Makartha gatti dhurgamu ne nammu ayudhambu మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు

Song no: #37

    మాకర్త గట్టి దుర్గము నే నమ్ము ఆయుధంబు సంప్రాప్తమైన కష్టములన్నిటి నణంచు ఆ పాత శత్రువెంతో క్రూరుఁడు తదాయుధములుపాయ శక్తులు అతం డసమానుండు.

  1. మేమో నశించిపోదుము మా శక్తి నిష్ఫలంబు మాకై ప్రభుని శూరుఁడు యుద్దంబు చేసిపెట్టు అతం డెవ్వఁడు? యేసు క్రీస్తను మా రక్షకుండు మరొక్కఁ డెవ్వడు? అతండె గెల్పుపొందు

  2. ప్రపంచ మంతటన్ గ్రమ్ము పిశాచు లేమి చేయు? మమ్మెల్ల మ్రింగనున్నను మాకేల భేతివేయు? ఈ లోకాధిపుఁడుగ్రుఁడైనను దానేమి చేయుఁ? దీర్పొందె నతఁడు నశించు మాటతోనే.

  3. వాక్యంబు నిత్యమే గదా విరోధి వంచ లేఁడు. దైవాత్మ తోడగుం గదా తా నిన్న నేఁడు రేపు. మా కుటుంబము మా కీర్తి, యాస్తి, ప్రాణంబు పోయినన్ నష్టంబు వానిదె రాజ్యంబు మాది యౌను.

Kamandhula kasithananiki baliavuthundhi pasithanam కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం

    కామాంధుల కసితనానికి బలిఅవుతుంది పసితనం..
    రసికందుల రతివ్రతానికి పసికందుల తర్పణం... "2"
    కడుపురగిలి క్షుద్బాదను తట్టుకునే జీవనం.
    గుండెపగిలి గొంతుఎండి అడుగుతుంది కారణం
    సమాజాన్ని ప్రశ్నించే చిన్నతనం
    ఈ సమాజానికె ఎంతో చిన్నతనం...

  1. ఆకలి అన్నవారికి అన్నము పెట్టనోడురా అనాథ అంటే..
    దిక్కులేనివారికి దారిచూపనోడురా అనాథ అంటే..
    కడుపులు చేసినోళ్ళురా..కనిపారేసినోళ్ళురా...
    కరుణేలేనివాళ్ళురా అనాథలు..
    మనసే లేనివాళ్ళురా..మనిషిగా బ్రతుకనోళ్ళురా..
    జాలే లేని రాళ్ళురా అనాధలు
    దోచుకున్న వాళ్ళకి తొడబుట్టినోళ్ళురా అనాథలంటే
    దైవాభీతి ఎరుగని నీతిలేని జనమురా అనాథలంటే

  2. పానుపు పైన పరవశములోన ఎవడో నాటిన విత్తు..
    వీదులలోన ఒంటరితనాన పెరిగెను ఓ అనాథ చెట్టు...
    జాలిలేని కళ్లు అన్ని చూసి విడిచిపోతుంటే
    మనపిల్లలు కాదుగదా మనకెందుకు అనుకుంటే
    దిక్కులేని పసికందులు గుక్కపెట్టి ఏడుస్తూ శోకంతోరాసుకున్న శోక్షమిదే అమ్మా - నాన్నలేని అనాథ ఎవరు?
    రాళ్లు రప్పలు కలిస్తే పుడతాడావాడు?
    క్షణికావేశపు కామం కొందరిదీ..
    జీవిత కాలపు క్షామం ఎందరిదీ..
    బీదల చావు కేకకి.. ఎగిరిన ఎంగిలాకురా అనాథ అంటే..
    పెద్దల పాశవికతకి అల్పుల నిష్పహాయతరా అనాథ అంటే...

  3. పాముకు పాలు పోసేభక్తులు. బీదలకు ఇవ్వరు చన్నీళ్ళు..
    గుళ్లకు లక్షలు ఆర్భాటాలు‌ అనాథ బ్రతుకులేమో బుగ్గిపాలు...
    దీనహీనులైన సాటి మనుషులని
    కనికరించి
    ఆదుకునే నాదులుగా  మీవంతుగా సాయపడితే
    పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే..
    భక్తి జీవితపు కొలమానం అదేకదా.......... గర్భం దాల్చి కన్నవాళ్లే పిల్లలూ...
    మానవతతో కన్నవాళ్ళు మనపిల్లలుకారా?
    జాలి అనే నీ కడుపు పండాలి .. ప్రేమ గర్భముందు నెలలు నిండాలి..
    దయ అనేటి నొప్పులు రావాలి.. అభ్యగులకు తల్లితండ్రి గా మారాలి.
  4. ఎవరు ఎవరు ఎవరు ఎవరు ఈ బోధకు మూలమెవరు
    అంధకార భక్తిభందురాలను తెంపినదెవరు
    మానవాళి మనోనేత్రమును తెరిపించినది ఎవరు
    విశ్వశాంతికాముకుడు రక్షకుడు ఆయనపేరు
    మంచితనపు మహోన్నతకు పరాకాష్ట ప్రభువు..
    సాటిమనిషి భాదతెలిసి సాయపడిన మన గురువు...
    ఆధ్యాత్మిక అనాథలకు నీడ నిచ్చిన తరువు..
    కారుణ్యపు నిజస్వరూపమునకే ఆయన ఋజువు..
    ప్రభుభోదకు పులకించెను స్వార్ధపు మనుజుల తనువు...
    మార్పుచెంది బీదలకై పంచిన ఆస్తులే ఋజువు.
    అందరికి ఓకే దేవుడు తండ్రి అని ఎరుగానోడురా అనాథ అంటే.
    తనవలె పొరుగువానికి ప్రేమను పంచనోడురా అనాథ అంటే.... ప్రకృతి ఎవరి సొత్తురా దైవము మనిషికిచ్చెరా దాచుకు తినేవాళ్ళురా అనాథలు
    సిరినే నమ్మినోళ్లురా పరణితి లేనివాళ్ళురా స్వార్థము నిండునోళ్ళరా అనాథలు..
    కృశించువారిని సహించనోళ్ళురా అనాథలంటే..
    శుష్కించువారని పోషించు వాళ్ళురా పునీతులంటే..
    నశించువారికై కృశించుపోయెరా దయగల క్రీస్తు...
    ఆనాధజీవుల ఉషస్సుకోరు నా మాదిరి క్రీస్తు...

Sarvadhbuthambulan sarvathra jeyukarthan సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన

Song no: #36

  1. సర్వాద్భుతంబులన్ సర్వత్రఁ జేయుకర్తన్ సర్వాత్మ లింతటన్ శ్లాఘింపఁ జేరరండి! మా రాకపోకలన్ మం వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును

  2. మహా దయాళుఁడే మా జీవకాలమంత సహాయమూరటన్ సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్మున్ ఎన్నండుఁ బ్రోచును.

  3. ప్రపంచపాలకా! ప్రసిద్ధుఁదైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ త్ర్యేకుండా! ప్రఖ్యాతికల్గగా అపారసన్నుతి నర్పింతు సర్వదా

Iennallu maku sayamai yi mundhukunu ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును

Song no: #35

  1. ఇన్నాళ్లు మాకు సాయమై యీ ముందుకును మా యున్నత గృహ మండవై యొప్పెడు దైవమా!

  2. ఏలాటి యీతిబాధయు నీవచ్చు యేఁటిలో కలుగకుండఁ బ్రోవవే ఘనంపు ప్రేమతో

  3. నీ సింహాసన నీడలో నిలుచు భక్తులు భయంబు చింతబాధలన్ జయించి మందురు

  4. చరాచరంబు లెల్లను జనించుకంటె ముందార తరాలనుండియున్ నీరాజ్య మండెడున్

  5. ఇన్నాళ్లు మాకు సాయమై యేలుచుఁ గాచిన ఉన్నత ప్రభు ప్రేమతో మన్నించు మింకనున్

Sarvesa rammu nee sannidhi kanthi nosamgu maku సర్వేశా రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు

Song no: #34

    సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొసంగు మాకు సత్య సనాతన సర్వాధికారుఁడా సదా మమ్మేలుము సర్వోన్నతా!

  1. నిత్యంపు వాక్యమా! నీదగు ఖడ్గము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మీర

  2. రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లఁగన్

  3. స్తోత్రం పవిత్రుఁడా! స్తోత్రంబు త్ర్యేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మీ, "త్రాహిమాం" యని వేఁడు వారి

Yehova gaddhe mumdhata janambulara mrokkudi యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి

Song no: #33

  1. యెహోవ గద్దె ముందట జనంబులార మ్రొక్కుఁడి యెహోవ దేవుఁడే సుమీ సృజింపఁ జంపఁ గర్తయే
  2. స్వశక్తిచేత నాయనే మమున్ సృజించె మట్టిచే భ్రమించు గొఱ్ఱె రీతిగాఁ దప్పంగ మళ్లీ చేర్చెను
  3. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధిచేతు మాయనన్ జగత్తు వేయి నోళ్లతో స్తుతించు దివ్యమౌ ధ్వనిన్
  4. ప్రభుత్వ ముండు నంతకున్ అగున్ నీ ప్రేమ నిత్యము చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము

Dhahana bali neeku nanistamu mariyu dhaiva balulu దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు

Song no: #32

    దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||

  1. నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|

  2. అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||