన్నీ నీవే తీర్చితివి (2)
నా ఎదుట ద్వారములు తెరిచితివి (2)
ముగింపువరకు నను నడిపితివి (2)  "నా మంచి"

నీవు జయించిన వారికి నీ స్తంభముగా నీ మందిరములో నిలబెట్టితివి (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నిత్యమూ నీ సన్నిధిలో నివసించుటకై (2)   "నా మంచి"

నిత్య సీయోనులో నేను నివసించుటకై పరదేశిగా ఇలలో జీవించుచుంటిని  (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
గొర్రెపిల్ల సముఖములో నేనుండుటకై (2)   "నా మంచి"

నీదు గాయాలలోనే నాకు నెమ్మది నీదు రక్తములోనే కడుగబడితిని (2)
నా ఎదుట ద్వారాములు తెరిచితివి (2)
నీదు స్వస్థతను అనుభవించితిని  (2)

Share:

Nee prematho nannu nimpumu deva నీ ప్రేమతో నన్ను నింపుము దేవా

1 కొరిథి 13:13

నీ ప్రేమతో నన్ను
నింపుము దేవా
నీ ప్రేమను పంచుట
నేర్పుము దేవా "2"
జ్ఞానమున్న కాని
విశ్వాసమున్న కాని
ప్రవచింప గల్గినకాని
ప్రేమలేని వాడనైతే
వ్యర్థుడనయ్య   "2"
                       " నీ ప్రేమతో "
(1)
నీ ప్రేమ సహానం కలది
నీ ప్రేమ దయగలది  "2"
నీ ప్రేమకు డంబము లేదు
నీ ప్రేమకు గర్వము లేదు
నీ ప్రేమకు అసూయ లేదు
నీ ప్రేమకు స్వార్ధము లేదు
నీ ప్రేమకు అమర్యాద లేదు
నీ ప్రేమకు కోపము రాదు
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించే వరమియుము "2"
                       " నీ ప్రేమతో "
(2)
నీ ప్రేమ దోషం లెక్కింపదు
నీ ప్రేమ కీడులో ఆనందించదు "2"
నీ ప్రేమ సత్యమునే సంతసించును
నీ ప్రేమ సమస్తమును భరియించును
నీ ప్రేమ సమస్తమును విశ్వసించును
నీ ప్రేమ సమస్తమును ఆశించును
నీ ప్రేమ సమస్తమును సహించును
నీ ప్రేమ శాశ్వతముగ నిలి చిపోవును
నీ ప్రేమ గుణములతో నను నింపుము
నీ ప్రేమను ప్రదర్శచించె కృపనీయుము   "2"
                       " నీ ప్రేమతో "

Share:

Preminchedha yesu raja ninne preminchedha ప్రేమించెద యేసు రాజా నిన్నే ప్రేమించెద

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ
సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts